Badam milk: బాదంలో వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. కాస్త ఖరీదు అయినా కూడా రెగ్యులర్ గా బాదాం తినడం వల్ల ఖచ్చితంగా పలు అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతుందని వైధ్యులు అంటూ ఉన్నారు. శరీరంతో పాటు మానసిక వికాశం కోసం కూడా బాదం ఉపయోగపడుతుంది. అందుకే పిల్లలకు ఎక్కువగా బాదం తినిపించేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తూ ఉంటారు. రాత్రి సమయంలో నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే వాటిపై ఉన్న పొట్టును తొలగించి తినడం వల్ల పలు ప్రయోజనాలు ఉంటాయి. ఈ విషయం చిన్న వారి నుండి పెద్ద వారి వరకు అందరికి తెలుసు. ఇప్పుడు మనం బాదం పాల గురించి తెలుసుకుందాం. బాదం పాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటీ తెలుసుకోండి.
మొదట బాదం పాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.. 100 గ్రాముల బాదం పప్పును తీసుకుని అర లీటరు నీటిలో వేయాలి. కాస్త నానిన తర్వాత లేదా వెంటనే అయినా మిక్సీలో వేసుకుని మెత్తగా పట్టుకోవాలి. అప్పుడు చిక్కటి బాదం పాలు తయారు అవుతాయి. ఆ పాలను అలాగే అయినా తాగవచ్చు లేదంటే తగినంత చెక్కర వేసుకుని మరింత టేస్టు కోసం తేనె లేదా కుంకుమ పువ్వు వంటివి కూడా వేసుకోవచ్చు. బాదం పాలు కాస్త చల్లగా అవ్వడంకు కొద్ది సమయం ఫ్రిజ్ లో పెట్టి ఆ తర్వాత తీసి తాగేయవచ్చు. ఈ బాదం పాలను పిల్లలు ఎక్కువగా ఇష్టంతో తాగాలంటే కాస్త చాక్లెట్ ప్లేవర్ లేదా వెనీల ప్లేవర్ పౌడర్ లను కూడా జత చేయవచ్చు. లేదంటే చెక్కర మాత్రమే వేసినా కూడా పిల్లలు ఇష్టంగా తాగుతారు. ఇంట్లో చాలా ఈజీగా రెండు నుండి అయిదు నిమిషాల్లోనే ఈ బాదం మిల్క్ ను తయారు చేసుకోవచ్చు. కనుక బయట దొరికే క్వాలిటీ లేని బాదం పాల కంటే ఇంట్లోని బాదం పాలు ఆరోగ్యానికి ఎంతో శ్రేయష్కరం.
ఇక బాదం పాల వల్ల ప్రయోజనాల గురించి చూద్దాం. పిల్లలో మానసిక వికాసం పెంచడంతో పాటు వారి మెటబాలిజం సరిగ్గా పని చేయడంలో ప్రముఖంగా ఉపయోగపడుతుంది. బాదంలో ఉండే విటమిన్ డి వల్ల పలు ప్రయోజనాలు పిల్లలు మరియు పెద్దలకు కలుగుతాయి. పిల్లలో ఎముకలు దృడంగా అవ్వడం చాలా అవసరం. అందుకోసం వారికి బాదం మిల్క్ క్యాల్షియంను అందిస్తుంది. రెగ్యులర్ గా బాదాం మిల్క్ తాగే పిల్లల బోన్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతూ ఉంటారు. ఇక గర్బిణిలు బాదం పలుకులు లేదా బాదం మిల్క్ తాగడం వల్ల పుట్టబోయే బిడ్డ చాలా ఆరోగ్యంతో పుట్టడంతో పాటు మానసిక వికాసం కూడా చాలా బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.
Badam-Milk
బాదంలో ఉన్న పైబర్ మరియు విటమిన్ ల వల్ల కొన్ని దీర్ఘ కాలిక జబ్బులకు కూడా దూరంగా ఉంచుతుంది. కనుక ప్రతి రోజు కూడా ఖచ్చితంగా లేదా వారంలో రెండు మూడు సార్లు అయినా పిల్లలు మరియు పెద్ద వారు కూడా బాదం మిల్క్ తీసుకోవడం మంచిది. డైరెక్ట్ గా బాదం తినవచ్చు కదా.. ఈ బాదం మిల్క్ ఎందుకు అనే అనుమానం కొందరికి వచ్చే అవకాశం ఉంది. నిపుణుల సూచన మేరకు బాదం డైరెక్ట్ గా తింటే డైజెషన్ అయ్యి దాని ప్రయోజనాలు శరీరంకు అందేందుకు కాస్త సమయం పడుతుందట. కాని బాదం మిల్క్ మాత్రం తక్షణ ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. బాదం మిల్క్ తో గుండెకు సంబంధించిన జబ్బులకు దూరంగా వచ్చవచ్చని అలాగే డయాబెటీస్ ఉన్న వారు రెగ్యులర్ గా సుగర్ లెస్ బాదం మిల్క్ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న బాదం మిల్క్ ను ఎందుకు మనమూ తీసుకోకూడదు.. వెంటనే వారంలో కనీసం రెండు మూడు సార్లు అయినా బాదం మిల్క్ తినేందుకు ప్రయత్నించండి.