Boiled Egg : సాధారణంగా గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిదన్న సంగతి వైద్యులు, పెద్దలు చెప్తుంటారు. అయితే, ఉడికించిన గుడ్డును చలి కాలంలో తీసుకుంటే ఇంకా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో విపరీతమైన చలి, మంచు కురుస్తుండటం వలన మానవుల శరీరంలో కొన్ని మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే ఉడికించిన గుడ్డును క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకుంటే చక్కటి ప్రయోజనాలుంటాయని నిపుణులు అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.
హ్యూమన్ హెల్త్‌కు గుడ్డు వెరీ గుడ్డు అన్న సంగతి అందరికీ తెలసిందే. ఈ క్రమంలోనే పిల్లల నుంచి మొదలుకుని వృద్ధుల వరకు గర్భిణులు, బాలింతలు, నడీడు వయసు వారు అందరూ గుడ్డును ఇష్టంగా తీసుకుంటుంటారు. ప్రోటీన్స్ భాండాగారం అయిన గుడ్డు శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు అందించి ఆరోగ్యంగా ఉంచుతుంది. పోషకాహారానికి కేంద్ర బిందువుగా గుడ్డు ఉంటుంది. ప్రతీ రోజు గుడ్డును ఆహారంలో భాగం చేసుకుంటే చక్కటి ప్రయోజనాలుంటాయని హెల్త్ ఎక్స్ పర్ట్స్ వివరిస్తున్నారు.
గుడ్డును ఉడికించడం మాత్రమే కాకుండా ఆమ్లెట్‌గా కూడా తీసుకోవచ్చు. అయితే, ఆమ్లెట్‌గా కంటే కూడా ఉడికించి తీసుకునే గుడ్ల ద్వారానే చాలా మేలు జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉడికించిన గుడ్లలోని ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుందని, అది హ్యూమన్ బాడీ వెయిట్ ఇంక్రీజ్ అవకుండా చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇకపోతే గుడ్డు పచ్చ సొనలో ఉండే విటిమిన్స్ సీజనల్ డిసీజెస్ రాకుండా అడ్డుకుంటాయి. జలుబు, ఫ్లూను నివారించడంతో పాటు ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ చేసేందుకుగాను బాయిల్డ్ ఎగ్స్ ఉపయోగపడుతాయి. ఇక చలికాలంలో చర్మం పొడిబారకుండా గుడ్డులో ఉండే విటమిన్స్ సాయపడతాయట. అందుకే ఈ కాలంలో ప్రతీ రోజు గుడ్డును తమ ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Boiled Egg
ఎగ్స్ కళ్లు, బ్రెయిన్ ఆరోగ్యం కోసం బాగా పనిచేస్తాయి. ఎగ్స్‌లో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ మెదడు, కంటి ఆరోగ్యాన్ని పటిష్టం చేస్తాయి. ఎగ్స్ లో ఉండేటువంటి కోలిన్ అనే కెమికల్ మెమొరీ పవర్ ఇంక్రీజ్ చేయడంతో పాటు నర్వ్ సిస్టమ్‌ను ఇంకా స్ట్రాంగ్ చేస్తాయి. ఇకపోతే ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి చూపునకు చాలా అవసరమైంది. ఎగ్‌లో ఉండే ప్రోటీన్స్ హెల్త్‌కు చాలా అవసరమైనవి. ఎగ్ తినడం వలన హ్యూమన్ బాడీకి అవసరమైన ప్రోటీన్స్ అన్ని కూడా సమపాళ్లలో అందుతాయి. బాయిల్డ్ ఎగ్స్‌తో ఐరన్ లోపం కూడా సవరించబడుతుంది. గుడ్డులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.
ఇకపోతే ప్రోటీన్ లోపం ఏర్పడుకుండా ఉండేందుకుగాను గుడ్డులో ఉండే పచ్చసొన బాగా ఉపయోగపడుతుంది. ప్రతీ రోజు ఒక ఉడికించిన గుడ్డు తీసుకుంటే చాలు.. ఇమ్యూనిటీ పవర్ చాలా వేగంగా ఇంక్రీజ్ అవుతుందట. ఎగ్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్, ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.