Sammakka Sarakka: సమ్మక్క-సారలమ్మలను దేవతలుగా ఎందుకు పూజిస్తారు..?

Sammakka Sarakka: మేడారం జాత‌ర అంటేనే ప్ర‌పంచవ్యాప్తంగా పేరుగాంచిన జాత‌ర‌. 2 సంవ‌త్స‌రాల‌కొక‌సారి జ‌రిగే ఈ జాత‌రకు ఎక్క‌డెక్క‌డి నుంచో వ‌చ్చి వారి మొక్కులు చ‌ల్లించుకుంటారు. ఆ చ‌ల్ల‌ని త‌ల్లులు కోరిన కోర్కెల‌ను త‌ప్ప‌కుండా నెర‌వేరుస్తార‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. ఆ త‌ల్లుల‌ను వ‌న‌దేవ‌త‌లుగా కూడా పిలుస్తారు.  అంద‌రూ దేవుళ్లు దేవ‌త‌లుగా ఉంటే, వీరు మాత్రం జ‌నాల నుంచి వ‌చ్చిన దేవ‌తలు. గిరిజ‌న జాత‌ర మేడారం ప్ర‌పంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించింది. తెలంగాణ రాష్ట్రం […].

By: jyothi

Updated On - Wed - 1 September 21

Sammakka Sarakka: సమ్మక్క-సారలమ్మలను దేవతలుగా ఎందుకు పూజిస్తారు..?

Sammakka Sarakka: మేడారం జాత‌ర అంటేనే ప్ర‌పంచవ్యాప్తంగా పేరుగాంచిన జాత‌ర‌. 2 సంవ‌త్స‌రాల‌కొక‌సారి జ‌రిగే ఈ జాత‌రకు ఎక్క‌డెక్క‌డి నుంచో వ‌చ్చి వారి మొక్కులు చ‌ల్లించుకుంటారు. ఆ చ‌ల్ల‌ని త‌ల్లులు కోరిన కోర్కెల‌ను త‌ప్ప‌కుండా నెర‌వేరుస్తార‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. ఆ త‌ల్లుల‌ను వ‌న‌దేవ‌త‌లుగా కూడా పిలుస్తారు.  అంద‌రూ దేవుళ్లు దేవ‌త‌లుగా ఉంటే, వీరు మాత్రం జ‌నాల నుంచి వ‌చ్చిన దేవ‌తలు.

గిరిజ‌న జాత‌ర

మేడారం ప్ర‌పంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది.

అస‌లు క‌థ ఏంటంటే..

పూర్వం కోయదొరలు వేట కోసం అడవిలోకి వెళ్లిన‌ప్పుడు అక్కడ వారికి పెద్ద పులుల కాపలా మధ్య ఓ పసిపాప కనిపించింది. ఆ పాపను కోయదొరలు వారి గూడేనికి తీస‌కుని వ‌చ్చారు. పాప గూడేనికి వచ్చినప్పటి నుంచి అన్నీ శుభాలే జ‌రుగుతాయి. కొండ దేవతే ఆ రూపంలో ఉందని వారు నమ్మారు. ఆ పాపకు సమ్మక్క అని పేరు పెట్టారు. సమ్మక్కను కోయ చక్రవర్తి అయిన మేడరాజు పెంచాడు.

ప‌గిడిద్ద‌రాజుతో వివాహం..

క్రీస్తు శకం 1260 నుంచి 1320 కాలంలో  కాకతీయుల కాలంలో ఇప్పటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పొలాసను గిరిజన దొర మేడరాజు పాలిస్తున్నాడు. ఇతని మేనల్లుడైన మేడారం పాలకుడైన పగిడిద్దరాజుకు స‌మ్మక్క‌ను ఇచ్చి వివాహం చేశాడు.

సమ్మక్క-పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు.

మేడారాన్ని ప‌రిపాలిస్తున్న పగిడిద్దరాజు కాకతీయుల సామంతుడు. ఆ రోజుల్లో కరవు, కాటకాల వ‌ల్ల  కొన్నేండ్ల‌ పాటు ప్రజలు శిస్తు కట్టలేదు. కాకతీయులకు సామంతునిగా ఉంటూ శిస్తు కట్టకపోవడం, తన మామ మేడరాజుకు ఆశ్రయం కల్పించడం,  కోయ, గిరిజనుల్లో విప్లవ భావాలను నూరిపోస్తున్న‌డానే అనుమానంతో కాకతీయ సామ్రాజ్యాధినేత ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజుపై యుద్ధానికి పూనుకున్నాడు.  ప్ర‌తాప‌రుద్రుడిపై తిర‌గ‌బ‌డేందుకు గిరిజనులు సిద్ధమయ్యారు.

మేడారంపైకి కాకతీయులు దండెత్తాయి. ములుగు జిల్లా లక్నవరం చెరువు వద్ద గిరిజనులకు-కాకతీయ సైన్యానికి మధ్య యుద్ధం జరిగింది. పగిడిద్ద రాజు, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న, గోవింద రాజులు (సమ్మక్క-పగిడిద్దరాజు అల్లుడు) పోరాటం చేశారు.  కానీ కాకతీయ సైన్యం పెద్ద‌ది కాబట్టి వారి ధాటికి తట్టుకోలేకపోయారు.  మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు మ‌ర‌ణించారు. వారి మరణ వార్త విన్నవెంట‌నే జంపన్న అవమానాన్ని తట్టుకోలేక అక్కడే ఉన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి సంపెంగవాగును జంపన్న వాగుగా పిలుస్తారు.

విరుచుకుప‌డ్డ సమ్మక్క

తన కుటుంబం మరణించిందన్న వార్త విన్నవెంట‌నే సమ్మక్క కాక‌తీయ సైనికుల‌పై విరుచుకుపడింది. ఆమె వీరత్వం చూసిన‌ ప్రతాపరుద్రుడు ఆశ్ఛ‌ర్య‌పోయాడు. కానీ, ఓ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను క‌త్తితో వెన్నుపోటు పొడిచాడు. ఆ గాయంతోనే మేడారంలో ఉన్న చిలకలగుట్టకు వెళ్లి అదృశ్య‌మైంది. ఆ తర్వాత చెట్టు కింద ఓ పుట్ట దగ్గర ఓ కుంకుమభరిణ కనిపించింది. తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోయాడు.

కుంకుమ భరిణెలే స‌మ్మ‌క్క

కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులు కట్టాల్సిన శిస్తును రద్దు చేశాడు.  రెండేళ్లకోసారి స‌మ్మ‌క్క జాతర నిర్వహించాలని ఆదేశించాడు.  కుంకుమ భరిణెలనే స‌మ్మ‌క్క సారళ‌మ్మ‌లుగా భావించి భావించి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క-సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో నిర్వ‌హిస్తున్నారు.

స‌మ్మ‌క్క సార‌ళ‌మ్మ వన ప్రవేశం

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మ‌డి వరంగల్ జిల్లాలోని ములుగు నుంచి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో మేడారం గ్రామం ఉంది. ఈ దట్టమైన అడవులు, కొండల మధ్యనే సమ్మక్క సారలమ్మలు కొలువ‌య్యారు. నాలుగు రోజుల జ‌రిగే జాతరలో భాగంగా గద్దెనెక్కిన దేవతలు చివ‌రి రోజు వ‌న ప్ర‌వేశం ముగియ‌డంతో మహా జాతర ముగుస్తుంది.

Latest News

Related News