Garudapuranam: హిందువుల ఆచార, వ్యవహారాల ప్రకారం అనేక పురాణాలు, ఇతిహాసాలను నమ్ముతారు. అందులో ఒకటి గరుడపురాణం. సనాతన ధర్మంలో గరుడపురాణాన్ని మహాపురాణంగా అభివర్ణిస్తారు. గరుడ పురాణంలో విష్ణువు, గరుడ పక్షి, మానవ జీవితం గురించి చక్కగా అభివర్ణించబడింది. మానవుని ఆత్మ, పరమాత్మ తదితర భావనలు ఇందులో ఉంటాయి. ఒక మనిషి జీవిత కాలంలో చేసే పాప పుణ్యాల ఫలితంగానే చనిపోయిన తర్వాత జీవితం ఆధారపడి ఉంటుందని గరుడ పురాణాన్ని నమ్మే వారు విశ్వసిస్తారు. మనిషి జీవించి ఉండగా.. చేసిన కార్యాల ఫలితంతోనే చనిపోయిన తర్వాత పరిణామాలు ఉంటాయని చెబుతారు. ఎవరైనా చనిపోయినపుడు వారి ఇంట్లో గరుడ పురాణాన్ని చదివి వినిపించడం హిందువుల కుటుంబాలలో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. ఈ గరుడ పురాణంలో మొత్తంగా 19 వేల పై చిలుకు శ్లోకాలున్నాయి. ఆ 19వేల శ్లోకాలలో 7 శ్లోకాలలో జ్ఞానం, మతం, విధానం, రహస్యం, జీవితం, స్వర్గం, నరకం వంటి వాటి గురించే ఉంటాయట. అంతే కాకుండా గరుడ పురాణంలో గ్రహాంతర పరిస్థితులను కూడా రాశారు. ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సత్య యుగంలో మనిషి జీవిత కాలం లక్ష సంవత్సరాలు ఉండేదట. అది కలియుగానికి వచ్చేసరికి 100 సంవత్సరాలకు కుదించబడిందని చెబుతారు. మనుషులు చేసిన పాపకర్మల ఫలితంగానే ఆయుష్షు తగ్గిపోయిందని పలువురి వాదన. భగవంతుడిని నమ్మకపోవడం, నాస్తికుడిగా జీవించడం మూలాన ఆయుష్షు తగ్గిందని చెబుతారు.
Garudapuranam
ఎవరైనా మనిషి చనిపోయిన తర్వాత మనిషి ఆత్మ మరో శరీరాన్ని పొందుతుందని గరుడ పురాణంలో వివరించారు. కొంత మంది ఆత్మలు మూడు రోజుల్లో కొత్త శరీరాలు పొందగా… మరికొంత మంది ఆత్మలు.. 10 నుంచి 13 రోజుల వరకు టైం తీసుకుంటాయని గరుడ పురాణంలో లిఖించబడింది. అంతేకాకుండా అకస్మాత్తుగా మరణించిన వారు తిరిగి పునర్జన్మను పొందడానికి దాదాపు ఏడాదికి పైగా సమయం పడుతుందని గరుడ పురాణంలో రాసి ఉంది. గరుడ పురాణంలో చెప్పినట్లు మనిషి చనిపోయాక.. ఇంట్లో గరుడపురాణాన్ని చదివిస్తే.. చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలుగుతుందని పురాణాల్లో చెప్పబడింది.
Garudapuranam
మనిషి చనిపోయాక.. గరుడ పురాణం పారాయణం చేస్తే… మరణించిన వారి ఆత్మకు శాంతి లభిస్తుందని, దెయ్యంగా మారరని పురాణాల ద్వారా వచ్చిన నమ్మకం. చాలా మందికి గరుడ పురాణం అంటే.. భక్తి కంటే.. భయం ఎక్కువగా ఉంటుంది. తెలుగు హిట్ సినిమా అపరిచితుడు లో కూడా ఈ గరుడ పురాణం గురించి… యమలోకంలో విధించే శిక్షల గురించి ఆసక్తికరంగా చూపించారు. జీవిత కాలంలో తెలిసి పాపాలు చేసిన వ్యక్తులు చనిపోయిన తర్వాత యమలోకంలో అనేక చిత్ర వదలు అనుభవిస్తారని గరుడ పురాణం హెచ్చరిస్తోంది. అంతే కాకుండా… మనిషి తన జీవిత కాలంలో ఏయే పనులు చేయకూడదో కూడా గరుడ పురాణంలో చాలా స్పష్టంగా వివరించారు. కొంత మంది వ్యక్తులు తమకు కనిపించిన అనాథలను, వృద్ధులను ఎగతాళి చేస్తారు. అలా చేసిన వారి ఆయుష్షు సగానికి సగం తగ్గిపోతుందని గరుడ పురాణంలో వివరించారు.
Garudapuranam
అంతే కాకుండా పగిలిపోయిన అద్దం ఇంటిలో ఉంచకూడదని, దానిని ఎవరూ వాడకూడదని పెద్దలు చాలా మంది చెబుతారు. కానీ అందుకు గల కారణం మాత్రం చెప్పరు. గరుడ పురాణంలో ఇందుకు గల కారణాన్ని చక్కగా వివరించారు. అసలు దీని గురించి గరుడ పురాణంలో ఏం చెప్పారంటే.. విరిగిన అద్దం ఉండటం వల్ల మన ఆయుష్షు తగ్గిపోతుందట. అందుకే మన పెద్దవాళ్లు ఒకవేళ అద్దం పగిలితే వెంటనే పాడేయమని చెబుతారు. గొప్ప ఇతిహాసంగా చెప్పుకునే మహాభారతంలో కూడా గరుడ పురాణం ప్రస్తావన తీసుకురాబడింది.