Benefits Of Drinking Water: తల నొప్పి నుండి గుండె నొప్పి వరకు అన్నింటికి ‘మంచి నీళ్లు’ కారణం తెలుసా?

Benefits Of Drinking Water: మానవ శరీరంలో అత్యధిక భాగం నీరు ఉంటుందని చిన్నప్పుడే చదువుకున్నాం. అంత నీళ్లు ఉన్నాయి కదా ఇంకా ఎందుకు తాగడం లే అని కొందరు అనుకుంటూ ఉంటారు. వారు నీళ్ల విషయంలో చాలా పొదుపు అన్నట్లుగా వ్యవహరిస్తు ఉంటారు. అలాంటి వారు భవిష్యత్తులో అత్యంత కఠినమైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు వయసుకు తగ్గట్లుగా బరువుకు తగ్గట్లుగా నిపుణులు నిర్థేశించిన మొత్తంలో నీళ్లు తాగకుంటే నేడు రేపు […].

By: jyothi

Published Date - Wed - 22 September 21

Benefits Of Drinking Water: తల నొప్పి నుండి గుండె నొప్పి వరకు అన్నింటికి ‘మంచి నీళ్లు’ కారణం తెలుసా?

Benefits Of Drinking Water: మానవ శరీరంలో అత్యధిక భాగం నీరు ఉంటుందని చిన్నప్పుడే చదువుకున్నాం. అంత నీళ్లు ఉన్నాయి కదా ఇంకా ఎందుకు తాగడం లే అని కొందరు అనుకుంటూ ఉంటారు. వారు నీళ్ల విషయంలో చాలా పొదుపు అన్నట్లుగా వ్యవహరిస్తు ఉంటారు. అలాంటి వారు భవిష్యత్తులో అత్యంత కఠినమైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు వయసుకు తగ్గట్లుగా బరువుకు తగ్గట్లుగా నిపుణులు నిర్థేశించిన మొత్తంలో నీళ్లు తాగకుంటే నేడు రేపు రాబోయే రెండు మూడు ఏళ్లలో ఏం కాకపోవచ్చు. కాని కొన్ని సంవత్సరాల తర్వాత మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సర్వే ఫలితాలు వెళ్లడి అయ్యాయి. శరీరంలో మోతాదుకు తక్కువ నీళ్లు ఉంటే చిన్న అనారోగ్య సమస్యలు కూడా ప్రాణాపాయ స్థితికి తీసుకు వెళ్తాయట.

మంచి నీళ్లు ఎక్కువ తాగని వారికి తల నొప్పి తో మొదలుకుని గుండె నొప్పి వరకు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అందుకే ప్రతి రోజు కూడా మినిమంగా వాటర్‌ ను తాగుతూ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తలనొప్పి లేదా మరేదైనా నొప్పి రావచ్చు అంటున్నారు. అధికంగా నీళ్లు తాగడం వల్ల లాభాలు ఏంటీ.. తాగక పోవడం వల్ల జరిగే నష్టం ఏంటీ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. శరీరం డీ హైడ్రేషన్‌ అవుతూ ఉంటుంది. అది రెగ్యులర్‌ పక్రియ. అయితే కొన్ని సార్లు చాలా ఎక్కువగా శరీరం డీ హైడ్రేషన్‌ అవుతూ ఉంటుంది. ఆ సమయంలో తక్కువ నీళ్లు తాగడం వల్ల డీ హైడ్రేషన్‌ సమస్య తలెత్తి తీవ్రమైన తలనొప్పిగా మారుతుంది. అలా తల నొప్పికి కారణం నీళ్లు తాగక పోవడం అంటూ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.ఎవరైతే మల బద్దకం మరియు అజీర్ణ సమస్యలతో బాధపడుతున్నారో వారు ఖచ్చితంగా అధికంగా నీరు తీసుకోవాలి. ఎవరైతే తక్కువ నీళ్లు తీసుకుంటారో వారికి ఈ సమస్య వస్తుంది. రెగ్యులర్ గా మంచి నీటిని అధిక మొత్తంలో తాగుతూ ఉండటం వల్ల మల బద్దక సమస్య అనేది దరి చేరదు అంటూ నిపుణులు చెబుతున్నారు.

ఇక రక్త ప్రసరణ సరిగా సాగాలన్నా కూడా మంచి నీటిని అధికంగా తాగితేనే అవుతుందట. మంచి నీళ్లు అధికంగా తాగకుంటే రక్త నాళాల ద్వారా స్పీడ్‌ గా రక్తం ప్రసరణ అవ్వదు. తద్వార గుండెకు సంబంధిచి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఒకాకొన సమయంలో గుండె పోటు కూడా వచ్చే అవకాశం ఉంది అంటూ నిపుణులు చెబుతున్నారు. ఇక ఎక్కువ శాతం మందికి మూత్ర విసర్జన సమయంలో మంట గా ఉండటం లేదా మూత్రం పచ్చగా గోదుమ వర్ణం లో ఉండటం వల్ల కూడా మీరు నీళ్లు ఎక్కవగా తాగడం లేదని అర్థం. నీళ్లు ఎక్కువ తాగిన సమయంలో యూరిన్‌ నార్మల్‌ గా రావడంతో పాటు మంట తగ్గుతుంది. ఎంత ఎక్కువగా వాటర్ తాగితే అంత ఎక్కువగా యూరిన్ వస్తుంది. తద్వార అంత ఎక్కువగా కిడ్నీలు శుభ్రం అవుతాయని అంటూ ఉంటారు. మంచి నీళ్లు ఎక్కువగా తాగుతూ ఎక్కువగా యూరిన్‌ కు వెళ్లడం వల్ల కిడ్నీల్లో ఉన్న రాళ్లు కూడా కరిగి పోవడం లేద పడి పోవడం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి మంచు నీళ్లు అధికంగా తాగక పోతే మాత్రం తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే వయసుకు తగ్గట్లుగా నీళ్లు తాగాలి. ఉదాహరణకు పాతికేళ్ల మహిళ లేదా పురుషుడు కనీసం నాలుగు నుండి అయిదు లీటర్ల మంచు నీళ్లను తాగాలి. అది కేవలం నార్మల్‌ మాత్రమే. అంతకు మించి తాగాలే కాని తక్కువ తాగితే మాత్రం ఏవో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చివరకు ప్రాణాలు సైతం వదిలేయాల్సి రావచ్చు. అందుకే ప్రతి ఒక్కరు కూడా మంచి నీటి విషయంలో అస్సలు అశ్రద్ద చేయవద్దు అంటూ నిపుణులు సూచిస్తున్నారు.

Read Today's Latest Health News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News