Ajwain : వాముతో వెయిట్ లాస్.. ప్లస్ ఇతర ప్రయోజనాలు..

Ajwain : చాలా మంది ఇటీవల కాలంలో అతి చిన్న వయసులోనే ఊబకాయులవుతున్నారు. ఈ క్రమంలోనే వెయిట్ లాస్ అయ్యేందుకుగాను రకరకాల ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు. అయితే, సహజ సిద్ధంగా వెయిట్ అస్ అయ్యేందుకు వాము ఉపయోగపడుతుందని చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. వాము వల్ల వెయిట్ లాస్ అవడం ఒక్కటే కాదు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.. సాధారణంగా అందరి ఇళ్లలో సుగంధ ద్రవ్యాలు ఉండే ఉంటాయి. అందులో ఒకటి అజ్వైన్ అనగా వాము. […].

By: jyothi

Published Date - Fri - 29 October 21

Ajwain : వాముతో వెయిట్ లాస్.. ప్లస్ ఇతర ప్రయోజనాలు..

Ajwain : చాలా మంది ఇటీవల కాలంలో అతి చిన్న వయసులోనే ఊబకాయులవుతున్నారు. ఈ క్రమంలోనే వెయిట్ లాస్ అయ్యేందుకుగాను రకరకాల ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు. అయితే, సహజ సిద్ధంగా వెయిట్ అస్ అయ్యేందుకు వాము ఉపయోగపడుతుందని చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. వాము వల్ల వెయిట్ లాస్ అవడం ఒక్కటే కాదు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం..

సాధారణంగా అందరి ఇళ్లలో సుగంధ ద్రవ్యాలు ఉండే ఉంటాయి. అందులో ఒకటి అజ్వైన్ అనగా వాము. ఈ వాము గింజలు వంటలకు అత్యద్భుతమైన టేస్ట్‌ను అందిస్తాయి. అంతేగాకుండా ఈ వాము మనుషుల వెయిట్ తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మనుషులకు ఈ వాము వల్ల ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలు బోలెడున్నాయి.

వాములోని థైమాల్ అనే ఆయిల్ హ్యూమన్ డైజేషన్ సిస్టమ్ మెరుగుపర్చడానికి తోడ్పడుతుంది. ఈ ఆయిల్ జీర్ణవ్యవస్థ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. శరీర జీవక్రియ రేటును మెరుగుపరచడంలో సాయపడుతుంది. అయితే, వెయిట్ లాస్ అవాలనుకునే వారు ఈ వాము గింజలను సరైన పద్ధతిలో తీసుకోవాలి. వాము నీరును తాగడం ద్వారా చక్కటి ఆరోగ్య ప్రయోజనాలుంటాయి.

Ajwain

Ajwain

ఇకపోతే వాము నీళ్లను తయారు చేయడం చాలా ఈజీ. తొలుత వాము గింజలను వేయించాలి.. ఆ తర్వాత వేయించిన గింజలను వేడి నీళ్లలో వేయాలి. అలా వేడి నీళ్లలో వాముగింజలు వేసిన తర్వాత కొద్ది సేపటికే రంగు మారుతుంది. అంతే వాము నీళ్లు రెడీ అయినట్లే.. ఆ వేడి నీళ్లను వడపోసి చల్లారిన తర్వాత తాగేయొచ్చు. వాము ఒక్కదానినే ఆహారంలో భాగం చేసుకోవడం కష్టమైతే కనుక తేనెతో మిక్స్ చేసి వామును తీసుకోవచ్చు. వెయిట్ లాస్ అయ్యేందుకుగాను వాము తోడ్పాటును అందిస్తుంది.

తేనెలోని విటమిన్స్, అమైనో యాసిడ్స్, హ్యూమన్ డైజెషన్ ప్రక్రియను వేగవంతం చేయడంలో సాయపడతాయి. ప్రతీ రోజు వాము వాటర్‌ను తీసుకోవడం వలన మీరు త్వరగా వెయిట్ లాస్ అవుతారు. అయితే, తేనె వాము మిక్స్ చేయడానికి ఈ పద్ధతి ఫాలో అవండి.. ఒక గ్లాసెడు నీటిలో చెంచడు వాము గింజలను నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని రాత్రంతా నానబెట్టాలి. అలా నానబెట్టిన నీటిని ఫిల్టర్ చేసి అందులో ఒక చెంచడు తేనెను కలిపి ప్రతీ రోజు తాగాలి. అలా చేయడం వలన మీరు క్రమంగా వెయిట్ లాస్ అవుతారు. వామును పొడిగా చేసుకుని కూడా తీసుకోవచ్చు. అయితే, ఇందుకుగాను సమపాళ్లలో మెంతులు, సోంపు గింజలను కలపాలి. ఆ తర్వాత వాటిని గ్రౌండ్ చేసి ఆ తర్వాత నిల్వ చేసుకోవాలి. ఇక అన్నం తినే సమయంలో కాని లేదా పడుకునే ముందర కాని ఒక గ్లాసు నీటిలో చెంచడు వాము పౌడర్ వేసుకుని తాగాలి. పచ్చి వామును ఉదయం పూట నమలడం వల్ల కూడా చక్కటి ప్రయోజనాలుంటాయి.

Tags

Latest News

Related News