Apple : కరోనా వైరస్ కి ఒక రకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే దానివల్ల ఇప్పుడు ప్రతిదీ ఆన్ లైన్ బాట పడుతోంది. కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు, ఫుడ్డు, సరుకులు ఇలా రోజువారీ వస్తువులు మొదలుకొని ఖరీదైన ఐటమ్స్ వరకు అన్నింటినీ జనం ఇంట్లోకే పార్సిల్ తెప్పించుకుంటున్నారు. మార్కెట్లో దొరికేవన్నీ కస్టమర్లకి ఒక్క క్లిక్ దూరంలో లభిస్తున్నాయి. ఆన్ లైన్ షాపింగ్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఒక్కోసారి సరదాగా అనిపిస్తుంది. ఒక్కోసారి చిర్రెత్తుకొచ్చేలా కూడా చేస్తుంది. ఎందుకంటే ఒక దాని కోసం ఆర్డర్ ఇస్తే మరొకటి వస్తుంది కాబట్టి. ఇలాంటి మిస్టేక్స్ ఎక్కువగా జరగవు. ఒకటో అరో చోటుచేసుకుంటాయి. కాబట్టి వాటి గురించి పెద్దగా వర్రీ కావాల్సిన పనిలేదు. ఇటీవల ఓ వ్యక్తి ఇలాగే ఒక సూపర్ మార్కెట్ కి ఆన్ లోన్ లో యాపిల్ పండ్ల కోసం ఆర్డరిస్తే యాపిల్ ఐఫోన్ వచ్చింది. దీంతో ఆ వినియోగదారుడి పంట పండింది. ఆ ఆనందాన్ని ఈ నెల 10వ తేదీన ట్విట్టర్ లో పంచుకున్నాడు. స్టోరీ ఇంతటితో అయిపోలేదు. అసలు విషయం ముందుంది.
Apple : online order for apples, but they send iphone
‘‘టెస్కో సంస్థకి, టెస్కో మొబైల్ కంపెనీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ నెల 7వ తేదీన బుధవారం సాయంత్రం మేము మా ఆర్డర్ ని కలెక్ట్ చేసుకుందామని డోర్ తీసి బయటికి వెళ్లాం. అంతే. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాం. పార్సిల్ లో మాకు ‘ఎస్ఈ మోడల్ యాపిల్ ఐఫోన్’ వచ్చింది. కానీ మేము ఆర్డర్ ఇచ్చింది యాపిల్ పండ్ల కోసం. జీవితాంతం మర్చిపోలేని ఈ ఆసక్తికరమైన సంఘటనతో మా పిల్లల సంతోషం అంతా ఇంతా కాదు’’ అని నిక్ జేమ్స్ అనే వ్యక్తి తన పోస్టులో పేర్కొన్నాడు.
టెస్కో సంస్థవాళ్లు గానీ టెస్కో కంపెనీవాళ్లు గానీ మిస్టేక్ చేయలేదు. టెస్కో సంస్థవాళ్లు తమ మార్కెటింగ్ వ్యూహంలో భాగంగా ఆన్ లైన్ షాపర్స్ కోసం ఒక కొత్త స్కీమ్ ప్రవేశపెట్టారు. దాని పేరు ‘సూపర్ సబ్ స్టిట్యూట్’. అంటే ఒకే పేరు ఉన్న ప్రొడక్టుల కోసం ఆర్డరిస్తే ఒరిజినల్ ఐటమ్ తోపాటు ఒక సర్ ప్రైజ్ ప్రొడక్ట్ కూడా పంపిస్తారన్నమాట.
నిక్ జేమ్స్ పోస్టింగ్ కి మస్తు కామెడీ కామెంట్లు వచ్చాయి. ‘‘మంచిది. యాపిల్స్ సేల్స్ పెంచటానికి ఈ రూట్ లో వెళుతున్నారన్నమాట’’ అని ఒకరు స్పందించారు. ‘‘ఇంతకీ మీకు యాపిల్స్ వచ్చాయా’’ అని మరొకరు చమత్కరించారు. నిక్ జేమ్స్ ఏ దేశంవాడు అంటే బ్రిటన్.
A big thanks this week to @Tesco & @tescomobile. On Wednesday evening we went to pick up our click and collect order and had a little surprise in there – an Apple iPhone SE. Apparently we ordered apples and randomly got an apple iphone! Made my sons week! ? #tesco #substitute pic.twitter.com/Mo8rZoAUwD
— Nick James (@TreedomTW1) April 10, 2021