Benefits Of Curd: ఇది చూడండి.. నిజంగా పెరుగు వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా అంటారేమో!

Benefits Of Curd: మన ఇండియన్స్ లో చాలా మందికి అన్నం తిన్న తర్వాత చివర్లో ఒక్క స్పూన్‌ గడ్డ పెరుగు వేసుకుని మూడు నాలుగు ముద్దలు తింటే కాని అన్నం తిన్నట్లుగా ఉండదు. పెరుగు తో తినకుంటే మాకు పూర్తి గా అన్నం తిన్న ఫీలింగే ఉండదు అంటారు. చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ల వరకు పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. పెరుగు లో ఉండే ఔషద గుణాలు చిన్న […].

By: jyothi

Published Date - Thu - 2 September 21

Benefits Of Curd: ఇది చూడండి.. నిజంగా పెరుగు వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా అంటారేమో!

Benefits Of Curd: మన ఇండియన్స్ లో చాలా మందికి అన్నం తిన్న తర్వాత చివర్లో ఒక్క స్పూన్‌ గడ్డ పెరుగు వేసుకుని మూడు నాలుగు ముద్దలు తింటే కాని అన్నం తిన్నట్లుగా ఉండదు. పెరుగు తో తినకుంటే మాకు పూర్తి గా అన్నం తిన్న ఫీలింగే ఉండదు అంటారు. చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ల వరకు పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. పెరుగు లో ఉండే ఔషద గుణాలు చిన్న చిన్న జబ్బులు మొదలుకుని ఎన్నో దీర్ఘ కాలిక జబ్బులకు కూడా మందులా పని చేస్తుంది. పెరుగులో ఉండే కాల్షియం పాస్పరస్ మరియు ప్రోటీన్లు మానవ శరీరంకు అద్బుతమైన బలంను మరియు రోగ నిరోదక శక్తిని కూడా ఇస్తుంది.  మన శరీరంకు కావాల్సిన పోషకాలను కూడా పెరుగు ఇస్తుందని శాస్త్రీయంగా నిరూపితం అయ్యింది. పెరుగును ఏ రకంగా తీసుకున్నా కూడా అద్బుతమైన ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతూ ఉంటారు. పెరుగు వల్ల కలిగే మరిన్ని ప్రయోజనల విషయానికి వస్తే…

పెరుగు రెగ్యులర్‌ గా తినడం వల్ల అధిక బరువు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. పెరుగులో కొవ్వు తక్కువగా ఉండి ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కనుక కొద్దిగా పెరుగు అన్నం తినడం వల్ల కావాల్సిన శక్తి లభిస్తుంది. తద్వార శరీరంలో అదనపు కొవ్వు పేరుకు పోవడం జరగదు. రెగ్యులర్‌ గా పెరుగు ను ఆహారంలోకి తీసుకోవడం వల్ల మెల్ల మెల్లగా కొవ్వు కరిగి పోయి బరువు తగ్గుతారు. పెరుగును రైతా లేదా లస్సీ రూపంలో తాగి ఒక పూట భోజనంకు దూరంగా ఉండటం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పాలు తాగడం కుదరని వారు దానికి ప్రత్యామ్నాయంగా పెరుగు తాగవచ్చు. పాలలో ఉండే కాల్షియం పెరుగులో కూడా ఉంటుంది. కనుక ఎవరికైతే కాల్షియ లోపం ఉండి ఎముకలు పటిష్టంగా ఉండవో వారు పెరుగు ను తమ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. రోగ నిరోదక శక్తి పెరగడంతో పాటు పలు ప్రోటీన్లను శరీరంకు అందిస్తుంది కనుక పెరుగన్నంను ప్రతి వైధ్యుడు కూడా సిఫార్సు చేస్తాడు.

 

దీర్ఘ కాలిక సమస్యలు అయిన గ్యాస్‌.. డయాబెటీస్ మరియు మలబద్దక సమస్యలకు పెరుగుతో చెక్‌ పెట్టవచ్చు. ఒకటి రెండు రోజుల్లో కాకున్నా కంటిన్యూగా పెరుగు తింటూ ఉండటం వల్ల ఆ దీర్ఘ కాలిక సమస్యలు అన్ని కూడా గుడ్‌ బై చెప్పి మరీ వెళ్లి పోతాయి. బాడీ లో షుగర్‌ లెవల్స్ ను బ్యాలెన్స్‌ చేసే పెరుగు లో ఔషద గుణాలు కూడా ఉంటాయి. పెరుగులో ఉండే పొటాషియం వల్ల బీపీని కంట్రోల్‌ లో ఉంచుతుంది. ఎవరైతే పెరుగు అన్నం రాత్రి సమయంలో తింటారు వారికి సుఖ నిద్ర లభిస్తుంది. అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పెరుగును ప్రతి ఒక్కరు ఇప్పటికే వినియోగిస్తున్నారని ఆశిస్తున్నాము. ఇప్పటి వరకు కూడా పెరుగు అంటే ఇష్టం లేదు అంటే ఇకపై అయినా ఇష్టంగా మార్చుకుని పెరుగు అన్నంను ఔషదంగా తిసుకోవడం బెటర్‌. పెరుగు తో తయారు అయ్యే వంటకాలతో కంటే పూర్తి పెరుగును తీసుకోవడం వల్ల ప్రయోజనం ఎక్కువగా కలుగుతుందని నిపుణులు అంటున్నారు. పెరుగును లో ఉండే గుణం కారణంగా గ్యాస్‌ ట్రబుల్‌ సమస్య తగ్గి పోవడంతో పాటు పలు ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా రెగ్యులర్‌ గా పెరుగును తీసుకోవడం మంచిది. రాత్రి సమయంలో నిద్రలోకి ఈజీగా జారుకునేందుకు చల్లటి పెరుగు తింటే ప్రయోజనం ఉంటుంది. ఇక పెరుగును కొందరు మజ్జికగా లేదంటే పల్చటి చల్లగా కూడా తాగుతారు. రూపం ఏదైనా కూడా ఖచ్చితంగా మజ్జిక అందించే ప్రయోజనం అద్బుతం. కనుక మజ్జిక ను మరింతగా ఇకపై మీరు వాడుతారని ఆశిస్తున్నాం.

 

Curd

మజ్జిక

పెరుగు

Use of curd

Use of milk and cud

health care tips

telugu health tips

arogyam in telugu

latest health news

ayurvedam telugu

 

Latest News

Related News