Amaranthus spinosus : ఈ కలుపు మొక్క రసంతో మూత్ర పిండాల్లోని రాళ్లు కరుగును..

Amaranthus spinosus : ప్రస్తుతం మనకు అధునాతమైన ఇంగ్లిష్ వైద్యం అందుబాటులో ఉంది. ఏదేని విషయమై చిన్న నొప్పి వచ్చినా అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే మందులు తీసుకుంటున్నాం. కానీ, పూర్వం అటువంటి పరిస్థితులు లేవు. ప్రకృతిలో లభించే వనమూలికలు, చెట్ల ఔషధాలనే వారు మందులుగా ఉపయోగించేవారు. అటువంటి ఓ అద్భుతమైన ఔషధగుణాలున్నటువంటి మొక్కను గురించి తెలుసుకుందాం. ఇప్పటికీ పల్లెటూర్లలో పెద్దలు ప్రకృతిలో లభించేటువంటి రకరకాల మొక్కలను ఔషధాలుగా ఉపయోగిస్తుంటారు. అలా పల్లెటూర్లలోని చేల గట్లలో పెరిగే […].

By: jyothi

Published Date - Fri - 19 November 21

Amaranthus spinosus : ఈ కలుపు మొక్క రసంతో మూత్ర పిండాల్లోని రాళ్లు కరుగును..

Amaranthus spinosus : ప్రస్తుతం మనకు అధునాతమైన ఇంగ్లిష్ వైద్యం అందుబాటులో ఉంది. ఏదేని విషయమై చిన్న నొప్పి వచ్చినా అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే మందులు తీసుకుంటున్నాం. కానీ, పూర్వం అటువంటి పరిస్థితులు లేవు. ప్రకృతిలో లభించే వనమూలికలు, చెట్ల ఔషధాలనే వారు మందులుగా ఉపయోగించేవారు. అటువంటి ఓ అద్భుతమైన ఔషధగుణాలున్నటువంటి మొక్కను గురించి తెలుసుకుందాం.

ఇప్పటికీ పల్లెటూర్లలో పెద్దలు ప్రకృతిలో లభించేటువంటి రకరకాల మొక్కలను ఔషధాలుగా ఉపయోగిస్తుంటారు. అలా పల్లెటూర్లలోని చేల గట్లలో పెరిగే కలుపు మొక్క గురించే ఇప్పుడు మనం చర్చిద్దాం. ఆ మొక్క పేరు ముళ్ల తోటకూర మొక్క. వరి పొలాల్లో ఇతర గట్లపైన ఇది పెరుగుతుంటుంది. వరిలో అయితే దీనిని కలుపు మొక్కగా భావించి తీసి పక్కన పెట్టేస్తుంటాం.

ఈ ముళ్ల తోటకూర ఆకుపచ్చ, వైట్, రెడ్ కలర్‌లో ఉంటుంది. ఈ ముళ్ల తోటకూర మొకక్కను ఆఫ్రికన్ కంట్రీస్‌లో ఫుడ్ ఐటంగా తీసుకుంటారు. వాటిని సాగు చేస్తుంటారు కూడా. ముళ్ల తోట కూర పేరులో ఉన్నట్లుగా మొక్కకు ముళ్లు ఉన్నప్పటికీ వాటిని తీసేసి ఆకులను రసంగా తీసుకుంటే మనిషి ఆరోగ్యానికి చక్కటి ప్రయోజనాలుంటాయి.

Amaranthus spinosus

Amaranthus spinosus

ఇటీవల కాలంలో చాలా మంది మూత్రపిండాల్లో రాళ్లు వచ్చాయని బాధపడుతుండటం చూడొచ్చు. సహజ సిద్ధంగా వాటిని తగ్గించుకునేందుకు టైం లేక ఆపరేషన్స్ చేయించుకుని మూత్రిపిండాల లోపల ఉన్న రాళ్లను బ్లాస్ట్ చేయించుకుంటున్నారు. కాగా, మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న వారు మూత్రం పోసే వేళలో ఏదేని సమస్యలున్న వారు ఈ ముళ్ల తోటకూరను ఇలా తీసుకోవాలి. ఈ మొక్క వేళ్లను ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. అనంతరం ఆ పొడిని పావు చెంచడు ఓ గ్లాసు గోరు వెచ్చని నీటిలో కలిపి వేడి చేసి భోజనానికి అర గంట ముందర తీసుకోవాలి.

అలా ఓ నలభై రోజులు తీసుకున్నట్లయితే మూత్రపిండాల లోపలి రాళ్లు ఇట్టే కరిగిపోతాయి. ఇందుకుగాను ముళ్ల తోట కూర ముదురు చెట్లను ఎంచుకుని వాటి వేర్లను భద్రపరిచి ఇలా యూజ్ చేసుకోవాలి. పాము, తేలు వంటివి కాటు వేసినపుడు మనం వెంటనే ఇంగ్లిష్ డాక్టర్‌ను సంప్రదిస్తున్నాం. అయితే, ఆ క్రమంలోనే ప్రాథమిక చికిత్సగా విషం ెక్కకుండా ఉండేందుకుగాను ముళ్ల తోటకూర రసం పని చేస్తుంది. పాము లేదా తేలు కాటు వేసిన టైంలో ముళ్ల తోట కూర ఆకులను బాగా దంచి రసంగా చేసుకుని దానిని తీసుకోవాలి. అలా చేయడం వలన విషం శరీరంలోపలి భాగాలకు పాకకుండా ఉంటుంది.

Tags

Latest News

Related News