Tulasi.. మీ ఇంట్లో ఉండే తుల‌సి మొక్క‌ను బ‌ట్టి మీ భ‌విష్య‌త్ చెప్పేయొచ్చు.. ఎలాగంటే..?

Tulasi..  తులసి ఆకు ఉపయోగాల గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో చాలా ఔషద గుణాలుంటాయి. చాలా మంది తమ ఆరోగ్యం కోసం ఈ ఆకులను ప్రతి రోజూ తింటుంటారు. జలుబు చేసిన వారు ఈ ఆకులను తినడం వల్ల దాని నుంచి ఉపశమనం పొందవచ్చు. కొందరు చాయ్ లోనూ దీనిని వాడుతుంటారు. ఈ చెట్టు ఆకులను వివిధ ఔషదాల్లోనూ వినియోగిస్తారు. పూర్వం ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండేది. ఆ చెట్టుకు ప్రతి […].

By: jyothi

Updated On - Tue - 30 November 21

Tulasi.. మీ ఇంట్లో ఉండే తుల‌సి మొక్క‌ను బ‌ట్టి మీ భ‌విష్య‌త్ చెప్పేయొచ్చు.. ఎలాగంటే..?

Tulasi..  తులసి ఆకు ఉపయోగాల గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో చాలా ఔషద గుణాలుంటాయి. చాలా మంది తమ ఆరోగ్యం కోసం ఈ ఆకులను ప్రతి రోజూ తింటుంటారు. జలుబు చేసిన వారు ఈ ఆకులను తినడం వల్ల దాని నుంచి ఉపశమనం పొందవచ్చు. కొందరు చాయ్ లోనూ దీనిని వాడుతుంటారు. ఈ చెట్టు ఆకులను వివిధ ఔషదాల్లోనూ వినియోగిస్తారు. పూర్వం ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండేది.


ఆ చెట్టుకు ప్రతి రోజూ పూజలు చేసేవారు. దానికి తోడు తులసి ఆకులతో ఆరోగ్యానికి చాలా లాభం చేకూరుతుంది. కానీ ప్రస్తుతం చాలా మంది ఇళ్లల్లో ఇది కనిపించడం లేదు. ఈ మొక్క మనకు భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను సైతం సూచిస్తుంది. ఇంట్లో ఉన్న తులసి చెట్టుకు రెగ్యులర్ గా నీటిని పోస్తూ.. కేర్ తీసుకోవాలి. ఇంట్లో ఉన్న తులసి చెట్టు ఎండిపోయిందనుకోండి.. చెడు జరుగుతుందని నమ్మకం. ఒకవేళ మొక్క ఒక్కసారిగా ఎండిపోతే దాని స్థానంలో కొత్త మొక్కను ఏర్పాటు చేసుకుని పూజలు చేస్తూ ఉండాలి. మొక్క నాటిన తర్వాత కొద్ది రోజుల్లో మొక్క ఆకులు రాలిపోవడం స్టార్ట్ అయితే జాగ్రత్తగా ఉండాలి. పితృ దోషానికి ఇది సంకేతమట. దీని వల్ల ఇబ్బందులు ఎదురయ్యే చాన్స్ ఉంది.


మొక్క పచ్చగా మారి పెరుగుతూ ఉంటే.. లేదా ఉన్నట్టుండి ఆకు పచ్చగా మారితే అది మంచికి సూచికగా భావిస్తారు. తులసి మొక్క సజీవంగా ఉన్న చోట విష్ణువు, లక్ష్మీ అనుగ్రహం ఉంటుందని నమ్మకం. ఇలాంటి ఇళ్లలో ఎప్పడూ ఆనందం వెళ్లి విరుస్తుందట. ఆదివారం, ఏకాదశి మినహా మిగిలిన రోజులలో తులసి చెట్టుకు క్రమం తప్పకుండా నీరు పోయాలి.

tulasi

tulasi

ఎప్పుడూ ఈ మొక్కకు పూజలు చేయాలి. సాయంత్రం సమయంలో తులసి చెట్టు వద్ద దీపం వెలిగిస్తే ఆ కుటుంబానికి మంచి జరుగుతుంది. ఏకాదశి, ఆదివారం, ఇతర పవిత్రమైన రోజుల్లో తులసి మొక్క నాటవద్దు. చెట్టు పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచకోవాలి. అపరిశుభ్రంగా ఉంటే మంచి కాదని నమ్ముతారు.


ఇక తులసి మొక్క ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. ఇందులో ఉండే ఔషధ గుణాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఈ ఆకులను తినడం వల్ల ఆ ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు. ప్రతి రోజూ 4 తులసి ఆకులను నమలడం వల్ల ఆరోగ్యానికి ఎంతో లాభం. పిల్లలకు సైతం చిన్నతనం నుంచే వీటిని తినడం అలవాటు చేయడం మంచింది.

Tags

Related News