Wall clock.. వాస్తు. ఇది చాలా ఇంపార్టెంట్ అని కొందరు నమ్ముతారు. అటువంటి వారు ఎటువంటి విషయాలు జరిగినా కూడా వాస్తు వలనే జరిగాయని నమ్ముతారు. అటువంటి వారు ప్రతి విషయం శాస్త్ర ప్రకారం ఉండాలని అనుకుంటారు. అటువంటి వారికి ప్రతీది ఎలా ఉండాలో వాస్తు శాస్త్రంలో పొందుపరిచి ఉంటుంది. గోడ గడియారం ఎటువంటి దిశలో ఉందో అనేది కూడా వాస్తు శాస్త్రంలో ఉంది.
గడియారం. దీనితో కేవలం సమయం మాత్రమే తెలుస్తుందని అంతా అనుకుంటారు. కానీ సమయంతో పాటు దీని మీద వాస్తు మరియు మన అదృష్టం కూడా ఆధారపడి ఉంటుంది. అందుకోసమే ఈ గడియారం ఉండే దిశను గురించి తెలుసుకోవాలి. లేకపోతే అనేక సమస్యలు వస్తాయని కూడా అనేక మంది విశ్వసిస్తారు. అందుకోసమే ఈ విషయాలను తెలుసుకోవడం చాలా అవసరం.
వాస్తు ప్రకారం గోడ గడియారం అనేది తూర్పు దిక్కునే ఉండాలని వాస్తు పండితులు పేర్కొంటున్నారు. తూర్పు దిశ అనేది గడియారానికి ఉత్తమ దిశ. తూర్పు దిశలో గోడ గడియారం కనుక ఉంటే అదృష్టం వరిస్తుందని అనేక మంది విశ్వసిస్తారు. గడియారంలో ఉండే లోలకాన్ని చాలా కేర్ గా చూసుకుంటారు. దీనిని ఇంటికి ఉత్తరాన, లేదా తూర్పు దిశలో ఉండేలా మనం చూసుకోవాలి. మన ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా గోడ గడియారాన్ని దక్షిణం వైపున మాత్రం ఉంచకూడదు. దక్షిణాన్ని స్తబ్దత దిశ ఉన్న దిశగా పరిగణిస్తారు. దక్షిణం వైపు కనుక గోడ గడియారాన్ని ఉంచితే ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. దీని వలన ఇంట్లోని వ్యక్తులు అనేక రకాలుగా అనారోగ్యాలకు గురవుతారని విశ్వసిస్తారు.
Wall clock-1
కొంత మంది తలుపు మీద గోడ గడియారాన్ని ఉంచుతారు. ఇలా చేయడం ఎంత మాత్రం మంచిది కాదు. గోడ గడియారాన్ని వాస్తు ప్రకారంగా ఏ తలుపు మీద ఉంచకూడదట. ఇలా చేయడం వలన గడియారం చెడు ప్రభావాన్ని చూపుతుందని చెబుతారు. విరిగిపోయి ఉన్న గడియారాన్ని మరిచిపోయి అస్సలుకే ఉంచకూడదట. ఇలా ఉంచడం వలన దురదృష్టం మనల్ని వెంటాడుతుందని విశ్వసిస్తారు.
చేతి గడియారానికి కూడా వాస్తు నియమాలు ఉంటాయి. చేతి గడియారాన్ని ఎక్కువగా మణికట్టుకే ధరించాలి. లూజుగా ఉండే వాచీలను అస్సలుకే పెట్టుకోవద్దు. ఇలా లూజు వాచీలను వాడడం వలన మీకు అసౌకర్యం కలగడం మాత్రమే కాకుండా ఇవి మీ వైఫల్యాలకు కారణమవుతాయి. మన వాచీ రంగు విషయానికి వస్తే బంగారం మరియు వెండి రంగుల గడియారాలు చాలా మంచివి. మీరు ఏదైనా ఉద్యోగం కోసం వెళ్తున్నపుడు లేదా ఏదైనా పరీక్షకు హాజరయినపుడు ప్రత్యేకంగా ఇటువంటి వాచీని ధరించాలి.