Benefits Of Curd: పెరుగును దివ్యాషదంగా మార్చే పదార్థాలు ఏంటో తెలుసా?

Benefits Of Curd: ఇండియాలో ప్రతి పల్లెటూర్లలో మరియు పట్టణాల్లో ప్రతి ఒక్కరు కూడా పెరుగు వాడుతరు. అన్నం అంతా తిన్న తర్వాత కనీసం రెండు మూడు ముద్దలు అయినా పెరుగుతో అన్నం తినకుంటే తిన్నట్లుగా ఉండదు అంటూ చాలా మంది తమకు పెరుగుపై ఉండే మోజును చెబుతూ ఉంటారు. పెరుగును తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి అనడంలో సందేహం లేదు. పెరుగు పలు అనారోగ్య సమస్యలకు మంచి ఔషదం అంటూ ఉంటారు. స్వచ్చమైన పెరుగు […].

By: jyothi

Published Date - Wed - 15 September 21

Benefits Of Curd: పెరుగును దివ్యాషదంగా మార్చే పదార్థాలు ఏంటో తెలుసా?

Benefits Of Curd: ఇండియాలో ప్రతి పల్లెటూర్లలో మరియు పట్టణాల్లో ప్రతి ఒక్కరు కూడా పెరుగు వాడుతరు. అన్నం అంతా తిన్న తర్వాత కనీసం రెండు మూడు ముద్దలు అయినా పెరుగుతో అన్నం తినకుంటే తిన్నట్లుగా ఉండదు అంటూ చాలా మంది తమకు పెరుగుపై ఉండే మోజును చెబుతూ ఉంటారు. పెరుగును తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి అనడంలో సందేహం లేదు. పెరుగు పలు అనారోగ్య సమస్యలకు మంచి ఔషదం అంటూ ఉంటారు. స్వచ్చమైన పెరుగు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు అంటూ ఉంటారు. అలాంటి పెరుగుకు ఇప్పుడు మేము చెప్పబోతున్న పదార్థాలు కలపడం వల్ల ఔషదం కాస్త దివ్యాషదం అవుతుందని ఆయుర్వేద నిపుణులతో పాటు పెద్దలు కూడా అంటున్నారు. పెరుగుకు కలిపే పదార్థాలను పట్టి దాని ఉపయోగం మరియు దాని పని తీరు మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రయోజనాలు ఏంటీ.. ఏ పదార్థాలతో పెరుగు కలిసినప్పుడు ఎలా ఉపయోగ పడుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం రండి.

కప్పు పెరుగులో ఒక టీ స్పూన్‌ తేనె కలుపుకుని తినడం లేదా మజ్జిక మాదిరిగా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ బాగా పని చేస్తుంది. అన్ని విధాలుగా జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేసేలా పెరుగు తేనె మిశ్రమం పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మజ్జికకు తేనె మరింతగా ఆయుర్వేదిక గుణంను జత పర్చుతుందని ప్రయోగాత్మకంగా వెళ్లడి అయ్యింది.

పెరుగులో లేదా మజ్జికలో పాటు టీ స్పూన్‌ జిలకర పొడి కలిపి తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్యలు తొలగి పోతాయి. శరీరంలో ఉన్న అవాంచిత కొవ్వును తగ్గించడంతో పాటు జీర్ణ వ్యవస్థ సరిగ్గా పని చేసి బరువు తగ్గేలా చేస్తుంది.

పెరుగులో చెక్కర కలిపి మజ్జిక మాదిరిగా తాగడం వల్ల కూడా పలు ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎండ దెబ్బ కొట్టిన సమయంలో చెక్కర వేసిన మజ్జిక తాగడం వల్ల కొన్ని నిమిషాల్లో ఉపశమనం కలుగుతుంది. వాకింగ్‌ చేస్తూ లేదా ఏదైనా పని చేస్తూ అలసి పోయిన వారికి చెక్కర వేసిన మజ్జిక ఇవ్వడం వల్ల నిమిషాల్లో వారి ఎనర్జీ బూస్ట్‌ అవుతుంది.

పెరుగులో మూడు నాలుగు నిమ్మ చుక్కలు వేసి తినడం వల్ల ప్రయోజనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు పెరుగులో తేనె లేదా చక్కర వేసుకుని అందులో రెండు మూడు చుక్కల నిమ్మ రసం పిండటం వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయి. బరువు తగ్గడంతో పాటు పలు అనారోగ్య సమస్యలకు ఇది చెక్‌ పెడుతుంది.

పెరుగులో కాస్త ఘాటుగా ఉండే వాము కలిపి మజ్జిక మాదిరిగా చేసుకుని తాగడం వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది. అజీర్తి సమస్యలతో పాటు ఇతర సమస్యలకు చెక్‌ పెట్టే విధంగా మజ్జిక ఉపయోగ దాయకం అంటున్నారు.

అత్యంత అద్బుత ఆయుర్వేద గుణాలు కలిగి ఉండే నల్ల మిర్యాల పొడిన పెరుగులో కలిపి తీసుకోవడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. మలబద్దక సమస్యకు ఇది ప్రధానంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

పెరుగులో ఓట్స్‌ వేసుకుని తినడం వల్ల ఆకలి తీరుతుంది. శరీరంకు కావాల్సిన ప్రోటీన్లు అందుతాయి. తద్వార అన్నం ఇతర ఆహార పదార్థాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే అప్పుడు బరువు పెరగకుండా తగ్గే అవకాశాలు ఉంటాయి. కను పెరుగు ను ప్రతి రోజు రెగ్యులర్ గా ఇప్పుడు చెప్పిన విధంగా లేదా మజ్జిక రూపంలో అయినా తీసుకోవాలని వైధ్యులు మరియు ఆయుర్వేద నిపుణులు చెబుతూ ఉంటారు. పెరుగు వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది.. తగ్గే ఛాన్స్ కూడా ఉంటుందట. కనుక మరెందుకు ఆలస్యం పెరుగు అలవాటు లేని వారు వెంటనే అలవాటు చేసుకుంటే మంచిది.

 

 

Related News