Ayyappa : అయ్యప్ప స్వాములు నలుపు దుస్తులు ధరించడం వెనుకున్న రహస్యం తెలుసా?

Ayyappa :కార్తీక మాసం ప్రారంభం కాగానే మనకు అయ్యప్ప స్వాములు దర్శనమిస్తారు. వీరు దాదాపు మండలం రోజుల పాటు అత్యంత కఠిన దీక్షను చేస్తారు. మండలం అంటే 41 రోజులు అని అర్థం. అంతే కాకుండా కొంత మంది నడుచుకుంటూ శబరి వరకూ పాదయాత్ర కూడా చేస్తారు. వారి ఓపికకు దణ్ణం పెట్టాలి. ఇలా పాదయాత్ర చేసే వారు ప్రస్తుతం నాలుగైదురోజుల్లో శబరి చేరుకునేందుకు సమీపిస్తున్నారు. అయ్యప్ప మాల ధారులు అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది వారు […].

By: jyothi

Published Date - Thu - 9 December 21

Ayyappa : అయ్యప్ప స్వాములు నలుపు దుస్తులు ధరించడం వెనుకున్న రహస్యం తెలుసా?

Ayyappa :కార్తీక మాసం ప్రారంభం కాగానే మనకు అయ్యప్ప స్వాములు దర్శనమిస్తారు. వీరు దాదాపు మండలం రోజుల పాటు అత్యంత కఠిన దీక్షను చేస్తారు. మండలం అంటే 41 రోజులు అని అర్థం. అంతే కాకుండా కొంత మంది నడుచుకుంటూ శబరి వరకూ పాదయాత్ర కూడా చేస్తారు. వారి ఓపికకు దణ్ణం పెట్టాలి. ఇలా పాదయాత్ర చేసే వారు ప్రస్తుతం నాలుగైదురోజుల్లో శబరి చేరుకునేందుకు సమీపిస్తున్నారు. అయ్యప్ప మాల ధారులు అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది వారు ధరించే నలుపు రంగు దుస్తులు. అసలు అయ్యప్ప మాల వేసుకునే వారు నలుపు రంగు దుస్తులు ధరించడం వెనుక ఉన్న రహస్యం గురించి మనలో చాలా మందికి తెలియదు. తెలుసుకోవాలని ఉన్నా కూడా ఎవరూ సరైన సమాధానం చెప్పకపోవడంతో అందరూ లైట్ తీసుకుంటారు.


ayyappa

ayyappa



అయ్యప్ప స్వాములు నలుపు దుస్తులు ధరించడానికి మెయిన్ కారణం అడవి జంతువుల నుంచి రక్షణ పొందడం. వారు మాల ధారణలో ఉన్నపుడు అడవుల ద్వారా ప్రయాణించి స్వామి వారి సన్నిధికి చేరుకుంటారు. ఇటువంటి సమయంలో వారికి ఎన్నో భయంకరమైన అడవి జంతువులు దర్శనమిస్తుంటాయి. వీటి బారి నుంచి వారిని వారు కాపాడుకునేందుకు నలుపు రంగు దుస్తులు ధరిస్తారు. అంతే కాకుండా నలుపు రంగు దుస్తులు ధరించడం వలన వారి శరీరంలో వేడి అలాగే ఉండి ఆరోగ్యంగా ఉంటారు. వారు మాలధారణ చేసి కఠిన నియమాలు పాటించేది చలికాలంలో కాబట్టి ఇలా నలుపు రంగు బట్టలు వేసుకోవడం వలన అవి చుట్టు పక్కల ఉన్న వేడిని గ్రహించుకుంటాయి. అందువలన అయ్యప్ప మాలధారులకు వెచ్చగా ఉంటుంది. ఇక అయ్యప్ప మాల వేసే స్వాములు అనేక కఠోర నియమాలను పాటిస్తారు.


ayyappa

ayyappa



వారు చెప్పులు లేకుండా మాల ధారణ సమయంలో నడుస్తారు. ఇలా నడవడం వలన రక్త ప్రసరణ బాగా జరిగి వారు ఆరోగ్యంగా ఉంటారు. అంతే కాకుండా అయ్యప్ప మాలలో ఉన్న వ్యక్తులు చాలా మితంగా తింటూ ఉంటారు. ఇలా మితంగా తినడం వలన మరియు మసాలాలు లేకుండా తినడం వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావు. అంతే కాకుండా అయ్యప్ప మాల వేసిన స్వాములు పరుపులపై కాకుండా కటిక నేలపై నిద్రిస్తారు. ఇలా చేయడం వలన వారికి రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా అయ్యప్ప మాల ధారణ చేసిన స్వాముల నియమ నిబంధనల వలన అనేక లాభాలున్నాయి.

Tags

Latest News

Related News