Corn: మొక్కజొన్న తినడం మూలాన కలిగే లాభాలు మిన్న…

Corn గ్రామీణ ప్రాంతాల్లో నివసించినా, పట్టణాల్లో నివసించినా ప్రతి ఒక్కరికీ మొక్కజొన్న గురించి తెలిసే ఉంటుంది. ఇంతలా మొక్క జొన్న మన జీవితంలో భాగమైంది. ఏదో సరదా కోసమే మొక్క జొన్న కంకులను కొనుక్కుని చాలా మంది తింటుంటారు. అనేక చోట్ల రహదారుల వెంట మొక్కజొన్న కంకులను విరివిగా అమ్ముతూ ఉంటారు. వీటి ధర కూడా తక్కువగానే ఉండడంతో పేదవారు, ధనికులు అందరూ తింటారు. మొక్క జొన్నలతో అనేక రకాల వంటకాలు కూడా చేసుకుంటూ ఉంటారు. మొక్క […].

By: jyothi

Published Date - Sat - 16 October 21

Corn: మొక్కజొన్న తినడం మూలాన కలిగే లాభాలు మిన్న…

Corn గ్రామీణ ప్రాంతాల్లో నివసించినా, పట్టణాల్లో నివసించినా ప్రతి ఒక్కరికీ మొక్కజొన్న గురించి తెలిసే ఉంటుంది. ఇంతలా మొక్క జొన్న మన జీవితంలో భాగమైంది. ఏదో సరదా కోసమే మొక్క జొన్న కంకులను కొనుక్కుని చాలా మంది తింటుంటారు. అనేక చోట్ల రహదారుల వెంట మొక్కజొన్న కంకులను విరివిగా అమ్ముతూ ఉంటారు. వీటి ధర కూడా తక్కువగానే ఉండడంతో పేదవారు, ధనికులు అందరూ తింటారు. మొక్క జొన్నలతో అనేక రకాల వంటకాలు కూడా చేసుకుంటూ ఉంటారు. మొక్క జొన్న గారెలు అందుకు ఒక ఉదాహరణ. ప్రాంతాన్ని బట్టి మొక్కజొన్నతో చేసే వెరైటీలు మారుతూ ఉంటాయి. కొన్ని చోట్ల మొక్కజొన్ కంకులను పాయసంలా తయారు చేసుకుని చెక్కర, కాని బెల్లం కాని కలుపుకుని తింటారు. ప్రస్తుతం చాలా మంది మొక్కజొన్నల పిండితో తయారు చేసిన రొట్టెలను తింటున్నారు. ఇలా మొక్క జొన్న రొట్టెలు తినడం ఆరోగ్యానికి  చాలా మంచిదనే భావం ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో కలిగింది. ఇలా మొక్కజొన్నను తీసుకోవడం మూలాన అనేక లాభాలున్నాయి. అవేంటంటే….

మెుక్కజొన్న కంకుల్లో యాసిడ్లు విటమిన్లు విరివిగా ఉన్నాయి. అంతే కాకుండా మొక్క జొన్న పీచు పదార్థంగా కూడా పని చేస్తుంది. మెుక్కజొన్నలో పీచు పుష్కలంగా ఉంది. ఇలా పీచు ఉన్న పదార్థాలను తీసుకోవడం వలన జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది. ఆహారంలో పీచు ఉండడంతో మొక్కజొన్న మలబద్దకం, మెులలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పేగు కేన్సర్ భారి నుంచి మనల్ని రక్షిస్తుంది. మొక్కజొన్నలను తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ఎముకల బలం కోసం వాడే కాపర్, ఐరన్​ పోషకాలు మరియు లవణాలు, మినరల్స్​ మొక్కజొన్నలో అధికంగాఉంటాయి. చూడ్డానికి చిన్నగా ఉండే మొక్క జొన్న గింజలలో మినరల్స్​ అధికంగా ఉంటాయి. ఈ మొక్క జొన్న గింజలలో మెగ్నీషియం, ఐరన్ మూలకాలు ఉండడం మూలాన ఎముకలు గట్టి పడేందుకు ఇది సహాయం చేస్తుంది. అంతే కాకుండా ఎటువంటి కిడ్ని సమస్యలు రాకుండా కిడ్నీలను కాపాడుతుంది.

మెుక్కజొన్నలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో మరియు శరీరంపై ఎటువంటి ముడతలు ఏర్పడకుండా చేయడంలో మొక్కజొన్న ఉపయోగపడుతుంది. మరో విషయమేంటంటే వీటి నుంచి నూనెను కూడా తయారు చేస్తారు. ఎటువంటి చర్మ సంబంధ వ్యాధులు ఉన్నా సరే మొక్కజొన్న నూనె బాగా పనిచేస్తుంది. మనలో ఎవరైనా రక్తహీనతతో బాధపడుతుంటే వారికి మొక్కజొన్న దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫోలిక్​యాసిడ్​ వల్ల రక్తహీనత తగ్గిపోయి… ఎర్రరక్త కణాల సంఖ్య పెరుగుతుంది. గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు కూడా మొక్కజొన్న ఉపయోగపడుతుంది. ఇది కొలెస్ర్టాల్​ ని తగ్గించి రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులు తొలగిస్తుంది. దీంతో రక్త ప్రసరణ వేగంగా జరిగి గుండెపోటు, పక్షవాతం లాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉంటాయి. జుట్టు సమస్యలను తొలగించండంలో కూడా మొక్కజొన్న ఉపయోగపడుతుంది. రోజూ మొక్కజొన్న తినే వారి జుట్టు బలంగా ఉండడమే కాకుండా ఇందులో ఉండే సీ విటమిన్ మూలాన జుట్టు స్మూత్​ గా షైనీగా మారుతుంది. తక్షణం శక్తి కోసం మొక్కజొన్నను తినడం ఉత్తమం. ఇది రోజూ తినడం వల్ల హైపర్​ టెన్షన్​ కూడా దూరం చేసుకోవచ్చు. మొక్క జొన్న ను తినడం మూలాన అనేక సమస్యల నుంచి మనం విముక్తి పొందవచ్చు. కావున మొక్కజొన్నను టైంపాస్​ కు కాకుండా నిత్యం ఆహారంలో ఒక భాగం చేసుకుని తినడం అలవాటు చేసుకోవడం మంచిది.

Related News