Figs Benefits : ఇటీవల కాలంలో ప్రతీ ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ కనబరుస్తుండటం మనం చూడొచ్చు. మరీ ముఖ్యంగా కరోనా కాలం నుంచి ప్రజల్లో హెల్త్ కాన్షియస్‌నెస్ బాగా పెరిగింది. కొవిడ్ పుణ్యమాని జనం అందరూ కూడా తాజా కూరగాయలతో పాటు ఫ్రూట్సీ తీసుకుంటున్నారు. కాగా ప్రజలు తీసుకోవాల్సిన ముఖ్యమైన ఫ్రూట్ అంజీర అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వెయిట్ లాస్ కావాలనుకునే వారు తప్పకుండా అంజీరలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Figs1
అంజీరలు ప్రతీ రోజు నాలుగు లేదా ఐదుకు మించి తినొద్దని, ఆ లోపల తింటే కనుక చక్కటి ప్రయోజనాలుంటాయని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. అయితే, ఆరోగ్యానికి మంచిది అని చెప్పి అంజీరలను ఎక్కువ మొత్తంలో తినొద్దట.హ్యూమన్ బాడీకి అవసరమయ్యే పొటాషియం, సోడియం మినరల్స్ అంజీర అందజేస్తుంది. వీటిని తీసుకోవడం వలన బీపీ కంట్రోల్ అవుతుంది. దాంతో పాటు ఫిగ్స్‌లోని మినరల్స్ బాడీని యాక్టివ్‌గా ఉంచుతాయి. ఇక పైల్స్ సమస్య ఉన్న వాళ్లు రాత్రి పూట అంతా నానబెట్టిన డ్రై అంజీరలను వాటర్‌తో కలిపి తీసుకుంటే చక్కటి ప్రయోజనాలుంటాయి.
అంజీరలను క్రమం తప్పకుండా తీసుకుంటే కనుక పైల్స్ సమస్య పరార్ అవుతుందట. పైల్స్ సమస్య ఉన్న వారు దానిని తగ్గించుకునేందుకుగాను రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వారు ఒకసారి అంజీరను వాడితే కనుక చక్కటి ప్రయోజనాలుంటాయి.
Figs
ఇటీవల కాలంలో చాలా మందిలో సంతాన లేమి పెరిగిపోతున్నది. ఇందుకు ప్రధాన కారణం మారుతున్న జీవనశైలి.. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు చేంజ్ అవడం, పోషకాలు సరిగా దొరకకపోవడం వల్ల సంతాన లేమితో చాలా మంది బాఢపడుతున్నారు. కాగా లైంగిక సమస్యలు పరిష్కరించడంతో పాటు సంతాన భాగ్యం కలుగజేసేందుకుగాను అంజీరలు అత్యద్భుతంగా పని చేస్తాయి. పురుషులలో వీర్యాన్ని వృద్ధి చేసేందుకు అంజీరలు బాగా తోడ్పడుతాయి. పురుషులు రాత్రి పూట నానబెట్టిన రెండు లేదా మూడు అంజీరలను తెల్లారిన తర్వాత తీసుకుంటే కనుక చక్కటి ప్రయోజనాలుంటాయట.
ఫిగ్స్‌లోని పొటాషియం, మెగ్నిషియం మినరల్స్‌తో పాటు కాల్షియం మినరల్ కూడా హ్యూమన్స్‌కు చాలా కావాల్సినవి. ఇందులోని కాల్షియం వల్ల హ్యూమన్ బాడీ స్ట్రాంగ్ అవడంతో పాటు బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి. తద్వారా అస్థియోపోరోసిన్ అనేటువంటి బోన్స్‌ను వీక్ చేసే డిసీజ్ ఇక మీ దరిచేరదు. ఆస్తమా ఉన్న వారు అంజీరలు ఔషధంగా పని చేస్తాయి. ఇందులోని పోషకాలు ఆస్తమా సమస్యను తగ్గించేస్తాయి. అంజీరలు మతిమరుపు, అల్జీమర్స్ లక్షణాలను కూడా తగ్గిస్తాయి. అంజీరను తీసుకుంటే చాలు మలబద్ధకం సమస్య ఇట్టే పరిష్కారమవుతుందట. మలబద్ధకం సమస్యలను నయం చేయడంలో అంజీర కీలక పాత్ర పోషిస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది.