Vastu Tips : ఈ వాస్తు చిట్కాలు పాటించాల్సిందే.. లేదంటే లక్ష్మీదేవి కటాక్షానికి నోచుకోరు..!

Vastu Tips : మన ఇంట్లోని వాస్తు దోషాల కారణంగా చాలా మంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. వాటి నుంచి ఎలా బయట పడాలో వారికి తెలియదు. .

By: jyothi

Updated On - Wed - 21 September 22

Vastu Tips  : ఈ వాస్తు చిట్కాలు పాటించాల్సిందే.. లేదంటే లక్ష్మీదేవి కటాక్షానికి నోచుకోరు..!

Vastu Tips : మన ఇంట్లోని వాస్తు దోషాల కారణంగా చాలా మంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. వాటి నుంచి ఎలా బయట పడాలో వారికి తెలియదు. దీంతో ఇంట్లోని కుటుంబసభ్యులు నానా అవస్థలు పడుతుంటారు.కొందరు అనారోగ్య కారణాల వలన..ధననష్టం జరగడం.. కుటుంబ కలహాలు, భూముల పంచాయితీ.. ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు చెడిపోవడం, బంధువులతో మాటలు పడటం ఇలా అన్నింటికి ఒకటే.. వాస్తుదోషం ప్రధాన సమస్య అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాస్తు దోష నివారణకు ఏం చేయాలి..

డబ్బు అనేది మనిషి జీవితంలో చాలా కీలకం. డబ్బే లేకపోతే ఆధునిక సమాజంంలో మనిషి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ధనమేరా అన్నింటికి మూలం అని తెలుగులో ఒక పాట కూడా ఉంది. డబ్బు ప్రపంచాన్ని శాసిస్తుంది.రాజ్యాలను కూలుస్తుంది. వ్యక్తులను నియంతలుగా మారుస్తుంది. మనుషులను బొమ్మలుగా చేసి ఆడిస్తుంది. డబ్బు ధనలక్ష్మికి మరో రూపం అని పిలుచుకుంటారు భారతీయులు.

అయితే,వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారి కోసం వాస్తు నిపుణులు కొన్ని సూచనలు, జాగ్రత్తలు చెబుతున్నారు. ఇలాంటి పొరపాట్లు చేయడం వలన ధనలక్ష్మి కాటాక్షానికి దూరం అవుతారని హెచ్చరించారు. అందుకే వాస్తు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నారు.వాస్తు శాస్త్రం ప్రకారం ఆర్థిక శ్రేయస్సును ఆకర్షించడానికి ఈ ఐదు అంశాలు దోహదపడుతాయని అంటున్నారు.

ఇంట్లో వాస్తుదోష నివారణకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముందుగా గోడ రంగు చూసుకోవాలి. గదికి తూర్పున తెలుపు, పశ్చిమాన నీలం, ఉత్తరాన ఆకుపచ్చ, దక్షిణాన ఎరుపు రంగులను వాడాలి. ఇక డబ్బును ఇంట్లోసరైన ప్రదేశంలో భద్రపరచాలి.మనం డబ్బు దాచే లాకర్ తలుపు ఎల్లప్పుడూ ఉత్తరాన ఉండాలి. ఇల్లును ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పిగ్గీ బ్యాంకును ఉత్తర దిశలో ఉంచాలి.రాగి స్వస్తిక్ గుర్తును మీ ఇంటికి ఆగ్నేయ దిశలో ఉంచాలి.ఉత్తరం, పశ్చిమం లేదా ఆగ్నేయ దిశల్లో డస్ట్‌బిన్ ఉంచకూడదు.ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆర్థిక నష్టం కలుగకుండా ఉంటుంది.

Read Also : Rhee Chakraborty :చీర కట్టులో హాట్ లుక్స్ అదిరిపోయిందిలే రియా పాపా

Read Also : Shani : ఛాన్స్ ల కోసం రాజమౌళి గారి వెంట పడ్డాను…….. షానీ

Related News