Green & Red Chillies: మిర్చి అని తీసి పక్కకు వేయకండి.. దీని ఔషద గుణాలు అద్బుతం

Green & Red Chillies: కూరలో వచ్చిన పచ్చి మిర్చి లేదా ఎండు మిర్చిని చాలా మంది పక్కకు పెట్టేస్తూ ఉంటారు. మనలో చాలా మంది ఆరోగ్యవంతమైన ఆహారంను పక్కకు పెట్టి పోషకాలు ఔషదగుణాలు లేని పిప్పిని తింటూ ఉంటాం. మిర్చిని పక్కన పెట్టడం అంటే ఔషదంను పక్కకు పెట్టడమే అని నిపుణుల భావన. గ్రీన్ చిల్లీ మరియు రెడ్‌ చిల్లీ రెంటిలో కూడా అద్బుతమైన ఔషద ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు నిరూపించారు. మిర్చిలో కారం కలిగించే […].

By: jyothi

Published Date - Tue - 31 August 21

Green & Red Chillies:  మిర్చి అని తీసి పక్కకు వేయకండి.. దీని ఔషద గుణాలు అద్బుతం

Green & Red Chillies: కూరలో వచ్చిన పచ్చి మిర్చి లేదా ఎండు మిర్చిని చాలా మంది పక్కకు పెట్టేస్తూ ఉంటారు. మనలో చాలా మంది ఆరోగ్యవంతమైన ఆహారంను పక్కకు పెట్టి పోషకాలు ఔషదగుణాలు లేని పిప్పిని తింటూ ఉంటాం. మిర్చిని పక్కన పెట్టడం అంటే ఔషదంను పక్కకు పెట్టడమే అని నిపుణుల భావన. గ్రీన్ చిల్లీ మరియు రెడ్‌ చిల్లీ రెంటిలో కూడా అద్బుతమైన ఔషద ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు నిరూపించారు. మిర్చిలో కారం కలిగించే గుణం క్యాప్సెయిసిన్ వల్ల కలుగుతుంది. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం క్యాప్సెయిసిన్ ఏ తినే ఆహారంలో అయితే ఉంటుందో అదో అద్బుతమైన ఔషదంగా పని చేస్తుంది. ఆయుర్వేద నిపుణులు ఎక్కువగా క్యాప్సెయిసిన్ ఉన్న పదార్థాలను ఔషదాల తయారీకి ఉపయోగిస్తారు. మిర్చిలో ఆ పదార్థం ఉండటం వల్ల ఎక్కువ శాతం ఔషదాల తయారీలో మిర్చిని కొద్ది మొత్తంలో అయినా వినియోగించడం జరుగుతుంది. కనుక మిర్చిని పక్కకు తీసి వేయకుండా కాస్త ఘాటు అయినా.. కాని అనిపించినా కూడా వాటిని తినడం మంచిదని మానసిక పరిస్థితి మెరుగు పడటం మొదలుకుని అనేక రకాల అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుందని మిర్చి గురించి అధ్యాయనం చేసిన వారు చెబుతున్నారు.

మిర్చి వల్ల కలిగే కొన్ని ముఖ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం చూద్దాం..

  1. జలువు చేసి ముక్కు దిబ్బడగా ఉన్న వారు కాస్త ఘటు పడేలా మిర్చిని తినడం వల్ల ఉపశమనం కలుగుతుంది. మిరపకాయ తిన్న సమయంలో ముక్కు రంద్రాల ద్వారా ద్రవాలు రావడం జరుగుతుంది. తద్వార ముక్కులు పట్టేయకుండా ఉంటాయి. ముక్కు క్లీయర్ అవ్వడంతో ఆ వెంటనే జలుబు కూడా కొద్ది సమయంలోనే కనిపించకుండా పోతుంది.

 

  1. జీర్ణ క్రియ వ్యవస్థ సరిగా లేని వారికి మిర్చి మంచి ఔషదం. ఇది వేడిని ఉత్పత్తి చేసి మూడు గంటల పాటు జీర్ణ వ్యవస్థ చాలా యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది. మిరపకాయలో ఉండే గుణం కారణంగా ఎక్కువ గా జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

 

  1. మనం రెగ్యులర్ గా తీసుకునే ఫుడ్‌ లో కాస్త ఘాటు అదేనండి మిర్చి ఉండటం వల్ల పలు దీర్ఘ కాలిక సమస్యలకు దూరం అవ్వడంతో పాటు కొన్ని ఫుడ్స్ తక్షణ రోగ నిర్థారణంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్‌ మరియు బీపీ ఉన్న వారి ఆరోగ్యం విషయంలో ఇది చాలా ఉపయోగదాయకంగా ఉంటుంది.

 

  1. మిరపకాయల్లోని బ్లడ్‌ థిన్నింగ్‌ లక్షణం వల్ల రక్త ప్రసరన మరింత పెరుగుతుంది. రక్తనాళాలు ఎక్కడ కూడా జామ్‌ అవ్వకుండా క్లీన్‌ గా ఉండే బాధ్యత కూడా మిరపకాయలు చూసుకుంటాయి. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కనుక రెగ్యులర్‌ గా మిర్చి తినడం వల్ల విటమిన్ సి లోపం జబ్బు తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

 

  1. చివరగా మిరపకాయల కారంను మోతాదులో ప్రతి రోజు రెగ్యులర్‌ గా తీసుకోవడం వల్ల డయాబెటిస్ లెవల్స్ సమంగా ఉంటాయి. ఎప్పుడు కూడా షుగర్ లెవల్స్‌ 60 శాతానికి మించకుండా తగ్గకుండా ఉంచుతుంది. అధిక బరువు తో బాధపడే వారికి కూడా ఇవి ప్రయోజన కారిగా భావిస్తున్నారు. కనుక ఇకపై అన్నంలో మిర్చి వస్తే చిరాకు పడకుండా తినడం మంచిది. ఇంట్లో కారం కాస్త ఎక్కువ అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా తినేయవచ్చు.

Use of red and green chilli

Health benefits of chillis

Red and green chilli

మిర్చి ప్రయోజనాలు

క్యాప్సెయిసిన్

Red chilli use

health care tips

telugu health tips

arogyam in telugu

latest health news

ayurvedam telugu

 

Read Today's Latest Health News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News