Headache : ఒకప్పటితో పోల్చితే మారిన జీవనశైలి, పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది అతి తక్కువ ఏజ్‌లోనే రకరకాల డిసీజెస్ బారిన పడుతుండటం మనం చూడొచ్చు. ఈ క్రమంలోనే పిల్లలు సైతం వ్యాధుల బారిన పడుతున్నారు. కాబట్టి పెద్దలు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. వారికి అనారోగ్య సమస్యలు తలెత్తక మునుపే వారికి హెల్దీ ఫుడ్ అందించాలి.
ఇకపోతే కొంత మంది పిల్లలు తరచూ తల నొప్పి సమస్యతో బాధపడుతున్నట్లు చెప్తుంటారు. పని ఒత్తిడి వల్లనో లేదా ఇంకేదో కారణం చేతనో ఒకటే రోజు అలా తలనొప్పి వచ్చిందని మీరు వదిలేస్తే ప్రమాదం పొంచినట్లే.. పిల్లల్లో తరుచూ హెడేక్ వస్తుందని తెలిస్తే వెంటనే దానిని పరిశీలించారు. లేదంటే అది తీవ్రమైన డిసీజ్‌గా మారే చాన్సెస్ మెండుగా ఉంటాయి.
చాలా మంది జనరల్‌గా హెడేక్ అనగానే అలాగే వదిలేస్తుంటారు. కానీ, హెడేక్ ఇష్యూను అలాగే వదిలేస్తే కనుక అది ఇంకా తీవ్రమయ్యే చాన్సెస్ ఉంటాయి. 5 నుంచి 17 ఏళ్ల పిల్లల్లో ఇటువంటి హెడేక్ ఇష్యూస్ మనం పరిశీలించొచ్చు. అయితే, ఇటువంటి ఇష్యూస్ వచ్చినపుడు మనం వాటిని అస్సలు వదిలేయొద్దు. ఒక్కోసారి ఇది తీవ్రమైన లక్షణంగా మారవచ్చు.
Head ache children final
జనరల్‌గా ఫిజికల్ పెయిన్ లాగా ఏదేని చిన్న దెబ్బ తాకినపుడు వచ్చే తల నొప్పి తొందరగానే క్యూర్ అవుతుంది. కానీ, మరో తలనొప్పి అలాంటిది కాదు. ఈ హెడేక్ ఒక్కసారి వచ్చిందంటే చాలు.. అలానే ఉండిపోతుంది. అయితే, తనకు విపరీతమైన తలనొప్పి వస్తుందన్న విషయాన్ని పిల్లలు వ్యక్తపరచలేకపోవచ్చు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లల విషయంలో ఓ పక్క గమనిస్తూనే ఉండాలి. వారి ఆరోగ్యం ఎలా ఉంటున్నది.. తల నొప్పి ఉందా అని అడుగుతుండాలి.
తీసుకునే ఫుడ్‌తోనూ హెడేక్ వస్తుంటుంది.
children headache 2
మారిన జీవన శైలితో హెల్త్‌కు ఇబ్బందులు చేకూర్చే ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా విపరీతమైన హెడేక్ వచ్చే చాన్సెస్ ఉంటాయి. ఇకపోతే ప్రతీ రోజు తల్లి దండ్రులు తమ పిల్లలతో కంపల్సరీగా కొంత టైం స్పెండ్ చేయాలి. అలా చేస్తేనే పిల్లలు హ్యాపీగా ఉంటారు. పిల్లలు తగు సమయం రెస్ట్ తీసుకునేలా చూడాలి.
children 1
నిద్ర లేకపోతే వారి మానసిక ఆరోగ్యం దెబ్బతినే చాన్సెస్ ఉంటాయి. కాబట్టి వారు కంపల్సరీగా తగు టైం నిద్రపోయేలా చూడాలి. ఇలా చేయడం ద్వారా పిల్లల మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఒకవేళ పిల్లల తలనొప్పి సమస్య కనుక అలానే కొనసాగినట్లయితే వెంటనే డాక్టర్ వద్దకు పిల్లలను తీసుకెళ్లాల్సి ఉంటుంది. సైకియాట్రిక్ నిపుణులను సంప్రదించి పిల్లల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి.