Kama Devudu: మన్మధ బాణం అంటే ఏంటీ.? కాముడికి అంత శక్తి ఉందా.?

Kama Devudu: ప్రేమకూ ఆకర్షణకూ నిదర్శనంగా మన హిందూ పురాణాల్లో రతీదేవి, మన్మధుని ప్రస్థావన వింటుంటాం. అందంలో రతీదేవిని మించిన స్ర్తీ లేదంటారు. అందుకే ఆమె ప్రేమలో పడని వారుండరంటారు. అలాగే మన్మధుడు కూడా. మన్మధ బాణం అనే మాట ప్రేమ విషయంలో వింటుంటాం. ఎంతటి వారైనా మన్మధ బాణం నుండి తప్పించుకోలేరని అంటుంటారు. అలాంటి రతీదేవి, మన్మధుల గురించి మనకు తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం . అసలింతకీ మన్మధుడూ రతీదేవి ఎవరు.? ప్రేమకీ, […].

By: jyothi

Published Date - Sun - 5 September 21

Kama Devudu: మన్మధ బాణం అంటే ఏంటీ.? కాముడికి అంత శక్తి ఉందా.?

Kama Devudu: ప్రేమకూ ఆకర్షణకూ నిదర్శనంగా మన హిందూ పురాణాల్లో రతీదేవి, మన్మధుని ప్రస్థావన వింటుంటాం. అందంలో రతీదేవిని మించిన స్ర్తీ లేదంటారు. అందుకే ఆమె ప్రేమలో పడని వారుండరంటారు. అలాగే మన్మధుడు కూడా. మన్మధ బాణం అనే మాట ప్రేమ విషయంలో వింటుంటాం. ఎంతటి వారైనా మన్మధ బాణం నుండి తప్పించుకోలేరని అంటుంటారు. అలాంటి రతీదేవి, మన్మధుల గురించి మనకు తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం

.

అసలింతకీ మన్మధుడూ రతీదేవి ఎవరు.?

ప్రేమకీ, ఆకర్షణకీ నిలువెత్తు నిదర్శనాలు మన్మధుడు, రతీదేవి. వీరిద్దరూ భార్యా భర్తలు. మహా విష్ణువుకీ, లక్ష్మీదేవికి పుట్టిన సంతానమే మన్మధుడు అంటారు. కొన్ని కథలలో బ్రహ్మదేవునికి మానస పుత్రుడిగా మన్మధుడిని అభివర్ణిస్తారు. అలాగే శివునితోనూ ఈయనకు సంబంధం ఉందని అంటారు. ఈయననే కామ దేవుడు అని కూడా అంటారు. ఈయన భార్య అయిన రతీదేవి కూడా ఈయనలాగే, ప్రేమకూ, ఆకర్షణకు నిదర్శనంగా పేర్కొంటారు. సృష్టి విస్తరణ గురించి బ్రహ్మదేవుడు కఠోరమైన ధ్యానంలో ఉన్నప్పుడు  వెలువడే తేజస్సు నుండి కామదేవుడు పుడతాడట. అందుకే ఆయనకు మానసపుత్రుడవుతాడనీ అంటారు.  నేను సృష్టిని ఉత్పన్నం చేయడానికి ప్రజాపతులను సృష్టించాను కానీ, వారు ఈ కార్యాన్ని చేయడంలో విపలమయ్యారు. కాబట్టి, నువ్వు ఆ కార్యాన్ని నెరవేర్చాలి.. అని చెప్పగా, ఆ మాటలను శాంతం వినకుండా  వెళ్లిపోతాడు కామ దేవుడు. దాంతో కోపగించిన బ్రహ్మదేవుడు  త్వరలోనే నువ్వు నాశనమైపోతావని శపిస్తాడు. తన వివేకాన్ని తెలుసుకున్న కామ దేవుడు క్షమించమని అడగ్గా.. తన శాపాన్ని తిరిగి తీసుకుంటాడు. కామదేవునికి అపారమైన కామ శక్తిని ప్రసాదించడంతో పాటు, ఒక ప్రత్యేకమైన విల్లును కూడా బహుకరిస్తాడు.  అదే మన్మధ బాణంగా ప్రసిద్ధి చెందింది. మన్మధుని బాణం నుండి తప్పించుకోవడం మనుషులకే కాదు, దేవతల వల్ల కూడా కాలేకపోయింది.

ఇంతకీ మన్మధ బాణం అంటే ఏంటీ.? ఆ బాణానికి ఉన్న శక్తి ఏంటీ.?

కామ దేవుని బాణం తియ్యని చెరకు గడతో చేయబడింది. దానికి తేనెతో చేసిన తీగలు ఉంటాయి. ఆయన బాణాన్ని, మామిడి పూలు, మల్లె పూలు, అశోక పుష్పాలు, నీలి కమలాలు… తదితర సుగంధ పుష్పాలతో అలంకరించబడి ఉంటుంది. తన వాహనమైన చిలుకపై కామ దేవునిగా పిలవబడే మన్మధుడు, తన బాణంతో ముల్లోకాలూ చక్కర్లు కొట్టేస్తూ కనిపించిన వారిలో కామ వాంఛ కలిగిస్తుంటాడు. ఆఖరికి మన్మధుడు శివుడిని సైతం విడిచిపెట్టలేదు.  మన్మధ బాణంతో శివునికి తపో భంగం కలిగించి, ఆయన ఆగ్రహానికి గురవుతాడు. అప్పటి నుండీ, అద్రుశ్య రూపంలో సంచరిస్తూ కాముడు తన పని తాను చేసుకుని పోతుంటాడు. కాముని కారణంగానే బ్రహ్మదేవుడు సృష్టించిన సృష్టి ఇంత పెద్దగా విస్తరించింది. మన్మధుడు మనసు పెట్టి మోహ బాణాన్ని విసిరాడంటే, వారిలో ఏదో తెలియని పులకింత.. కామ వాంఛ కలుగుతాయి. ఆ వాంఛలో విచక్షణ కోల్పోవడమే ఎవరి వంతైనా. మోహిని రూపంలో ఉన్న విష్ణువును చూసి, మోహ బాణానికి గురైన పరమ శివుడు కూడా ఎంతగానో పులకించిపోయినట్లు పురాణాల్లో కథలున్నాయి. అదీ మన్మధ  బాణానికి ఉన్న పవర్.

 

Related News