Eggs Kejriwal : అర్వింద్ కేజ్రివాల్ కాదు.. ఎగ్స్ కేజ్రివాల్..

Eggs Kejriwal : అర్వింద్ కేజ్రీవాల్ మనందరికీ తెలుసు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి. కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయేది ఎగ్స్ కేజ్రీవాల్ గురించి. ఎగ్స్ కేజ్రీవాల్ అనేది మనిషి పేరు కాదు. వంటకం పేరు. ఇదొక స్పెషల్ స్ట్రీట్ ఫుడ్. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఎక్కువ మంది ఇష్టపడే బ్రేక్ ఫాస్ట్. కోడి గుడ్డు, వెన్న, పచ్చిమిర్చి, ఉల్లిపాయలతో తయారుచేసే ఓపెన్ శాండ్ విచ్. శాండ్ విచ్ అంటే మధ్యలో […].

By: jyothi

Updated On - Mon - 19 April 21

Eggs Kejriwal : అర్వింద్ కేజ్రివాల్ కాదు.. ఎగ్స్ కేజ్రివాల్..

Eggs Kejriwal : అర్వింద్ కేజ్రీవాల్ మనందరికీ తెలుసు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి. కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయేది ఎగ్స్ కేజ్రీవాల్ గురించి. ఎగ్స్ కేజ్రీవాల్ అనేది మనిషి పేరు కాదు. వంటకం పేరు. ఇదొక స్పెషల్ స్ట్రీట్ ఫుడ్. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఎక్కువ మంది ఇష్టపడే బ్రేక్ ఫాస్ట్. కోడి గుడ్డు, వెన్న, పచ్చిమిర్చి, ఉల్లిపాయలతో తయారుచేసే ఓపెన్ శాండ్ విచ్. శాండ్ విచ్ అంటే మధ్యలో ఒక పదార్థం నింపిన రెండు ముక్కలని అర్థం. వెరైటీగా, ఈజీగా రూపొందించటం, టేస్టీగా ఉండటంతో ఇది చాలా పాపులర్ ఫుడ్ ఐటమ్ అయింది. దీన్ని సింపుల్ గా ‘‘ఒక రొట్టె ముక్క మీద వేసిన ఎగ్’’ అని చెప్పొచ్చు.

Eggs Kejriwal : a tiffin item with the name of kejriwal

Eggs Kejriwal : a tiffin item with the name of kejriwal

ఎలా చేస్తారు?..

ముంబై ఫేవరెట్ టిఫిన్ ఎగ్స్ కేజ్రీవాల్ ని ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. కాకపోతే అందరూ కోడి గుడ్లు, పచ్చి మిర్చి, జున్ను, బ్రెడ్ లేదా బన్, ఉల్లిపాయలు, మసాలా పొడి, ఉప్పు వంటివి వాడతారు. దీన్ని మనింట్లో కూడా చేసుకోవచ్చు. ముందుగా ఉల్లిగడ్డ తీసుకొని అడ్డంగా కట్ చేయాలి. మధ్య భాగాన్ని తీసేయగా ఏర్పడ్డ గుంటలో ఎగ్ లోని ఎల్లో పార్ట్ ని పోయాలి. దానిపై లైట్ గా సాల్ట్, మసాలా చల్లాలి. వాటిని ఓ గిన్నెలో పెట్టి మూతేసి రెండు నిమిషాలు ఉడకబెట్టాలి. తర్వాత రెండు ఉల్లిగడ్డలు, పచ్చి మిరప కాయ, రెండు టమాటాలను ముక్కలు కోయాలి. వాటిని గిన్నెలో వేసి వాటి మీద ఉప్పు, దనియాలు, కొత్తిమీర తదితర సుగంధ ద్రవ్యాలు వేయాలి. వాటిని కాసేపు ఉడక బెట్టాలి. కాల్చిన రొట్టె ముక్కను తీసుకొని దానిపైన వెన్న, ఉడక బెట్టిన ఉల్లిపాయలు-పచ్చిమిర్చి-టమాటా ముక్కుల పేస్టును పూయాలి. అనంతరం ఉల్లిగడ్డ-కోడిగుడ్డ రింగ్ పెట్టాలి. ఎగ్స్ కేజ్రీవాల్ రెడీ.

ఆ పేరెలా వచ్చింది?: Eggs Kejriwal

దేవీ ప్రసాద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి విల్లింగ్డన్ స్పోర్ట్స్ క్లబ్ లో ఈ అల్పాహారాన్ని రోజూ తినేవాడని అంటుంటారు. అతని పేరునే దీనికి పెట్టారని చెబుతుంటారు. ఎగ్స్ పక్కన అతని పేరును యాడ్ చేశాకే దీనికి ఇంత పాపులారిటీ వచ్చిందని పేర్కొంటున్నారు. ఎగ్స్ కేజ్రీవాల్ తయారీ విధానం అర్థంకానివాళ్లు సరన్ష్ గోయిలా అనే చెఫ్ ఇన్ స్ట్రాగ్రామ్ అకౌంట్ పైన క్లిక్ చేస్తే వీడియోలో చూడొచ్చు.

Tags

Latest News

Related News