Foods to Increase Height: ఎత్తుగా ఉన్నవారే ఏదైనా సాధించగలరని హైట్ తక్కువగా ఉన్నవారు అనుకుంటుంటారు. కానీ, అలాంటిది ఏం ఉండదని ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న వారు హైట్ తక్కువగా ఉన్నప్పటికీ అనుకున్న లక్ష్యం సాధించొచ్చని మోటివేషనల్ స్పీకర్స్, గురువులు చెప్తుంటారు. అయితే, ఎత్తు అనేది లక్ష్యసాధనలో అడ్డంకే కాదని ఎంత చెప్పినప్పటికీ యూత్ మాత్రం హైట్‌గా ఉండాలనే అనుకుంటారు. ఈ క్రమంలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే హైట్ త్వరగా పెరుగుతారు? అనే విషయాలు ఈ స్టోరీ చదివి తెలుసుకోండి..లెట్స్ గో..
ఎత్తు అనేది జనరల్‌గా వ్యక్తి డిసైడ్ చేసేది కాదు. అది తమ పూర్వీకులు, కుటుంబీకుల నుంచి వంశపారంపర్యంగా వచ్చేది. అయితే, కొంత మేరకు రకరకాల ఎక్సర్‌సైజెస్, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఎత్తు పెరగొచ్చు. కానీ, సాధారణంగా అయితే ఎత్తు అనేది వంశపారంపర్యమైనదే. ఎదిగే వయసులో ఉన్నపుడు తీసుకునే జాగ్రత్తలతో హైట్‌ను పెంచుకోవచ్చు. తీసుకునే ఆహారం, నిద్ర విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అవి ఫిజికల్ హ్యూమన్ బాడీ షేప్‌ను నిర్ధారిస్తాయి. ఎత్తు పెరగడానికి ముఖ్యంగా కావాల్సింది ఎముకల ఆరోగ్యం. దాని కోసం బలసంవర్ధకమైన ఆహారం తీసుకోవాలి.
విటమిన్లు, మినరల్స్ సంవృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను నిత్యం తమ దినచర్యలో భాగం చేసుకోవాలి. తీసుకునే ఆహారంలో విటమిన్-డి సరైన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. కాల్షియం, ఇతర ప్రోటీన్లు కూడా చాలా అవసరం. కాల్షియం, ఇతర ప్రోటీన్లు బోన్స్ హెల్దీనెస్ పెంచడంతో పాటు అవి సాగేలా, పొడవు పెరిగేలా చేస్తాయి. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలైన బాదం, ఆక్రోట్, పిస్తా, చేపలు, పాలు, పెరుగు, కోడిగుడ్లు, మాంసం, పప్పుధాన్యాలు లాంటి గింజలు క్రమం తప్పకుండా తీసుకోవచ్చు.
ఇక ఆకుకూరల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతీ ఒక్కరు చిన్న నుంచి మొదలుకుని పెద్దవారి వరకు అందరూ ఆకుకూరలు ఏ సమయంలోనైనా తీసుకోవాలి. ఎదిగే వయసులో ఉన్నవారితో ఇంకా మస్ట్. ఎందుకంటే ఇందులోని కాల్షియం ఎముకలను స్ట్రాంగ్ చేయడంతో పాటు సాగే గుణాలను పెంపొదిస్తుంది. ఆకుకూరలతో పాటు పెరుగు, పాలు, పన్నీర్ ఇతర ఫుడ్ ఐటమ్స్‌లోనూ కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. అవి తీసుకోవడం ద్వారా ఆటోమేటిక్‌గా బాడీ ప్లస్ బోన్స్ హెల్తీగా అవుతాయి.
నేచురల్‌గా లభించే డి-విటమిన్ కోసం ప్రతీ రోజు పొద్దటి పూట 30 నిమిషాల పాటు ఎండలో నిల్చోవాలి. ఇది ఒక అలవాటుగా మార్చుకోవాలి. రోజు కనీసం లీటరు లేదా అరలీటరైనా పాలు, పాలపదార్థాలు తీసుకోవాలి. తద్వారా శరీరానికి కావాల్సినంత స్థాయిలో సరిపడా కాల్షియం లభిస్తుంది. కనీసం రెండు వేల కేలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. అలా చేయడం వల్ల మీరు హైట్ ప్లస్ వెయిట్ కూడా గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. ఓన్లీ హైట్ గెయిన్ చేసిన తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంటుంది. కాబట్టి హైట్ ప్లస్ వెయిట్ రెండిటినీ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరముంది.
ఇకపోతే నేటి తరంలో దాదాపు అందరూ ఓన్లీ ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అవుతున్నారు. ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం ప్రయత్నించే వారు చాలా తక్కువ మందే. ఆహారం పట్ల శ్రద్ధ వహిస్తూనే ఫిట్‌నెస్‌కు కూడా ప్రయత్నించాలి. అలా చేయడం హైట్ పెరగాలనుకునే వారికి చాలా ఉపయోగకరం. ప్రతీ రోజు అరగంట లేదా కనీసంగా ఇరవై నిమిషాల పాటు వేగంగా పరిగెత్తడం, నడవడం చేయాలి. తద్వారా కాళ్ల కండరాలు యాక్టివ్‌గా అయితాయి. రోజూ ఏదైనా ఒక ఆట కొద్దిసేపు ఆడటం దినచర్యలో భాగమైతే ఇంకా మంచిది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది నిద్ర. నిద్రభంగం చేసుకునే వారు హైట్ పెరిగే అవకాశాలు తక్కువేనట. ప్రతీ రోజు రాత్రి కనీసం ఎనిమిది గంటలపాటు తప్పనిసరిగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.