‘షుగర్’ వ్యాధితో బాధపడేవారు శీతాకాలంలో ఈ ఫుడ్ అస్సలు తీసుకోవద్దట..

ప్రస్తుత సమాజంలో చాలా మంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. దీనికి మనం తీసుకునే ఆహారం, సరిగా నిద్రలేకపోవడం, ఒత్తిడి, డిప్రెషన్, విశ్రాంతి లేకుండా పనిచేయడం వీటిన వలన శరీరంలో రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గిపోయి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ఆస్కారం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. షుగర్ వ్యాధి ఎంతమేరకు ప్రమాదకారి.. మధుమేహం అనేది ఈ మధ్య కాలంలో చాలా మందిని తీవ్రంగా వేధిస్తున్న సమస్య. యువకుల నుంచి వయసు మీద పడిన వారు కూడా […].

By: jyothi

Published Date - Sat - 27 November 21

‘షుగర్’ వ్యాధితో బాధపడేవారు శీతాకాలంలో ఈ ఫుడ్ అస్సలు తీసుకోవద్దట..

ప్రస్తుత సమాజంలో చాలా మంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. దీనికి మనం తీసుకునే ఆహారం, సరిగా నిద్రలేకపోవడం, ఒత్తిడి, డిప్రెషన్, విశ్రాంతి లేకుండా పనిచేయడం వీటిన వలన శరీరంలో రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గిపోయి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ఆస్కారం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

షుగర్ వ్యాధి ఎంతమేరకు ప్రమాదకారి..

మధుమేహం అనేది ఈ మధ్య కాలంలో చాలా మందిని తీవ్రంగా వేధిస్తున్న సమస్య. యువకుల నుంచి వయసు మీద పడిన వారు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి.చక్కెర వ్యాధి సోకిన వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇది ఎప్పటికైనా ప్రాణాంతకంగా మారే ఆరోగ్య సమస్య. ఒక్కసారి డయాబెటిస్ అటాక్ అయ్యిందంటే లైఫ్ టైం మనం కేరింగ్‌‌గా ఉండాల్సిందే. కారణం షుగర్ వ్యాధి వలన మన రక్తంలోని చక్కెర స్థాయి క్రమంగా పెరుగడం తగ్గడం జరుగుతుంటాయి. ఇలా జరగడం మంచి కాదట.. ఆరోగ్యానికి చాలా హానికరం, ముఖ్యంగా శీతాకాలంలో మన బాడీని హీట్‌గా ఉంచుకోవడానికి ట్రై చేయాలి. లేకపోతే అది రక్తంలోని చక్కెర స్థాయిపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుందట.. చలికాలంలో మనం తీసుకునే ఆహారంపై కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. చలికాలంలో చాలా మంది అన్నం తినడం తగ్గిస్తారు. ఎందుకంటే ఎక్కువగా అన్నం తింటే రక్తంలో చక్కెర లెవర్స్ పెరుగుతాయని అంతా అనుకుంటుంటారు. అందుకే చపాతి వంటి లైట్ ఫుడ్ తీసుకుంటారు. అన్నంతోనే కాకుండా ఇతర ఆహారం వలన కూడా చక్కెర లెవల్స్ పెరుగుతాయట.. అవెంటో చూద్దాం..

షుగర్ లెవెల్స్ పెంచే ఫుడ్ ఐటమ్స్ ఇవే..

షుగర్ వ్యాధితో బాధపడే వారు శీతాకాలంలో ఈ ఫుడ్స్ అస్సలే తీసుకోరాదు. అందులో బియ్యం, ఆలుగడ్డలు, ఉప్పు, తియ్యటి మరియు శీతల పదార్థాలు, చక్కెర ఎక్కువ కలిగిన పండ్లు ఇవన్నీ రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచడం తగ్గించడం చేస్తాయి. కొందరు స్వీట్ తినడం వలన షుగర్ లెవల్స్ పెరుగుతాయని హాట్ ఐటమ్స్ తినడానికి ఇష్టపడుతారు. కానీ ఇవి కూడా ఒక్కోసారి ఆరోగ్యానికి హాని కల్గిస్తాయట.. అందుకే ప్రతీ ఫుడ్ విషయంలో కేరింగ్ చాలా అవసరం.

ముఖ్యంగా మధుమేహం వ్యాధితో బాధపడేవారు తమ బరువును క్రమంగా చెక్ చేసుకోవాలి. రక్తంలో చక్కెర లెవల్స్ హెచ్చు తగ్గుల వలన ఒకేసారి బరువు పెరగడం, తగ్గడం జరుగుతుంది. దీని వలన కూడా మనం అలర్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం, వైద్యుల సూచనల ప్రకారం డైట్ మెయింటేనే చేస్తే బెటర్..

Tags

Latest News

Related News