Kadha Tea: చిన్నప్పుడు టీ అమ్మిన ప్రధాని మోడీ.. ఇప్పుడు ఏ టీ తాగుతున్నారు? ఎందుకు?

Kadha Tea నరేంద్ర మోడీ చిన్నప్పుడు ఓ రైల్వే స్టేషన్ లో టీ కొట్టులో పనిచేశానని చాలా సార్లు గర్వంగా చెప్పుకున్నారు. ఆ స్థితి నుంచి ఆయన ఇవాళ మన దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. అయితే పీఎం మోడీ ప్రస్తుతం ఏ టీని ఎందుకు ఎక్కువ తాగుతున్నారో తెలుసా?. ఆయన తాగటమే కాకుండా దేశ ప్రజల్ని కూడా ఆ టీయే తాగమని కేంద్ర ప్రభుత్వం ద్వారా చెబుతున్నారు. ఇంతకీ దాని పేరేంటంటే కధా టీ (kadha tea). […].

By: jyothi

Updated On - Fri - 16 April 21

Kadha Tea: చిన్నప్పుడు టీ అమ్మిన ప్రధాని మోడీ.. ఇప్పుడు ఏ టీ తాగుతున్నారు? ఎందుకు?

Kadha Tea నరేంద్ర మోడీ చిన్నప్పుడు ఓ రైల్వే స్టేషన్ లో టీ కొట్టులో పనిచేశానని చాలా సార్లు గర్వంగా చెప్పుకున్నారు. ఆ స్థితి నుంచి ఆయన ఇవాళ మన దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. అయితే పీఎం మోడీ ప్రస్తుతం ఏ టీని ఎందుకు ఎక్కువ తాగుతున్నారో తెలుసా?. ఆయన తాగటమే కాకుండా దేశ ప్రజల్ని కూడా ఆ టీయే తాగమని కేంద్ర ప్రభుత్వం ద్వారా చెబుతున్నారు. ఇంతకీ దాని పేరేంటంటే కధా టీ (kadha tea). దీనివల్ల ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయని, ముఖ్యంగా కొవిడ్-19కి ఇది రక్షణ కవచంలా పనిచేస్తుందని అంటున్నారు.

ఆల్ ఇన్ వన్..

కరోనా వైరస్ రాకముందు కధా టీని తక్కువ మంది తాగేవారు. ఎవరూ కేర్ చేసేవాళ్లు కాదు. కొవిడ్-19 ఎంట్రీతో ఈ టీకి విపరీతంగా గిరాకీ, పాపులారిటీ పెరిగింది. కధా టీ తాగితే మనిషి శరీరంలో వ్యాధి నిరోధకత పెరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ బాగా ఉంటే కరోనా దరిచేరదు. దరిచేరినా త్వరగా, తేలిగ్గా కోలుకోగలం. కధా టీని ఆయుర్వేద మూలికలతో, సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు. ఇందులో ప్రధానంగా తులసి ఆకులు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, శొంఠి, ఎండు ద్రాక్ష, యాలకులు వంటి వాటిని వేస్తారు. కాబట్టి ఈ ఔషధాన్ని లేదా పానీయాన్ని రోజుకి కనీసం రెండు సార్లయినా తాగితే రకరకాల రోగాల నుంచి బయటపడొచ్చు. ఇన్ఫెక్షన్లు ఎటాక్ చేయవు. తిన్నది తిన్నట్లు జీర్ణమవుతుంది. మన బాడీలో ఏమైనా విష వ్యర్థాలు ఉంటే బయటకు పోతాయి.

ఎలా తయారుచేయాలంటే..

చల్లని నీళ్లల్లో ముందుగా తులసి ఆకులు వేసి ఐదు నిమిషాలు వేడిచేయాలి. అందులో నల్ల మిరియాలు-దాల్చిన చెక్క పొడి, శొంఠి కలపాలి. నీళ్లు సగానికి సగం తగ్గే వరకు మరగనివ్వాలి. అనంతరం ఎండు డ్రాక్ష వేయాలి. చివరగా తేనె లేదా బెల్లంతోపాటు నిమ్మరసం కూడా వేయొచ్చు. కాసేపటికి కధా టీ రెడీ. దాన్ని వడపోసి తాగితే రుచికి రుచి, సువాసనకి సువాసన, ఆరోగ్యానికి ఆరోగ్యం.

 

Latest News

Related News