Curry leaves : చాలా మంది కూరలో కరివేపాకును తీసేస్తుండటం మనం చూడొచ్చు. కూరలో మాత్రమే కాదు సాంబారులో కాని ఇతర ఏదేని ఆహార పదార్థాలలో కాని కరివేపాకు ఉంటే చాలు.. అవి తీసేసిన తర్వాతనే ఆ ఫుడ్ ఐటమ్‌ను తీసుకుంటారు. ఈ క్రమంలోనే కరివేపాకు తీసేసినంత మాత్రాన ఏం కాదని అంటుంటారు. వేరే ఇతర విషయాల్లో కూడా మనుషులను కరివేపాకుల్లాగా కొందరు తీసేస్తుంటారని పేర్కొంటుంటారు. ఈ క్రమంలోనే తమను కూరలో కరివేపాలకులాగా తీసేస్తున్నారని బాధపడుతుంటారు. అయితే, కరివేపాకు వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే కనుక వారు అస్సలు ఇక కరివేపాకును బయటపడేయకుండా తమ ఆహారంలో భాగం చేసుకుంటారట. కరివేపాకు వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
కరివేపాకులతో కూరకు కాని ఉప్మాకు కాని ఇతర ఏదేని ఆహార పదార్థానికి కాని చక్కటి రుచి వస్తుంది. అయితే, కరివేపాకు వల్ల కేవలం టేస్ట్ వస్తుందనుకుంటే మీరు పొరపడినట్లే.. కరివేపాకుతో టేస్ట్‌తో పాటు ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలుంటాయి. కరివేపాకుతో బోలెడన్ని అరోగ్య ప్రయోజనాలున్నాయి. ఉదయాన్నే కొన్ని కరివేపాకుల్ని తింటే ఎంతో మంచిది. హ్యూమన్ స్కిన్, హెయిర్ హెల్దీనెస్ కోసం కరివేపాకులు బాగా పని చేస్తాయి. ఈ నేపథ్యంలోనే కరివేపాకుల్ని మార్నింగ్ టైమ్స్‌లో ఖాళీ పొట్టతో ఉన్నపుడు తీసుకుంటే చాలా మంచి ప్రయోజనాలున్నాయి.
ఇకపోతే పలు రకాల విటమిన్స్‌కు భాండాగారంగా ఉండే కరివేపాకును యాజ్ ఇట్ ఈజ్‌గా కాకుండా ఇతర రెమెడిలుగా కూడా తీసుకోవచ్చు. జుట్టు రాలిపోతున్న వారికి కరివేపాకు చాలా ఉపయోగపడుతుంది. జుట్టు రాలిపోతున్న వారు కరివేపాకును ఇలా రెమెడిగా చేసి వాడుకోవచ్చు.
Curry leaves
మార్నింగ్ నిద్ర లేవగానే వాటర్ తాగిన తర్వాత నాలుగైదు కరివేపాకుల్ని తీసుకుని కరకర నమిలేస్తే చాలా చక్కటి ప్రయోజనాలుంటాయి. ముఖ్యంగా జుట్టు రాలకుండా ఉండేందుకుగాను ఇలా చేయడం వల్ల ప్రయోజనాలుంటాయి. కరివేపాకుల్లోని విటమిన్ సి, పాస్ఫరస్, ఐరన్, కాల్షియం, నికోటినిక్ యాసిడ్ ఇతరాలు జుట్టు రాలే సమస్యలను తగ్గిస్తాయి. కరివేపాలకుతో పాటు డైజేషన్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది.
Curry leaves 1
కరివేపాకు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వికారం, వాంతులు అస్సలు రావు. కరివేపాకులు హ్యూమన్ బాడీ నుంచి అవసరం లేని వ్యర్థాలను బయటకు పంపించేస్తాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ కంట్రోల్‌లోకి వస్తాయి. కరివేపాకు తింటే కంటిచూపు మెరుగుపడుతుంది. బ్లడ్ లెవల్స్ కంట్రోల్ చేయడంలోనూ కరివేపాకులు కీ రోల్ ప్లే చేస్తాయి. హై బీపీ కంట్రోల్ చేయడంలోనూ కరివేపాకు కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ ప్రయోజనాల గురించి తెలుసుకుంటే కంపల్సరీగా అందరూ కరివేపాకులను తమ ఆహారంలో భాగం చేసుకుంటారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.