Custard Apple : సీతాఫలంలో ఉండే ఔషధాలతో ఆరోగ్యానికి ఎంతో మేలు..

Custard Apple : సీతాఫలాన్ని దాదాపుగా అందరూ ఇష్టపడుతుంటారు. సీజన్ ఫ్రూట్ అయినటువంటి ఈ ఫ్రూట్ కోసం జనాలు వేచి చూస్తుంటారు. టేస్టీ ప్లస్ హెల్దీ ఫ్రూట్ అయిన సీతాఫలం మార్కెట్‌లో అవెలయిబుల్‌గా ఉంటాయి. అయితే, అప్పట్లో చెట్ల నుంచి తీసుకొచ్చి ఇంట్లో సీతాఫలాలను పండించేవారు. కానీ, ఇప్పుడు మార్కెట్‌కు పండిన సీతాఫలాలను తీసుకొచ్చి అమ్ముతుండటం మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే శీతాకాలం సీజన్‌లో దొరికే సీతాఫలం ఈ ఫ్రూట్‌ను ప్రతీ ఒక్కరు ఎంతో ఇష్టంతో తింటుంటారు. […].

By: jyothi

Published Date - Thu - 28 October 21

Custard Apple : సీతాఫలంలో ఉండే ఔషధాలతో ఆరోగ్యానికి ఎంతో మేలు..

Custard Apple : సీతాఫలాన్ని దాదాపుగా అందరూ ఇష్టపడుతుంటారు. సీజన్ ఫ్రూట్ అయినటువంటి ఈ ఫ్రూట్ కోసం జనాలు వేచి చూస్తుంటారు. టేస్టీ ప్లస్ హెల్దీ ఫ్రూట్ అయిన సీతాఫలం మార్కెట్‌లో అవెలయిబుల్‌గా ఉంటాయి. అయితే, అప్పట్లో చెట్ల నుంచి తీసుకొచ్చి ఇంట్లో సీతాఫలాలను పండించేవారు. కానీ, ఇప్పుడు మార్కెట్‌కు పండిన సీతాఫలాలను తీసుకొచ్చి అమ్ముతుండటం మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే శీతాకాలం సీజన్‌లో దొరికే సీతాఫలం ఈ ఫ్రూట్‌ను ప్రతీ ఒక్కరు ఎంతో ఇష్టంతో తింటుంటారు. కాగా,సీతాఫలంలో ఉండే ఔషధాలు, విటమిన్స్, మినరల్స్ ఏంటో ఇవాళ తెలుసుకుందాం..

సీతాఫలం పోషకాల భాండాగారమని చెప్పొచ్చు. రుచితో పాటు ఔషధగుణాలు మెండుగా కలిగినటువంటి ఈ ఫలాన్ని ప్రతీ ఒక్కరు ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇకపోతే ఈ ఫలంలో విటమిన్ సి ప్లస్ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో జనాలందరూ విటమిన్ సి ఫ్రూట్స్‌పైన కాన్సంట్రేట్ చేస్తున్నారు. కొవిడ్ వల్ల జనంలో హెల్త్‌పై శ్రద్ధ పెరగడం మంచిదేనని, ఈ క్రమంలోనే వారు సీజనల్ ఫ్రూట్ అయినటువంటి సీతాఫలం కూడా తీసుకోవాలని వైద్య నిపుణులు అంటున్నారు.

సీతాఫలం ఔషధాలకు నెలవని పెద్దలు చెప్తుంటారు. అయితే, పూర్వం సీతాఫలాలను చెట్లపై పండిన క్రమంలోనే తీసుకునేవారని అంటుంటారు. ఇకపోతే సీతాఫలం కొన్ని డిసీజెస్‌కు మెడిసిన్‌లాగా పని చేస్తుందని కొందరు చెప్తున్నారు. సీతాఫలంలో ఉండే మెగ్నిషియం, ఇతర మినరల్స్ హ్యూమన్స్‌ను హార్ట్ డిసీజెస్ నుంచి కాపాడుతాయట.

Custard Apple

Custard Apple

 

రక్తహీనతతో బాధపడేవారికి సీతాఫలం చాలా మంచిదట. ఇందులోని విటమిన్ ఏ స్కిన్, హెయిర్ హెల్దీనెస్ కోసం సాయపడతాయి. ఈ ఫలాలను తీసుకోవడం వల్ల కళ్లకు కూడా చాలా మంచి జరుగుతుందని, కళ్లు బాగా కనబడుతాయని అంటున్నారు. అజీర్తి సమస్యలను పరిష్కరించడంలోనూ సీతాఫలం సాయం చేస్తుంది. ఈ ఫలాన్ని మీ ఆహారంలో భాగం చేసుకుంటే మలబద్ధకం నయం అయిపోతుంది. ఇందులోని పొటాషియం, మెగ్నిషియం కండరాలను బలపరచడంలో సాయం చేస్తాయి.

సీతాఫలంలో ఉండే విటమిన్ బి6, డోపమైన్, సెరోటోనిన్ న్యూరో ట్రాన్స్‌మీటర్స్ తయారీలో కీలక పాత్ర పోషిస్తాయి. సీతాఫలం తీసుకోవడం వల్ల మీ మానసిక స్థితి కూడా మెరుగవుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మెంటల్ స్టేట్‌ను బ్యాలెన్స్ చేయడంతో పాటు ఆ పరిస్థితుల నుంచి బయటపడేస్తుంది కూడా. సీతాఫలంలో ఉండేటువంటి ఎపికాటెచిన్స్, కాటెచిన్స్, ఎపిగాల్లోకాటెచిన్స్ వంటి పదార్థాలు కేన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. ఇమ్యూనిటీ పవర్‌ను ఇంక్రీజ్ చేయడంలోనూ ఈ పండు సాయం చేస్తుంది. ఈ ఫండులోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు హ్యూమన్ బాడీని బ్యాలెన్స్ చేయడంతో పాటు కడుపులోని మంటనూ తగ్గించేస్తుందట.

 

Tags

Latest News

Related News