Leafy Green Vegetables: మన చుట్టు ఉన్న కూరగాయలు మరియు ఆకు కూరల్లో ఎన్నో అద్బుతమైన ఆయుర్వేద గుణాలు ఉన్నాయంటూ నిపుణులు చెబుతూ ఉన్నారు. ఆకు కూరలు తింటే పలు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని చాలా మందికి తెలుసు. కాని వాటిని తినేది మాత్రం చాలా తక్కువ మంది. ఉదాహరణకు కరివేపాకు ను తినడం వల్ల పలు రకాల సమస్యలు తొలగి పోతాయని ప్రతి రోజు ఏదో ఒక సందర్బంలో ఏదో ఒక చోట చదవడం లేదా చూడటం చేస్తూనే ఉంటాం. కాని కూరలో కరివేపాకు వస్తే తినేవారు మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే. కూరలో కరివేపాకునే తీసి వేసే వారు ఇక ఆకు కూరలను ఎంతగా తింటారో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా ఆకు కూరలను వారంలో రెండు లేదా మూడు సార్లు తినాలే కాని అద్బుతమైన ప్రయోజనాలు ఉన్నాయంటూ వైధ్యులు బల్లా గుద్ది మరీ చెబుతున్నారు. మనం రెగ్యులర్ గా చూసే గోంగూర నుండి మొదలుకుని బచ్చలి కూర, తోట కూర, చుక్క కూర ఇలా ప్రతి ఒక్క ఆకు కూరలో కూడా ప్రయోజనం చేకూర్చే విటమిన్లు పోషకాలు ఉంటాయి. ఏ ఆకు కూర వల్ల ఎలాంటి ప్రయోజనం ఉందో ఇప్పుడు మనం చూద్దాం..
కరివేపాకు ను అధికంగా వాడటం వల్ల షుగర్ వ్యాదిగ్రస్తుల్లో షుగర్ లెవల్స్ స్థిరంగా ఉంటాయి. ప్రతి రోజు పది ఆకులను ఉదయం మరియు రాత్రి సమయంలో తినడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ గా ఉంటాయట. ఇక అదే కంటిన్యూ చేస్తే కంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తొలగి పోవడంతో పాటు ముందు ముందు కంటి సమస్యలు రాకుండా సాయంగా ఉంటుందట. అందుకే కూరల్లో వేసే కరివేపాకును కూడా పక్కకు పెట్టకుండా తినాలి. కరివేపాకు రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని తెలుసుకున్న వారు ఆరోగ్యవంతులు అవుతారు.
పాలకూర వల్ల పలు ప్రయోజనాలు ఉంటాయి. వాతం చేయడం అంటే అజీర్తి వంటి సమస్యలు తలెత్తిన సమయంలో.. కఫ దోషం వంటి సమస్యలకు పాలకూర మంచి ఔషదం. రెగ్యులర్ గా పాలకూర తినేవారికి జీర్ణ వ్యవస్థ సరిగ్గా పని చేయడంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలకు దూరం ఉంచుతుంది. ముఖ్యంగా కంటి సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్నా కూడా పాలకూర వల్ల ప్రయోజనం దక్కుతుందట.
బచ్చలికూర తినే వారిలో వేడి తక్కువగా ఉంటుందని అంటారు. అంటే కొందరు అధిక వేడి వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఎక్కువ నీళ్లు తాగాలంటూ వైధ్యలు అంటూ ఉంటారు. నీటితో పాటు బచ్చలికూరను కూడా తీసుకోవడం వల్ల మరింతగా ప్రయోజనం ఉంటుంది. ఎండాకాలంలో వేడి చేసిన వారికి బచ్చలికూర తో భోజనం పెడితే బాడీ డీహైడ్రేడ్ అవ్వడానికి చాలా తక్కువ సమయం పడుతుందని అంటున్నారు.
తోట కూర, పూదీనా, కొత్తి మీరలు ఆస్తమా రోగ నివారణకు ఉపయోగపడటంతో పాటు శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు తయారు అవ్వడానికి కూడా ఉపయోగపడతాయి. శరీరంలో లో రోగ నిరోదక శక్తి పెంచడంలో పుదీనా మరియు కొత్తి మీరలు కీలకంగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
గోంగూర రెగ్యులర్ గా తినడం వల్ల గుండె సమస్యలకు దూరంగా ఉండవచ్చు అంటున్నారు. రక్త ప్రసరణ మొదలుకుని గుండె పని తీరు వరకు అనేక విధాలుగా గోంగూర ఉపయోగదాయకంగా పని చేస్తుందట. కూరలు వండుకునే ఆకు కూరలు మాత్రమే కాకుండా మరి కొన్ని ఆకులు కూడా ఆరోగ్యానికి ఔషదంగా పని చేస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. వేపాకు షుగర్ వ్యాది ఉన్న వారు వేప ఇగుర్లను రెగ్యులర్ తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని ఇప్పటికే పలువురు వైధ్యుల ప్రయోగంలో వెళ్లడి అయ్యింది. దానిమ్మ మరియు కంది ఆకులు కూడా రెగ్యులర్ గా కాకున్నా సీజనల్ గా అంటే మూడు నాలుగు నెలలకు ఒకసారి అయినా తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యంవంతులుగా జీవించే అవకాశం ఉంటుంది. కనుక ఆకే కదా అని లైట్ తీసుకోకుండా రెగ్యులర్ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.