Amla Juice : ఉసిరి రసంతో హార్ట్ డిసీజెస్‌కు చెక్..

Amla Juice : ఇటీవల కాలంలో చాలా మంది చిన్న వయసులోనే ఊబకాయులువుతుండటం మనం చూడొచ్చు. ఊబకాయం వల్ల ఇంకా ఇతర అనారోగ్య సమస్యలు దరి చేరి వారు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వెయిట్ బాగా గెయిన్ అయిన వారిలో వచ్చే ప్రధాన మైన సమస్యల్లో హార్ట్ డిసీజెస్ ఉంటున్నాయి. ఈ క్రమంలోనే గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రెగ్యులర్ ఎక్సర్ సైజెస్ చేస్తుండటంతో పాటు ప్రకృతిలో […].

By: jyothi

Published Date - Mon - 1 November 21

Amla Juice : ఉసిరి రసంతో హార్ట్ డిసీజెస్‌కు చెక్..

Amla Juice : ఇటీవల కాలంలో చాలా మంది చిన్న వయసులోనే ఊబకాయులువుతుండటం మనం చూడొచ్చు. ఊబకాయం వల్ల ఇంకా ఇతర అనారోగ్య సమస్యలు దరి చేరి వారు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వెయిట్ బాగా గెయిన్ అయిన వారిలో వచ్చే ప్రధాన మైన సమస్యల్లో హార్ట్ డిసీజెస్ ఉంటున్నాయి. ఈ క్రమంలోనే గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

రెగ్యులర్ ఎక్సర్ సైజెస్ చేస్తుండటంతో పాటు ప్రకృతిలో లభించే సహజ సిద్ధమైన ఆహార పదర్థాలను తీసుకోవాలి. అటువంటి వాటిలో ఒకటి ఉసిరి కాయలు.. ఈ ఉసిరి కాయల రసం తాగడం వల్ల వెయిట్ లాస్ అవడంతో పాటు హెల్త్‌కు బోలెడు బెన్ ఫిట్స్ ఉన్నాయి. అవేంటో ఈ స్టోరి చదివి తెలుసుకుందాం.

వెయిట్ లాస్ అయ్యేందుకుగాను చాలా మంది రకరకాల పద్ధతులు ఫాలో అయి ఉంటారు. అయితే, వెయిట్ లాష్ అయేందకు ఉసిరి రసం తోడ్పడుతుందన్న సంగతి వారికి తెలిసి ఉంటే వారు తప్పకుండా ఉసిరి రసాన్ని స్వీకరించేవారేమో.. కాగా, ఉసిరి రసం తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవడమే కాదు.. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందట. పోషకాల భాండాగారంగా ఉన్న ఉసరిని ప్రతీ ఒక్కరు తమ ఆహారంలో భాగం చేసుకుంటే చక్కటి ఫలితాలుంటాయని పెద్దలు చెప్తున్నారు.

Amla Juice

Amla Juice

ఉసిరిలో ఉండే పోషకాలు కొన్ని రకాల వ్యాధులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక ఉసిరిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. కరోనా మహమ్మరి వేవ్స్ నేపథ్యంలో చాలా మంది విటమిన్ సి ఫ్రూట్స్ తీసుకునేందుకుగాను ఆసక్తి చూపిన సంగతి తెలిసిందే. కాగా, వారు ఉసిరి కాయలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఉసిరిలో ఉండేటువంటి బలవర్ధకమైన యాంటీ ఆక్సిడెంట్స్ హెల్త్‌కు చాలా మంచివి. మనిషిని ఆరోగ్యంగా ఉంచడంలో ఉసిరికాయలు, రసం చాలా కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు ఉంటున్నారు.

ఉసిరికాయలను ఆహారంలో భాగం చేసుకుంటే జలుబు, దగ్గు ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ వివరిస్తున్నారు. ఉసిరిలో పుష్కలంగా ఉండే ఫైబర్ హెల్త్‌కు చాలా అవసరమైనది. ఇకపోతే ఉసిరి తినడం వలన ఆకలి కూడా తగ్గుతుంది. ఫలితంగా ఆహారం తక్కువగా తీసుకుంటాం.. అలా వెయిట్ లాస్ అయ్యే చాన్సెస్ ఉంటాయి. వెయిట్ లాస్ అవాలనుకునే వారు ప్రతీ రోజు ఉసిరికాయలను కాని ఉసిరి రసం కాని తీసుకుంటే చక్కటి ఫలితాలుంటాయి. ఉసిరికాయలు శరీరంలోని బ్యాడ్ కొలస్ట్రాల్‌కు చెక్ పెడతాయి. ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వ్యాధులను తగ్గించేందుకు సాయపడతాయి. ప్రతీ రోజు ఉసిరి రసం తాగడం వల్ల మీరు యవ్వనంగా కనబడతారు. ఇవి స్కిన్ డిసీజెస్‌ను కూడా తగ్గిస్తాయి. ఉసిరిని జ్యూస్ చేసుకోవడం కూడా చాలా సింపుల్.. గోరు వెచ్చని నీటిలో ఉసిరికాయలను మిక్స్ చేసి కలుపుకుని తాగేయొచ్చు.

Tags

Latest News

Related News