Vastu Shastra : చాలా మంది పర్సులో దేవుడి ఫొటోలను పెట్టుకోవడం మనం చూడొచ్చు. కానీ, వాస్తు ప్రకారం దేవుడి ఫొటోలను పర్సులో అస్సలు పెట్టుకోవద్దట. దేవుడి ఫొటోతో పాటు ఇంకా పలు వస్తువులను పర్సులో పెట్టుకోవద్దట అవేంటో తెలుసుకుందాం.
Vastu Shastra gents
హిందూ మత విశ్వాసాల ప్రకారం వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఏదేని పని చేసే ముందర
వాస్తు శాస్త్రం ప్రకారం పలు విషయాలు తెలుసుకోవాలట. ముఖ్యంగా పర్సులో ఈ వస్తువులను అస్సలు క్యారీ చేయొద్దని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఈ వస్తువులను పర్సులో పెట్టుకోవడం వలన అవి జీవితంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయని వివరిస్తున్నారు. కాబట్టి వాస్తు శాస్త్ర నిపుణులు సూచించే సలహాలు తప్పకుండా పాటించండి..
ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం చాలా మంది తమ పర్సులో దేవుడి ఫొటోను పెట్టుకుంటుంటారు. కానీ, అలా దేవుడి ఫొటోలు పెట్టుకోవడం వల్ల అప్పుల భారం పెరుగుతుందని వివరిస్తున్నారు. ఫలితంగా పలు విషయాల్లో జీవితంలో చాలా అడ్డంకులూ ఎదురవుతాయని అంటున్నారు.
Vastu Shastra gents
దేవుడి ఫొటోతో పాటు ఏదేని వస్తువులకు సంబంధించిన కొనుగోలు చేసిన బిల్లులను అస్సలు ఉంచుకోవద్దట. అలా పాతబిల్లులను పెట్టుకోవడం వల్ల వాస్తు శాస్త్రం ప్రకారం నష్టం కలుగుతుందట. అలా పాత బిల్లులు పెట్టుకోవడం వలన లక్ష్మీ దేవి రాదట. చాలా మంది చనిపోయిన తమ కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం వారి ఫొటోలు పర్సులో పెట్టుకుంటుంటారు. కానీ, అలా పెట్టుకోవడం మంచిది కాదట. వాస్తు శాస్త్రం ప్రకారం అలా చనిపోయిన వ్యక్తి ఫొటోను పర్సులో పెట్టుకుంటే అరిష్టమట. ఇలా చేస్తే వ్యక్తులకు ఆర్థికంగా తీవ్రమైన ఇక్కట్లు ఎదురయ్యే అవకాశాలుంటాయని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు.
ఏదేని లాక్‌కు సంబంధించిన కీని ఎప్పుడూ మీ పర్సులో పెట్టుకోవద్దట. అలా కీని పర్సులో పెట్టుకోవడం వలన లైఫ్‌లో ప్రతికూలతలు ఎదురై ఆర్థిక ఒత్తిడికి దారి తీసే పరిస్థితులు ఉంటాయని చెప్తున్నారు. వాస్తు శాస్త్రం నమ్మి ఇటువంటి పనులు చేసిన వారికి మంచి ప్రయోజనాలున్నాయని కొందరు పేర్కన్నారు. నమ్మకాలు ఒక్కొక్కరికి ఒకోదానిపై ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ విషయాలను ఫాలో అయితే కనుక తప్పకుండా చక్కటి ఫలితాలుంటాయని కొందరు చెప్తున్నారు. అయితే, నమ్మకాల విషయంలో ఎవరినీ ఎప్పుడూ ఫోర్స్ చేయకూడదు. వ్యక్తిగత నమ్మకాలు ఒక్కొక్కరికి ఒక్కో అంశంపైన ఉంటాయి. అలానే వాస్తు శాస్త్రంపైన కూడా నమ్మకం పెట్టుకుని ముందుకు సాగే వారు చాలా మందే ఉంటారు. వారు ఈ రూల్స్ ఫాలో అయితే తప్పకుండా చక్కటి ప్రయోజనాలుంటాయి.