Love : వన్ సైడ్ లవ్వులు వందలో ఒకటో రెండో సక్సెస్ అవుతాయి. 99 శాతం ఫెయిల్యూరే. ఎందుకంటే అందరూ ‘ఆర్యా’లు కాలేరు కాబట్టి. అందువల్ల ముందే డ్రాప్ అయిపోవటం బెస్ట్. దీనివల్ల ఎంతో విలువైన సమయం, శక్తి, ప్రయత్నాలు వేస్ట్ కావు. నిజం చెప్పాలంటే ఈ ఒక వైపు ప్రేమలు ఫలించవనే సంగతి ముందే తెలుస్తుంది. దీనికి కొన్ని స్పెషల్ సిగ్నల్స్ కూడా వస్తాయి. అయినా కొందరు వాటిని పట్టించుకోకుండా పట్టువదలని విక్రమార్కుల్లా వెంటపడుతుంటారు. ఇంతకీ ఆ వన్ సైడ్ లవ్ ఫెయిల్యూర్ సంకేతాలేంటంటే..
Love : one side live failure signals
కొందరు కొంత మందినే ఇష్టపడతారు. వాళ్లతోనే క్లోజ్ గా తిరుగుతారు. అదంతే. ఓ తెలుగు సినిమాలో చెప్పినట్లు ‘నచ్చటానికి ఒక్క కారణం చాలు. నచ్చకపోవటానికి సవాలక్ష ఉంటాయి’. అందరితోనూ డేటింగ్ చేస్తూ నిన్నే దూరం పెడుతోందంటే నువ్వు ఆమెకి నచ్చిన టైప్ కాదని లెక్క. అలాంటి అమ్మాయి మనసును నువ్వు తల కింద పెట్టి కాళ్లు పైకెత్తి తపస్సు చేసినా కరిగించలేవు. ఆమె ఫోకస్ లో నువ్వు ఎప్పుడూ మైనస్సే.
నీతో మాట్లాడటం ఇష్టంలేదని చెప్పటానికి ఆమె ఫోన్ చూస్తూ ఉంటుంది. ఫోన్ లో వేరే వాళ్లతో ఛాటింగ్ చేస్తుంది లేదా సోషల్ మీడియా అప్డేట్స్ చూస్తుంది. ఆమె నిన్ను అవాయిడ్ చేస్తోందనటానికి ఇంతకు మించిన రుజువు మరొకటి అవసరంలేదు.
నువ్వు ఇష్టపడే అమ్మాయి కష్టాల్లో ఉన్నప్పుడు లేదా నువ్వే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్లు. ఆమె ఎమోషన్ క్యాచ్ చేయటానికి ప్రయత్నించు. లేదా నీ భావోద్వేగాన్ని పంచుకోవటానికి ట్రై చెయ్. షేరింగ్ కి మించిన పాజిటివ్ అంశం లేదు. అయినా ఆ అమ్మాయి తన బాధను నీతో పంచుకోలేదన్నా లేదా నీ బాధ గురించి ఆమె ఒక్క ముక్కైనా నిన్ను అడగలేదన్నా నువ్విక ఇంటిదారి పట్టడం మంచిది.
నువ్వు లైక్ చేసే అమ్మాయితో ఫోన్ లో మాట్లాడాలని కాల్ చేస్తే ఆమె ఫోన్ ఎప్పుడూ బిజీగా ఉంటే ఆమె తనకు నచ్చిన అబ్బాయితో మాట్లాడుతోందని అర్థం. దాన్ని కవర్ చేయటానికి ఆమె తాను వర్క్ లో తీరిక లేకుండా ఉన్నానంటుంది. దీన్నిబట్టి ఆ అమ్మాయి నీ నుంచి సాధ్యమైనంతగా తప్పించుకోవటానికే ప్లాన్ చేస్తోందని గ్రహించాలి.
ఫలానా అమ్మాయి పైన నీ ఫీలింగ్స్ ని ఆమెతో పంచుకుందామని నువ్వు ఎంత ప్రయత్నించినా ఆమె వినిపించుకోలేదంటే నువ్వంటే ఆ అమ్మాయికి అస్సలు ఇష్టంలేదని తెలుసుకోవాలి. బలవంతం చేస్తే అప్పటివరకూ ఉన్న కొద్దోగొప్పో ఫ్రెండ్షిప్ కూడా బ్రేక్ అవుతుంది. కాబట్టి ఏదైనా తెగే దాకా లాగొద్దు.
నీ గురించి ఓ అమ్మాయి ఇతరులకి ‘ఇతను నా ఫ్రెండ్’ అని పరిచయం చేస్తే ఆమెపై నీ లవ్ ఫెయిల్యూర్ కాబోతోందని, దానికిదే పెద్ద సంకేతమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతేకాదు. ఆ టైమ్ లో ఆమె క్లోజ్ ఫ్రెండ్స్ నిన్ను కనీసం పలకరించటానికి కూడా ఇష్టపడరు. పార్టీలకి పిలవరు. సోషల్ గ్యాదరింగ్స్ కి స్వాగతించరు. ఎందుకంటే మీరిద్దరూ కలిసి ఉండటం చివరికి వాళ్లకు కూడా నచ్చట్లేదని నీకు బోధపడితే చాలు.