Vastu :జనరల్‌గా టెంపుల్ అనగానే అందరూ ఊరిలోని గుడినో లేదా ప్రఖ్యాతి గాంచిన ఆలయాలనే అనుకుంటారు. కానీ, ప్రతీ ఒక్కరి ఇంట్లో ఉండే గుడి కూడా చాలా ముఖ్యమైనది. సనాతన హిందూ సంప్రదాయాల ప్రకారం.. భగవంతుడి ఆరాధన ఇంటిలోపల కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా ప్రతీ హిందువు తన ఇంట్లో భగవంతుడిని ప్రతిష్ఠించుకుని పూజ చేస్తుంటాడు. కాగా, గుడి నిర్మాణంలో, పూజలు విషయంలో ఈ తప్పులు అస్సలు చేయొద్దని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. అవేంటో తెలుసుకుందాం..
ప్రతీ హిందువు తన ఇంట్లో దేవుడి కోసం సెపరేట్‌గా ఓ రూం కన్‌స్ట్రక్ట్ చేసుకుంటాడు. ఈ క్రమంలోనే ఆ గది ఆధ్యాత్మికతకు కేంద్రంగా నిలవాలని అనుకుంటాడు. అయితే, సానుకూల శక్తి అనగా పాజిటివ్ వైబ్స్ ఆ గది నుంచి బయటకు వస్తుంటాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా దేవుడి నుంచి తమకు అనుగ్రహం, సిద్ధి, బుద్ధి లభిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. అయితే, ఆ ఆలయం లేదా గది నిర్మాణానికి సంబంధించి ఈ వాస్తు నియమాలను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.
ఈశాన్యం, ఉత్తరం దిశలో దేవుడి కోసం గదిని నిర్మించాలి. అలా చేసిన తర్వాత దేవుడి ఆరాధన చేయాలి. అలా చేయడం ద్వారా మీ ముఖం తూర్పు వైపున ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. మీ ముఖం తూర్పు వైపునకు ఉండేలా ప్లాన్ చేయాలి. ఇక ఇంట్లో కన్ స్ట్రక్ట్ అయ్యే గుడి ఎత్తు దాని వెడల్పు కంటే కూడా రెండింతలు అధికంగా ఉండాలి. పూజ గదిలో ఉండేటువంటి విగ్రహాలు అన్నీ కూడా మీ హృదయానికి సమానమైన హైట్‌లో ఉండాలి.
vasto housr
వాస్తు ప్రకారం..ఇంటి గుడిలో ఎప్పుడూ కూడా అతి పెద్ద విగ్రహాలను పెట్టకూడదు. పూజా మందిరంలో తక్కువ ఎత్తున్న విగ్రహాలనే ప్రతిష్టించుకోవాలి. ఇకపోతే ఏదేని అనుకోని చర్య వల్ల విగ్రహాలు విరిగినట్లయితే వాటిని అలానే ఉంచుకోకూడదు. ముఖ్యంగా విరిగిన విగ్రహాన్ని పూజ గదిలో అస్సలు ఉంచకూడదు. చిరిగిపోయిన లేదా పాడైపోయిన విగ్రహం కాని ఫొటో కాని ఉన్నట్లయితే వాటిని అలాగే పడేయకూడదు. పవిత్రమైన ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ వాటిని పాతిపెట్టాలి.
ఇకపోతే పూజ గదిలో చనిపోయిన వారి ఫొటోను ఉంచొద్దు. ఇంట్లో నిర్మించుకునేటువంటి ఆలయానికి కాంతి, శుభం కలగలిసిన కలర్స్ వేసుకోవాలి. లైట్ యెల్లో, బ్లూ, నారింజ కలర్స్ వేయొచ్చు. ఇంటి లోపల ఉన్నటువంటి గుడికి షైనింగ్ కలర్స్ వేయొద్దు. ఇక మరిచిపోయి అయినా సరే బ్లాక్ కలర్ అస్సలే వేయొద్దు. ఇకపోతే పూజ గదిని మెట్ల కింద కాని, టాయ్‌లెట్ పక్కన కాని అస్సలు నిర్మించొద్దు. అలా చేయడం వల్ల ఇంటి లోపల అనుకోని సమస్యలు వస్తాయి.