Cucumber Benefits : ప్రతీ రోజు మనం ఎన్నో రకాల పండ్లు తీసుకుంటుంటాం. ఆహారపదార్థాలను తింటుంటాం. అయితే, అందులో మన హెల్త్‌కు మేలు చేసేవి తప్పకుండా మన ఆహారంలో భాగం చేసుకుంటేనే చక్కటి ప్రయోజనాలుంటాయి. అలా మన ఫుడ్‌లో భాగం చేసుకోవాల్సిన వాటిల్లో తప్పకుండా ఉండాల్సింది ‘కీర దోసకాయ’ అని తెలుసుకోవాలి. కీర దోసకాయను ప్రతీ రోజు తీసుకుంటే కనుక అనారోగ్యం అస్సలు మన దరిచేరదు.. కీర దోసకాయ వల్ల మనిషి ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..
Cucumber 2
మనిషి ఆరోగ్యానికి చక్కటి ఔషధంగా పని చేసే కీర దోసకాయ.. ఊబకాయాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మనిషికి ఆరోగ్యంతో పాటు అందం కూడా ప్రసాదిస్తుంది కీర దోసకాయ. ఎండాకాలంలో సలాడ్‌గా కీర దోసకాయను ఉపయోగిస్తుంటారు. పచ్చిగా ఉన్నపుడే కీర దోసకాయను తింటుంటారు కూడా. అయితే, కీర దోసకాయ కొంచెం చేదుగా అనిపిస్తుంటుంది. కానీ, అన్ని అలా ఉండవు.
కీరదోసలో ఉండే మినరల్స్ హెల్త్‌కు చాలా మంచివి. కీరదోసలోని వాటర్ కంటెంట్, పాస్పరస్, పొటాషియం, జింక్, మెగ్నిషియం, ఐరన్, కాల్షియం మనిషికి చాలా కావల్సినవి. ప్రతీ రోజు కీర దోసకాయ తింటే కనుక మనిషి శరీరంలోని అవసరం లేని విష పదార్థాలు బయటకు వెళ్తుంటాయి. శరీరానికి హాని కలిగించే పదార్థాలన్నీ కూడా బయటకు వెళ్లిపోతాయి. అనారోగ్య సమస్యలు పరిష్కరించడంలో కీర దోస కీలక పాత్ర పోషిస్తుంది.
Cucumber
కిడ్నీ పేషెంట్స్ లేదా కిడ్నీలో సమస్యలు ఏర్పడుతున్నట్లు భావించే వారు తప్పకుండా కీరదోసను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే కీర దోసకాయ కిడ్నీలను క్లీన్ చేస్తుంది. కిడ్నీలో ఉండే హానికారకమైన పదార్థాలను బటయకు పంపించేస్తుంది. కిడ్నీలో ఉండేటువంటి స్టోన్స్‌ను కరిగించేసి బయటకు పంపించేస్తుంది. దాంతో పాటు కిడ్నీలో స్టోన్స్ ఏర్పడకుండా కీర దోసలో ఉండే లక్షణాలు వాటిని కరగదీస్తుంటాయి. కీరదోస ప్రతీ రోజు తినడం వల్ల మనిషిలో ఉండే ఎక్సెస్ యూరిక్ యాసిడ్ అనే హానికార పదార్థం దానంతట అదే బయటకు వెళ్లిపోతుంది.
Cucumber 1
కీరదోసలో ఉండే గుణాలు కేన్సర్‌తో పోరాడుతాయి. కీర దోస హెల్దీ స్కిన్‌ను ప్రోత్సహించడంతో పాటు బ్లడ్ ప్రెషర్‌ను కంట్రోల్ చేస్తుంది. కీర దోస కడుపు అల్సర్‌ను కంట్రోల్ చేయడంతో పాటు పొట్టకు చలదనం అందిస్తుంది. కీరదోసలో ఉండేది 95 శాతం వాటర్ కాబట్టి సమ్మర్ టైమ్‌లో కీరదోసను రసంగా కాని లేదా కీరదోసను డైరెక్ట్‌గా తిన్నా కాని చక్కటి ప్రయోజనాలుంటాయి. బాడీని రీ హైడ్రేట్ చేయడంతో పాటు ఆకలిని తగ్గించేస్తుంది కీరదోస. మనిషి జీర్ణ శక్తి పెంచడంలోనూ కీర దోస కీలక పాత్ర పోషిస్తుంది.