Cracked Heel: కాళ్ల పగుళ్లకు ఇంతకు మించి అద్బుత ఔషదం ఏది ఉండదు

Cracked Heel: వర్షాకాలం రానే వచ్చింది. వానలు అప్పుడప్పుడు వచ్చే చుట్టాలు లాగా పలకరిస్తున్నాయి. పిల్లలు అయినా పెద్దాలు అయినా మరే వయసు వారు అయినా ఈ సమయంలో బయట తిరిగక తప్పదు. ఈ కాలంలో ఎక్కువగా మనల్ని వేధించేది కాళ్లు పగలడం. నీరు తగిలితే చాలు.. కొన్ని సార్లు ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంది. దీంతో చిన్న పిల్లలు అయితే మరింత బాధను అనుభవిస్తారు. నిజానికి ఇది పెద్ద సమస్య కాదు. కానీ మనం చేసే నిర్లక్ష్యంతో […].

By: jyothi

Published Date - Fri - 10 September 21

Cracked Heel: కాళ్ల పగుళ్లకు ఇంతకు మించి అద్బుత ఔషదం ఏది ఉండదు

Cracked Heel: వర్షాకాలం రానే వచ్చింది. వానలు అప్పుడప్పుడు వచ్చే చుట్టాలు లాగా పలకరిస్తున్నాయి. పిల్లలు అయినా పెద్దాలు అయినా మరే వయసు వారు అయినా ఈ సమయంలో బయట తిరిగక తప్పదు. ఈ కాలంలో ఎక్కువగా మనల్ని వేధించేది కాళ్లు పగలడం. నీరు తగిలితే చాలు.. కొన్ని సార్లు ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంది. దీంతో చిన్న పిల్లలు అయితే మరింత బాధను అనుభవిస్తారు. నిజానికి ఇది పెద్ద సమస్య కాదు. కానీ మనం చేసే నిర్లక్ష్యంతో దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటాం. దీనికి ప్రధాన కారణం చాలా చిన్నదిగా చూడడం. ఇలా చూడడం వల్ల వాటంతట అవి తగ్గిపోతాయి అనే భావనలో చాలా మంది ఉండిపోతారు. దీంతో అవి మొల్లగా ముదిరి పాకాన పడినట్లు పెద్ద సమస్యగా మారుతుంది. ఎంతలా అంటే చివరికి లేచి తిరగలేనంతలా… కనీసం కాలు బయట పెట్టాలి అన్నాగానీ ఎంతో ఇబ్బంది పడుతారు. రోజు ఆఫీసుకు వెళ్లే వారి పని అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. ఎక్కువగా తిరుగుతూ ఉండడం వల్ల.. పగిలిన కాళ్ల దగ్గర కొయ్యల లాగా వచ్చినవి చెప్పులకు తగిలితే చాలా బాధ కలిగిస్తాయి. ఇంతగా ఇబ్బంది పెట్టే ఈ కాళ్లు పగుళ్లకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి ఏంటో ఓ లుక్కేద్దామా….

కాళ్లు పగిలినప్పుడు రాత్రి సమయానికి అంటే పడుకునే టైంకి ఎక్కువగా నొప్పి పెడుతుంటాయి. తట్టుకోలేని నొప్పిని అనుభవిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే వీటి నొప్పికి నిద్ర రాదు. అటువంటి టైంలోనే కాళ్లకు మంచిగా కొబ్బరి నూనెను రాసుకోవాలి. అంతేగాకుండా నొప్పిగా ఉన్న చోట మరింతగా మర్దన చేయడం వల్ల కొంత ఉపశమనం ఉంటుంది. దీనితో పాటు నువ్వుల నూనెను కూడా వాడవచ్చు. నువ్వుల నూనె వాడకంతో పగుళ్ల బాధ నుంచి విశ్రాంతి పొందడమే కాక క్రమక్రమంగా పగుళ్లు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి.

వానాకాలంలో పగుళ్లు ఎక్కువగా వస్తాయి కావున… ఆఫీసుకు పోయే వాళ్లు చెప్పులకు బదులు షూలను ధరించాలి. దీంతో పగుళ్లు కొంత కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. షూ వేసుకోవడం వల్ల కాళ్లకు నీరు తగడం అనే దానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో కాలి పగుళ్ల బాధ ఉండదు. ఇంట్లో ఉండే వారికి కోసం మరో పద్దతి ఉంది. అది ఏమిటంటే షూ వేసుకున్నప్పుడు వేసుకునే సాక్సులను ధరించడం. వాటిని శుభ్రంగా చేసి ధరించడం వల్ల పగుళ్లకు గాలి సోకదు. దీంతో నొప్పి తీసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో పాటు బాత్ రూం కోసం అని మనం తీసుకునే మెత్తగా ఉండే చెప్పులను ఇంట్లో తిరిగే సమయంలో  వేసుకుంటే చాలా మంచిది.

చలికాలంలో పెదాలు పగిలినప్పుడు మనం రాసుకునే వ్యాసిలైన్ కూడా ఈ కాలి పగుళ్లకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికి తోడుగా కొంచెం నిమ్మరసం తీసుకుని  రెండింటినీ ఒక కప్పులో వేసి గట్టిగా రంగరించి ఆ మిశ్రమాన్ని పగిలిన కాళ్ల దగ్గర గాని రాస్తే పగుళ్ల నుంచి కొంత ఉపశమనం దొరకుతుంది.

కాళ్ల పగుళ్లకు గొప్ప ఔషధంలా పనిచేసే మరోకటి కలబంద గుజ్జు. ఇది దొరకడం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ రాసిన కొంతసేపటికే పగుళ్ల నొప్పి కొంచెం కొంచెంగా తగ్గుతుంది. దీనిని కాళ్లకు అప్లై చేసే ముందు శుభ్రంగా నీటితో కడగాలి. ఆ తరువాత గుజ్జును కొంచెంగా చేతిలోకి తీసుకుని  పాదాలకు అప్లై చేయాలి. ఇలా చేస్తే గట్టిగా వారం రోజుకే తేడా కనిపిస్తుంది.

ఈ విధంగా  చేయడం వల్ల కాళ్ల పగుళ్ల నుంచి మీరు ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.

Related News