curd.. ప్రస్తుత సమాజంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. కారణం తీసుకునే ఆహారంలో లోపమే అని తెలుస్తోంది. పోషకాహార లోపం, ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్ తీసుకోవడం వలన ఉబకాయం, అల్సర్లు, గ్యాస్, అసిడిటీ వ్యాధుల బారిన పడుతున్నారు జనాలు. అందుకే మనం తీసుకునే ఆహారం ప్రోటీన్లు, విటమిన్స్ ఉండేలా చూసుకోవాలి. కొందరు పెరుగును భోజనంలో ఎక్కువగా తీసుకుంటుంటారు. దీనివలన శరీరానికి కాల్షియం ఎక్కువగా అందుతుంది.
ఎముకలు ధృడంగా తయారవుతాయి. అధిక రక్తపోటుతో బాధపడే వారు రోజూ ఒక కప్పు పెరుగు తినడం వలన ఎంతో మంచి లాభం ఉంటుంది. పెరుగు తినడం వలన శరీరంలో కొవ్వు పదార్థాలు కూడా మంచి మోతాదులో ఉంటాయి. ఫలితంగా అనారోగ్యం బారిన పడటం తగ్గే చాన్స్ ఉంటుంది. అయితే, కొందరు పెరుగు తినే క్రమంలో ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ బాగా తీసుకుంటుంటారు. ఇలా చేయడం వలన ఆరోగ్యానికి చాలా డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
మొదటగా పెరుగు తినే వ్యక్తులు నంజుకోవడానికి ఉల్లిపాయలు, మిర్చి ఎక్కువగా తీసుకుంటుంటారు. ఉల్లి వలన శరీరంలో వేడి పెరుగుతుంది. పెరుగు చల్లదనం ఇవి రెండు కాంబినేషన్ వలన సోరియాసిస్, దద్దుర్ల వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా పెరుగు తినే టైంలో మామిడి పచ్చడి, పండ్లు కూడా తీసుకోవద్దట.. ఇలా చేస్తే అలర్జీ, చర్మ సమస్యలు వస్తాయని తెలుస్తోంది.
curd-1
ముఖ్యంగా పాలు, పెరుగు తీసుకోవడం వలన శరీరానికి మంచిది కాదటని నిపుణులు చెబుతున్నారు. రెండు తెల్లని పదార్థాలు తీసుకోవడం వలన శరీరంలో కాల్షియం మోతాదు పెరగడం వలన రియాక్షన్స్ వంటి కలుగవచ్చట.. దీంతో పాటు డయేరియా, జీర్ణ సమస్యలు కూడా అధికంగా ఎదురవుతాయని తెలుస్తోంది. పెరుగుతో పాటు సీ ఫుడ్స్.. చేపలు, రొయ్యలు వంటిని తినరాదు.
ఇందులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన కడుపులో గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు తీవ్రమవుతాయి. చివరగా నూనె పదార్థాలు, నెయ్యిని పెరుగులో కలుపుకుని తినరాదు. వేయించిన పదార్థాలతో పెరుగు తీసుకుంటే జీర్ణక్రియ నెమ్మదించి ఆహారం సరిగా జీర్ణం కాక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.