sprouts :మొలకెత్తిన పెసలతో 5 అద్బుత ఆరోగ్య ప్రయోజనాలు

sprouts : ఆయుర్వేద నిపుణులు మన వంటింట్లోనే సర్వ రోగ నివారణకు ఔషదాలు ఉంటాయని.. కాని ఎక్కువ మంది మాత్రం చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా ఆసుపత్రుల వెంట పరుగులు తీస్తారని అంటూ ఉంటారు. వంట గదిలో ఉండే పలు పదార్థాలు ఎన్నో రోగాలకు ఔషదంగా పని చేస్తాయి. ఆ విషయం గుర్తించకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు అన్నట్లు ఆసుపత్రుల చుట్టు తిరుగుతూ ఉంటారు. ఉదాహరణకు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే పెసలు ఎన్నో […].

By: jyothi

Updated On - Sat - 20 November 21

sprouts :మొలకెత్తిన పెసలతో 5 అద్బుత ఆరోగ్య ప్రయోజనాలు

sprouts : ఆయుర్వేద నిపుణులు మన వంటింట్లోనే సర్వ రోగ నివారణకు ఔషదాలు ఉంటాయని.. కాని ఎక్కువ మంది మాత్రం చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా ఆసుపత్రుల వెంట పరుగులు తీస్తారని అంటూ ఉంటారు. వంట గదిలో ఉండే పలు పదార్థాలు ఎన్నో రోగాలకు ఔషదంగా పని చేస్తాయి. ఆ విషయం గుర్తించకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు అన్నట్లు ఆసుపత్రుల చుట్టు తిరుగుతూ ఉంటారు. ఉదాహరణకు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే పెసలు ఎన్నో అనారోగ్య సమస్యలను దీర్ఘ కాలిక రోగాలను కూడా తగ్గిస్తుంది. పెసలను కాస్త నాన బెట్టి మొలకెత్తిన తర్వాత తింటే లభించే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. బరువు తగ్గాలనుకున్న వారి నుండి మొదలుకు పెట్టుకుంటే దీర్ఘ కాలిక డయాబెటీస్ సమస్యతో బాధ పడే వారి వరకు కూడా ఈ మొలకలు ప్రయోజనకారిగా ఉంటాయని నిపుణులు చెబుతూ ఉన్నారు. డయాబెటీస్ తో బాధపడే వారికోసం ఆయుర్వేద వైధ్యులు ఈ మొలకలను ఎక్కువగా సిఫార్సు చేస్తారు అంటే ఎంతగా వీటివల్ల ప్రయోజనం ఉందో అర్థం చేసుకోవచ్చు. మొలకెత్తిన పెసలతో కలిగే 5 అద్బుత ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం.

sprouts grams seeds

sprouts grams seeds


1. షుగర్ వ్యాది గ్రస్తులు రెగ్యులర్‌ గా మొలకలు తినడం వల్ల ఇన్సిలిన్ లెవల్స్‌ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. కొన్నాళ్లు రెగ్యులర్ గా మొలకలు తినడం వల్ల ఇన్సులిన్‌ అవసరం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. మొలకల్లో ఉండే పోషకాల వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. అందువల్ల కొన్నాళ్లకు షుగర్ వ్యాది కంట్రోల్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మొలకల్లో ఉండే పైబర్ లు షుగర్ లేని వారికి భవిష్యత్తులో షుగర్ సమస్య రాకుండా కూడా చూస్తుందట. కనుక ప్రతి రోజు కప్పు పెసర మొలకలు తీసుకోవడం వల్ల షుగర్ ఉన్న వారు మరియు షుగర్ లేని వారికి కూడా ప్రయోజనం.

sprouts good for diabetics

sprouts good for diabetics


2. అధిక బరువు తో బాధ పడుతున్న వారు ఆహారం తీసుకోకుండా కడుపు మాడ్చుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల మరింతగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కనుక బరువు తగ్గాలనుకున్న వారు పెసర మొలకలు తినడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. పెసల్లలో ఉండే ప్రోటీన్లు శరీరంకు కావాల్సిన శక్తిని అందజేయడంతో పాటు కొవ్వు పదార్థాలు కరిగి పోయేలా చేస్తుంది. తద్వార శరీరం బరువు కొన్ని నెలల గ్యాప్‌ లోనే మార్పు వచ్చినట్లుగా గుర్తించారు.

sprouts for weight loss

sprouts for weight loss


3. శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకు పోయిన వారు తప్పకుండా తినాల్సిన ఆహారం లో ఖచ్చితంగా మొలకలు కూడా ఉంటాయి. ప్రేగులు మరియు పొట్ట నడుము భాగంలో చాలా మందికి కొలెస్ట్రాల్‌ పేరుకు పోతుంది. దాన్ని కరిగించే గుణం పెసర మొలకలకు ఉంది. శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్‌ శాతంను పూర్తిగా తగ్గించడం పెసర మొలకలతో సాధ్యమే అంటూ నిపుణులు బలంగా నమ్ముతున్నారు. అందుకే ఆయుర్వేద నిపుణులు కొవ్వు కరిగేందుకు మొలకలు సూచిస్తూ ఉంటారు.

sprouts

sprouts


4. అజీర్తి సమస్యతో బాధ పడే వారు, మలబద్దకం సమస్యతో దీర్ఘ కాలంగా ఇబ్బంది పడే వారు మొలకలు తినడం వల్ల మెటబాలిజం సక్రమంగా పని చేస్తుంది. ముఖ్యంగా ఆహార వ్యవస్థ అనేది బాగుంటుందని.. తద్వార అజీర్తి సమస్య మరియు మలబద్దక సమస్యలు పూర్తిగా తొలగి పోతాయి.

sprouts for indegetion

sprouts for indegetion


5. చివరగా మొలకెత్తిన పెసల్లు రెగ్యులర్ గా తినే వారిలో క్యాన్సర్‌ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని.. మొలకల్లో ఉండే పైబర్‌ క్యాన్సర్‌ కు మనను దూరంగా ఉంచుతాయి అంటూ నిరూపితం అయ్యింది. ఇన్ని అద్బుత ప్రయోజనాలు ఉన్న పెసలను ఇప్పటి నుండి కూడా తినకుంటే మీ ఆరోగ్యం పట్ల మీకు ఎంత అశ్రద్ద ఉందో మీకే తెలిసి పోతుంది.

sprouts for cancer patients

sprouts for cancer patients

Tags

Latest News

Related News