Vastu Tips: మన లైఫ్ లో జ్యోతిష్య శాస్త్రం ఎంత కీలకమో వాస్తు శాస్త్రం కూడా అంతే కీలకం.. చాలా మంది వాస్తు శాస్త్రాన్ని పాటిస్తూ ఉంటారు.. వాస్తు ప్రకారం కొన్ని చిట్కాలు పాటిస్తే మనం చిన్న చిన్న సమస్యల నుండి పెద్ద సమస్యల వరకు చాలా వాటిని తప్పించు కోవచ్చు.. ఇంకా ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉండాలంటే కొన్ని వాస్తు చిట్కాలు పాటించాలి అని నిపుణులు చెబుతున్నారు.
అందుకు మీ ఇంట్లో మీరు కొన్ని మొక్కలను నాటాలని వారు సూచిస్తున్నారు. ఈ మొక్కలు మీరు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా సంతోషంగా ఉండడానికి తోడ్పడతాయి అని చెబుతున్నారు. ఆ మొక్కలలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే మొక్క మీ ఇంట్లో ఉన్న అన్ని సమస్యలను తీరుస్తుంది అని చెబుతున్నారు..
మరి ఆ మొక్క ఏంటో తెలుసా.. పియోని.. ఈ మొక్క వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.. పియోని మొక్క వాస్తు, ఫెంగ్ షుయ్ పువ్వుల రాణి అని కూడా పిలుస్తారు.. ఈ పూల మొక్కను ఇంట్లో ఉంచుకోవడం వల్ల దోషాలు దూరం అవుతాయట.. ఈ మొక్కను మీ ఇంటికి నైరుతి దిశలో పెంచడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయట..
మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఈ మొక్క దూరం చేస్తుంది అని పాజిటివ్ ఎనర్జీ పెంచుతుంది అని అంటున్నారు.. అలాగే పియోని మొక్క మీ ఇంట్లో ఆనందం, శాంతిని పెంచుతుంది.. మొక్కను మీ ఇంట్లో పెంచడానికి స్థలం లేకుంటే ఈ మొక్క ఫోటోను దక్షిణం లేదా పడమర వైపు గోడపు అతికించండి.. ఈ మొక్క వల్ల కుటుంబంలో ప్రేమ, నమ్మకం పెరుగుతాయని చెబుతారు.. అలాగే పిల్లలు లేని వారు ఈ మొక్క నాటుకుంటే పిల్లలు పుడతారట..
Read Also : Pawan Kalyan-Balakrishna : పవన్ పెళ్లిళ్ల గురించి సంచలన స్టేట్ మెంట్ ఇచ్చిన బాలయ్య.. ఆనందంలో పవన్..!
Read Also : Monal Gajjar : డిఫరెంట్ యాంగిల్లో ఫోటోలకు ఫోజులిచ్చిన టాలీవుడ్ బ్యూటీ.!