CPR Treatment : చాలా మంది అప్పటి వరకు బాగానే మాట్లాడి చక్కగా పనులు చేసుకుంటూ సడెన్‌గా ప్రాణాలు కోల్పోతుంటారు. అలా వారు చనిపోవడానికి కారణం కార్డియాక్ అరెస్ట్. ఇది వచ్చిందంటే చాలు.. క్షణాల్లోనే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఇటువంటి వ్యక్తులను అపాయ పరిస్థితులను ఎలా కాపాడాలో తెలుసుకుందాం.
కార్డియాక్ అరెస్ట్ వచ్చినపుడు హార్ట్‌కు వెంటనే ట్రీట్‌మెంట్ అవసరం. అయితే, ఈ అరెస్టు వచ్చినపుడు అంత తొందరగా ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఈ క్రమంలోనే సత్వరంగా ప్రాథమిక చికిత్స అందించాల్సి ఉంటుంది. అలా ప్రాథమిక చికిత్స చేయం ద్వారా హాస్పిటల్ తీసుకెళ్లేంత వరకు ప్రాణాలతో ఉంటారు. ఈ ప్రైమరీ ట్రీట్‌మెంట్‌లో సీపీఆర్ కీ రోల్ ప్లే చేస్తుంది. సీపీఆర్ అనగా కార్డియో పల్మనరీ రీససిటేషన్.. దీని ద్వారా హార్ట్, బ్రీతింగ్ ఇష్యూస్‌తో బాధపడేవారిని ప్రాణాపాయ స్థితుల నుంచి కాపాడొచ్చని హార్ట్ సంబంధిత డిసీజెస్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.
కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యే పర్సన్స్ కోలుకునే సిచ్యువేషన్స్ క్షణ క్షణానికి తగ్గుతుంటాయి. ఈ నేపథ్యంలోనే హార్ట్ అటాక్‌కు గురయ్యే వ్యక్తికి సత్వరమే సీపీఆర్ చేయాల్సి ఉంటుంది. ఈ కార్డియాక్ అరెస్టుకు గురై హాస్పిటల్ చేరుకునే లోపల సీపీఆర్ ట్రీట్‌మెంట్ పొందుతున్న బాధితుల సంఖ్య46 శాతం ఉంటున్నది. అయితే, అలా సీపీఆర్ ట్రీట్‌మెంట్ పొందినప్పటికీ ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బయటపడుతున్న వారి సంఖ్య వందలో 12 మందికి మాత్రమే ఉంటుందని గణాంకాల ద్వారా తెలుస్తోంది.
CPR Treatment
ఈ క్రమంలోనే ప్రతీ ఒక్కరు సీపీఆర్ ట్రీట్‌మెంట్ గురించి తెలుసుకోవాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. కార్డియాక్ అరెస్టుకు గురైన వ్యక్తులను గుర్తించి వారికి ప్రాథమిక చికత్సలో భాగంగా సీపీఆర్ ట్రీట్‌మెంట్ ఇస్తే వారు ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బయటపడే చాన్సెస్ ఉంటాయి. కాబట్టి కార్డియాక్ అరెస్టు బాధితులకు సీపీఆర్ ట్రీట్‌మెంట్ అనేది ఎంత ముఖ్యమో తెలుసుకోవాల్సిన అవసరం ప్రతీ ఒక్కరికి కంపల్సరీగా ఉంటుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1.7 కోట్ల మంది ఏటా హార్ట్ డిసీజెస్‌తో ప్రాణాలు కోల్పోతున్నారు. అనగా ప్రతీ 90 సెకన్లకు ఒక వ్యక్తి కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోతున్నారు. కేన్సర్ డెత్ కంటే కూడా హార్ట్ డిసీజెస్ వల్ల చనిపోయే వారి సంఖ్యనే ఎక్కువగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతీ ఏటా 4,280 మంది కార్డియాక్ అరెస్టు వల్ల భారతదేశంలో చనిపోతున్నట్లు భారత వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ గణాంకాలు వివరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఆర్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులు సూచిస్తున్నారు.