Varahi Devi: వరాహి దేవి : తాంత్రిక విద్యల కోసం కొలిచే అమ్మవారు..

Varahi Devi: కొన్ని దేవాలయాల్లో వరుసగా పేర్చ బడిన అమ్మవార్ల మూర్తులను చూస్తుంటాం. వారినే సప్త మాత్రికలుగా పూజిస్తాం. ఎటువంటి భయాలనైనా పారద్రోలగల శక్తి సామర్ఱ్యాలు ఈ సప్త మాత్రికలకు ఉంటాయని భక్తుల విశ్వాసం. సప్త మాత్రికలు ఎవరు.? ఎలా ఉద్భవించారు.? బ్రాహ్మణి, వైష్టవి, మహేశ్వరి, ఇంద్రాణి, వరాహి, కౌమారి, చాముండ, నరసింహీ, వినాయకీగా పిలవబడే సప్త మాత్రికల్లో ఒకరుగా వరాహ దేవి అమ్మవారిని చెబుతారు. విష్ణుమూర్తి అవతారాల నుండి ఉద్భవించిన వారే ఈ సప్త మాత్రికలు. […].

By: jyothi

Published Date - Tue - 21 September 21

Varahi Devi: వరాహి దేవి : తాంత్రిక విద్యల కోసం కొలిచే అమ్మవారు..

Varahi Devi: కొన్ని దేవాలయాల్లో వరుసగా పేర్చ బడిన అమ్మవార్ల మూర్తులను చూస్తుంటాం. వారినే సప్త మాత్రికలుగా పూజిస్తాం. ఎటువంటి భయాలనైనా పారద్రోలగల శక్తి సామర్ఱ్యాలు ఈ సప్త మాత్రికలకు ఉంటాయని భక్తుల విశ్వాసం.

సప్త మాత్రికలు ఎవరు.? ఎలా ఉద్భవించారు.?

బ్రాహ్మణి, వైష్టవి, మహేశ్వరి, ఇంద్రాణి, వరాహి, కౌమారి, చాముండ, నరసింహీ, వినాయకీగా పిలవబడే సప్త మాత్రికల్లో ఒకరుగా వరాహ దేవి అమ్మవారిని చెబుతారు. విష్ణుమూర్తి అవతారాల నుండి ఉద్భవించిన వారే ఈ సప్త మాత్రికలు. బ్రహ్మ నుండి బ్రాహ్మణి, విష్ణువు నుండి వైష్ణవి, పరమేశ్వరుని నుండి మహేశ్వరి, ఇంద్రుని నుండి ఇంద్రాణి, వరాహావతారం నుండి వరాహి, స్కంధ నుండి కౌమారీ, నరసింహావతారం నుండి నరసింహి, వినాయకుని నుండి వినాయకీ సప్త మాత్రికలుగా ఉద్భవించారు. వారిలోని వరాహి అవతారం ప్రత్యేకమైనది. ఆమె వరాహి దేవిగా పిలవబడుతూ, ఆ పరమేశ్వరుని క్షేత్రానికి క్షేత్ర పాలికగా కాపు కాస్తోంది.  అంత ప్రత్యేకత ఉన్న ఈ వరాహి దేవి అమ్మవారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వరాహ మూర్తి అని దశావతారాల్లో విష్ణు మూర్తిని కొలుస్తుంటాం. వరాహా మూర్తిగా తన ముక్కుపై భూగోళాన్ని మోస్తున్నట్లుగా మహా విష్ణువు రూపం అందరికీ సుపరిచితమే. అయితే, వరాహి దేవి అనే పేరు మాత్రం ఇంతవరకూ ఎవ్వరూ విని ఉండరు. ఎవరీ వరాహి దేవి.? సప్త మాత్రికల్లో ఒకరుగా చెప్పబడుతున్న ఈ అమ్మవారు ఎక్కడుంది.?

కాశీ క్షేత్ర పాలికే ఈ సప్తమాత్రిక..

సాక్షాత్తూ పరమ శివుడు కొలువై ఉన్న కాశీ పట్టణానికి క్షేత్ర పాలికగా వరాహిదేవిని కొలుస్తారట.  చాలా చోట్ల శివుడే క్షేత్ర పాలకుడుగా ఉంటాడు. కానీ, ఆ పరమ శివునికే ఈ వరాహి దేవి క్షేత్ర పాలికగా ఉందన్న మాట. కాశీ పట్టణానికే కాదు, తంజావూర్  బృహదీశ్వరాలయానికీ ఈ మాత క్షేత్ర పాలికగా కాపలా కాస్తోందట.  తంజావూర్ బృహదీశ్వరాలయంలో ఈ అమ్మవారికి ప్రత్యేకంగా ఓ ఆలయం ఉంది. ఆ ఆలయంలో అమ్మ నల్లని రాతితో వరాహ ముఖంతో నిండుగా, ఉగ్రరూపంలో దర్శనమిస్తుంది. ఆ రూపాన్ని చూడాలంటే, నిజంగా పెట్టి పుట్టాలంతే అన్నట్లుగా ఉంటుంది అమ్మవారి రూపం ఇక్కడ. అలాగే, కాశీ నగరంలో అయితే, నీలి రంగులో దర్శనమిస్తుంది. వరాహ రూపంలోనే ఆరు చేతులూ శంఖు, సుదర్శన చక్రాలతో శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తుంది. సప్త మాత్రికలందరిలోనూ ఈ అమ్మవారు అత్యంత ప్రత్యేకమట. అందుకే అమ్మను క్షేత్ర పాలిక అంటారు. చాలా శక్తివంతురాలిగా వరాహి దేవిని స్తుతిస్తారు. రాక్షసులను మట్టు పెట్టే సమయంలో ఆమె చూపిన తెగువకు చిహ్నంగానే  ధైర్యసాహసాలకు ప్రతీకగా ఆమెను కొలుస్తారు.

ఈ అమ్మవారిని ఎందుకు కొలుస్తారంటే,

ధైర్యానికి ప్రతీకగా ఈ అమ్మను కొలుస్తారట. భారతదేశంలోనే కాదు, నేపాల్ వాసులు కూడా వరాహి దేవిని ప్రత్యేకంగా పూజిస్తారట. బుద్ధిజంలోనూ వరాహి దేవి ప్రస్థావన ఉంది. బుద్ధిజంలో వరాహి దేవిని వజ్రవరాహి, వజ్ర యోగిని అని పిలుస్తారు. ఎక్కువగా తాంత్రిక విద్యల కోసం నేపాల్ వాసులు ఈ అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారట. అయితే, చెడు కోసం వాడే తాంత్రిక విద్యలు కావట. మంచి కోసం ఉపయోగించే తాంత్రిక విద్యల కోసమే అమ్మవారిని కొన్ని ప్రత్యేక పూజలతో ప్రసన్నం చేసుకుంటారనీ తెలుస్తోంది. బెనారస్, తంజావూరుతో పాటు, ఇండియాలోని మరికొన్ని ఆలయాల్లో వరాహి దేవి విగ్రహాలు కనిస్తాయట.

 

Latest News

Related News