Travel : ఈ ఫొటో చూస్తుంటే నింగికి నిచ్చెన వేసినట్లుంది. కానీ కాదు. ఇదొక ఎడారిలోని రిసార్టుకి వెళ్లేందుకు కట్టిన మెట్ల మార్గం. అమెరికాలోని ఉతా రాష్ట్ర పరిధిలోకి వచ్చే అమన్ గిరి ప్రాంతంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు పొందిన ‘అమన్ రిసార్ట్స్ ఇంటర్నేషనల్’ అనే లగ్జరీ హోటల్ గ్రూప్ ఇక్కడ రిసార్టుని ఏర్పాటుచేయటంతో ఈ ప్రాంతాన్ని అమన్ గిరిగా పేర్కొంటున్నారు. డిజర్ట్ లోని ఈ హోటల్ కి ఉన్న వెరైటీ వెరైటీ ఫీచర్లలో ఇప్పుడు ఈ నయా ఫీచర్ సైతం చేరింది. ఇది ఇక్కడికి వచ్చేవారికి సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది. ఈ మెట్ల మార్గాన్ని ఉక్కు(స్టీల్)తో నిర్మించారు. నేల మీద నుంచి 40 అడుగుల ఎత్తులో ఉంది. ఈ రూట్ లోని మొత్తం మెట్ల సంఖ్య 120. దీన్ని ‘‘కేవ్ పీక్ స్టెయిర్ వే’’ అంటారు.
Travel : Amangiri area at Utah state in usa is a great tourism place
ఈ మెట్ల మార్గం లోతైన లోయల మీదుగా, ఏటవాలు కొండల పైన, గుట్టలను చుడుతూ సాగుతుంది. అతిథులకి జీవితాంతం గుర్తుండిపోయే అత్యద్భుత అనుభవాన్ని మిగుల్చుతుంది. 200 అడుగులకు పైగా దూరం ఉండే ఈ రూట్ లో రిసార్టు వైపుగా సాగుతుంటే గుండె వెయ్యి మైళ్ల వేగంతో కొట్టుకుంటుంది. రిసార్ట్ ఉన్న ప్రాంతం మొత్తం విస్తీర్ణం 600 ఎకరాలు. ఇంతటి సువిశాలమైన ఏరియాలో ఏర్పాటుచేసిన ఈ హోటల్ ఓ విలువ కట్టలేని ప్రాపర్టీ అనటంలో అతిశయోక్తిలేదు.
వెరీ వెరీ స్పెషల్ అకేషన్స్ జరుపుకోవాలనుకునేవారికి ఇదొక ప్రత్యేక ప్రదేశం. ఇక్కడికి దగ్గరలో అతిపెద్ద జాతీయ స్మారక చిహ్నం ఒకటి ఉంది. ఈ రిసార్టు నుంచి అక్కడికి ఎస్కలేటర్ మాదిరిగా ఉండే మెట్ల మార్గంలో ఈజీగా చేరుకోవచ్చు. స్థానిక అమన్ హోటల్ లో వన్ బెడ్రూమ్, టూ బెడ్రూమ్ వేరియంట్స్ లో గదులు లభిస్తాయి. సూట్లు, ఇళ్లు కూడా దొరుకుతాయి. ఉతా ఎడారిలో అమన్ గిరి ప్రాంతం కలిగించేంత మధురమైన అనుభూతిని మరే ఏరియా కూడా కలిగించదు. ‘కేవ్ పీక్ స్టెయిర్ వే’ ఇచ్చినంత థ్రిల్లింగ్ మరేదీ ఇవ్వదు. ఈ ఎక్స్ పీరియెన్స్ ని మైండ్ బ్లోయింగ్ అని కాకుండా మైండ్ బ్లెండింగ్ అని అభివర్ణించొచ్చు.