Fenugreek Benefits : మెంతులతో అందం, ఆరోగ్యం.. స్కిన్ డీసీజెస్‌కు చెక్..

Fenugreek Benefits : ప్రస్తుత ఆధునిక సమాజంలో భిన్నమైన పోకడలు కనబడుతున్నాయి. మనుషుల జీవనశైలి రోజురోజుకూ మారిపోతున్నది. మరీ ముఖ్యంగా ఆహారపు అలవాట్లు కంప్లీట్‌గా చేంజ్ అవుతున్నాయి. ఫలితంగా చాలా మంది చిన్న వయసులోనే అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్వీకులు మనకు తెలిపిన ఔషధాలను తప్పక వాడాలని పెద్దలు, ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అటువంటి ఔషధాల జాబితాలో మెంతులు ఉంటాయి. ముఖ్యంగా వీటని చలికాలంలో ఉపయోగిస్తే చక్కటి ప్రయోజనాలుంటాయి. అవేంటో తెలుసుకుందాం. పురాతన కాలం […].

By: jyothi

Updated On - Wed - 24 November 21

Fenugreek Benefits : మెంతులతో అందం, ఆరోగ్యం.. స్కిన్ డీసీజెస్‌కు చెక్..

Fenugreek Benefits : ప్రస్తుత ఆధునిక సమాజంలో భిన్నమైన పోకడలు కనబడుతున్నాయి. మనుషుల జీవనశైలి రోజురోజుకూ మారిపోతున్నది. మరీ ముఖ్యంగా ఆహారపు అలవాట్లు కంప్లీట్‌గా చేంజ్ అవుతున్నాయి. ఫలితంగా చాలా మంది చిన్న వయసులోనే అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్వీకులు మనకు తెలిపిన ఔషధాలను తప్పక వాడాలని పెద్దలు, ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అటువంటి ఔషధాల జాబితాలో మెంతులు ఉంటాయి. ముఖ్యంగా వీటని చలికాలంలో ఉపయోగిస్తే చక్కటి ప్రయోజనాలుంటాయి. అవేంటో తెలుసుకుందాం.

methi leaves and seeds Fenugreek Benefits

methi leaves and seeds Fenugreek Benefits


పురాతన కాలం నుంచి మెంతులను పలు రకాల వ్యాధులను నయం చేసే ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఇకపోతే ఈ మెంతులను సోప్స్, షాంపుల తయారీలోనూ వాడుతారు. ఇందులో ఉండే పోషకాలు హెల్త్‌కు చాలా కావల్సినవి. మెంతుల్లో ఉండేటువంటి మినరల్స్ మాంగనీస్, మెగ్నిషియం, ఐరన్ అన్నీ కూడా హ్యూమన్ హెల్త్‌కు చాలా కావల్సినవి. చలికాలంలో వీటిని తీసుకోవడం వలన హ్యూమన్ బాడీలో హీట్ జనరేట్ అవుతుంది.

Fenugreek Benefits

Fenugreek Benefits


మెంతికూరలో ఉండేటువంటి ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ హెల్త్‌కు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కాపాడుతాయి. మెంతులు మలబద్ధకం, జీర్ణ సమస్యలు తలెత్తకుండా కాపాడుతాయి. ఇకపోతే మనుషులను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు వారి అందం పెంచే ఔషధంగా మెంతులు పని చేస్తాయి. మెంతులు పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచడంలో తోడ్పాటును అందిస్తాయి.

Fenugreek Benefits

Fenugreek Benefits


మెంతులు తీసుకోవడం వలన మనిషి ఆరోగ్యవంతుడుగా ఉంటాడు. హెయిర్ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేయడంలో మెంతులు చక్కగా పని చేస్తాయి. ఉన్న హెయిర్‌ను ప్రొటెక్ట్ చేయడంతో పాటు కొత్త హెయిర్‌ను ప్రొడ్యూస్ చేయడంలో మెంతుల్లో ఉండే ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ సాయం చేస్తాయి. మెంతు ఆకులను గ్రైండ్ చేసి హెడ్‌కు అప్లై చేయడం వలన హెయిర్ ఒత్తుగా పెరుగుతుంది. మెంతులలో ఉండేటువంటి ప్రోటీన్స్, కొవ్వులు, ఇతర పిండి పదార్థాలు, క్యాల్షియం, విటమిన్స్ అన్నీ కూడా హెల్త్‌కు చాలా ఉపయోగకరమైనవి.

Fenugreek Benefits

Fenugreek Benefits


మెంతు ఆకులలో విటమిన్స్ ఏ,బీ,సీ, కే ఉంటాయి. మెంతులు డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడంతో పాటు బ్లడ్ ఇష్యూస్ సాల్వ్ చేస్తాయి. రక్తహీనతతో బాధపడే వారికి చక్కటి ఔషధంగా మెంతులు పని చేస్తాయి. మెంతులను మన పూర్వీకులు ఎక్కువ మొత్తంలో తీసుకునే వారిని అలా తీసుకోవడం వల్లే వారు చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉండగలిగారని పెద్దలు పేర్కొంటున్నారు. మెంతులు స్కిన్ డిసీజెస్ రాకుండా కాపాడటంతో పాటు స్కిన్ ప్రొటెక్షన్‌కు సాయపడతాయి. చాతీ నొప్పలు, దగ్గు, ఆస్తమా ఇతర సమస్యలనూ మెంతులు పరిష్కరిస్తాయి. ఈ నేపథ్యంలోనే మెంతులను కంపల్సరీ తమ ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు

Read Today's Latest Health News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Tags

Latest News

Related News