The Best : రొమాంటిక్ రెస్టారెంట్లు

The Best : ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్ లో చాలా రెస్టారెంట్లు మోస్ట్ రొమాంటిక్ వ్యూస్ కలిగి ఉంటాయి. సందర్శకులకు జీవితంలో మర్చిపోలేని అనుభూతిని పంచుతాయి. రుచికరమైన భోజనం వడ్డిస్తాయి. మద్యంప్రియులకు స్వర్గం చూపిస్తాయి. వాటిలో ముఖ్యంగా తొమ్మిదింటి గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. హనీమూన్ కి గానీ ఇతర సందర్భాల్లో గానీ వేరే రాష్ట్రాలకు టూర్ వేయాలనుకునేవారికి ఇదొక ట్రావెల్ గైడ్ లాగా ఉపయోగపడుతుంది. ది టెర్రాస్.. షెరటాన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అధీనంలోని నాలుగు […].

By: jyothi

Published Date - Wed - 21 April 21

The Best : రొమాంటిక్ రెస్టారెంట్లు

The Best : ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్ లో చాలా రెస్టారెంట్లు మోస్ట్ రొమాంటిక్ వ్యూస్ కలిగి ఉంటాయి. సందర్శకులకు జీవితంలో మర్చిపోలేని అనుభూతిని పంచుతాయి. రుచికరమైన భోజనం వడ్డిస్తాయి. మద్యంప్రియులకు స్వర్గం చూపిస్తాయి. వాటిలో ముఖ్యంగా తొమ్మిదింటి గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. హనీమూన్ కి గానీ ఇతర సందర్భాల్లో గానీ వేరే రాష్ట్రాలకు టూర్ వేయాలనుకునేవారికి ఇదొక ట్రావెల్ గైడ్ లాగా ఉపయోగపడుతుంది.

ది టెర్రాస్..

షెరటాన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అధీనంలోని నాలుగు లగ్జరీ పాయింట్స్ లో ఒకటైన ‘ది టెర్రాస్’ని డెహ్రాడూన్ నగరంలోని ఫైనెస్ట్ రెస్టారెంట్లలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇందులో ఓపెన్ ఎయిర్ సెట్టింగ్ ఉంటుంది. అక్కడ నిలబడి చూస్తే అందమైన మంచు పర్వతాలు ఆకట్టుకునేలా కనిపిస్తాయి. ఈ అద్భుతమైన దృశ్యాలను, అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. అంత బాగుంటాయి.

అన్ ప్లగ్డ్: The Best

‘అన్ ప్లగ్డ్’ అనే మరో రెస్టారెంట్ చుట్టుపక్కలా ఉండే కొండలను చూస్తే స్టన్ అవుతాం. దీన్ని కేవలం రెస్టారెంట్ అని మాత్రమే చెప్పలేం. డెహ్రాడూన్ లోని ఫేమస్ ఎట్రాక్టివ్ ప్లేస్ గా కూడా పేర్కొనొచ్చు. ఇక్కడ ఔట్ డోర్ తోపాటు ఇన్ డోర్ సీటింగ్ సైతం ఉంది.

The Best : romantic restaurants in dehradun city

The Best : romantic restaurants in dehradun city

డౌట్ టేబుల్..

ఇదొక ఛార్మింగ్ రూఫ్ టాప్ రెస్టారెంట్. ఇందులోకి వెళితే డెహ్రాడూన్ సిటీలో అత్యంత సహజంగా ఉండే సుందరమైన ప్రదేశాలను అన్నింటినీ ఒకే చోట నుంచి చూడొచ్చు. అక్కడి చల్లని వాతావరణాన్ని, ఎక్స్ లెంట్ సర్వీస్ ని ఇష్టపడనివారు ఉండరంటే అతిశయోక్తికాదు.

ది టావెర్న్: The Best

ఈ ఫైన్ డైన్ రెస్టారెంట్.. ‘బ్రెంట్ వుడ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్’ లోపల ఉంటుంది. రోడ్డు మీద నిలబడి చూసేవారికి మాత్రం ఒక షాపింగ్ మాల్ లా కనిపిస్తుంది. కానీ.. అందులోకి వెళితే బ్రహ్మాండమైన బార్, నోరూరించే భోజనం దొరుకుతుంది.

ఓనిక్స్..

ఇదీ ఒక ఫైన్ డైనింగ్ ఎస్టాబ్లిష్మెంటే. ఇక్కడ కూడా ఆశ్చర్యపరిచే సీన్లు ఉంటాయి. రకరకాల మద్యం లభిస్తుంది. ఫుడ్డు కూడా అదిరిపోతుంది. కడుపు నిండా తినటం ఖాయం.

ముస్సోరి లైట్స్: The Best

మీరు మీ లవర్ ని గుడ్ ఫుడ్ తో సర్ ప్రైజ్ చేయాలనుకుంటే డెహ్రాడూన్ లోని రాజ్ పూర్ రోడ్డులో ఉన్న ముస్సోరి లైట్స్ రెస్టారెంట్ కి తీసుకురావటం బెటర్. ఇక్కడ హాయిగా అనిపించే, రొమాంటిక్ లుక్ కలిగిన సెట్టింగ్స్ ఉంటాయి. ఉత్తరాఖండ్ లోని చూడదగ్గ పర్వత ప్రాంతాలను ఇక్కడి నుంచి వీక్షించొచ్చు.

మిరాబిలియా..

ఇది ఐడీఏ హోటల్ లో ఒక భాగంగా ఉంటుంది. డెహ్రాడూన్ లోని మోస్ట్ రొమాంటిక్ రెస్టారెంట్లలో మిరాబిలియా ఒకటి. ఒక సరస్సు పక్కన ఉన్న ఈ ఓపెన్ ఎయిర్ రెస్టారెంట్.. లగ్జరీ డైనింగ్ ఎక్స్ పీరియెన్స్ ని మన సొంతం చేస్తుంది.

ఎమరాల్డ్ కోర్ట్: The Best

డెహ్రాడూన్ లోని లగ్జరీ రెస్టారెంట్లలో ఎమరాల్డ్ కోర్ట్ ఒకటి. ఇది సాలిటైర్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అధీనంలో నడుస్తోంది. ఇది కూడా మంచి భోజన ప్రియులకు కేరాఫ్ అడ్రస్.

బీఎంజీ..

‘బి మై గెస్ట్’ (బీఎంజీ) అనేది సైతం డెహ్రాడూన్ లోని టాప్ రెస్టారెంట్లలో ఒకటి. దీని చుట్టూ చూడచక్కని, పచ్చని పరిసరాలు ఉంటాయి. ఇక్కడ అమేజింగ్ ఫుడ్ సర్వ్ చేస్తారు. ఆకర్షించే దృశ్యాలు ఎన్నో కనిపిస్తాయి.

Latest News

Related News