Almonds: పిల్లలు పెద్దల్లో ప్రతి రోజు నానబెట్టిన బాదం వల్ల కలిగే ప్రయోజనాలు

Almonds రాత్రి సమయంలో నానబెట్టిన బాదంను ఉదయం పొట్టు తీసి తింటే చాలా ప్రయోజనాలు ఉంటాయని అందరికి తెలుసు. కాని ఆ ప్రయోజనాలు ఏంటీ అనేది కొద్ది మందికి మాత్రమే తెలుసు. బాదంను ఎలా తింటే ఏం ప్రయోజనాలు అనే విషయాలు చాలా వరకు తెలియవు. తెలిసిన వారు అతి కొద్ది మందే ఉంటారు. కనుక బాదాంల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. బాదాంను నానబెట్టడం వల్ల పోషకాలు పెరుగుతాయి. కేవలం బాదాం అనే కాకుండా […].

By: jyothi

Published Date - Tue - 3 August 21

Almonds: పిల్లలు పెద్దల్లో ప్రతి రోజు నానబెట్టిన బాదం వల్ల కలిగే ప్రయోజనాలు

Almonds రాత్రి సమయంలో నానబెట్టిన బాదంను ఉదయం పొట్టు తీసి తింటే చాలా ప్రయోజనాలు ఉంటాయని అందరికి తెలుసు. కాని ఆ ప్రయోజనాలు ఏంటీ అనేది కొద్ది మందికి మాత్రమే తెలుసు. బాదంను ఎలా తింటే ఏం ప్రయోజనాలు అనే విషయాలు చాలా వరకు తెలియవు. తెలిసిన వారు అతి కొద్ది మందే ఉంటారు. కనుక బాదాంల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. బాదాంను నానబెట్టడం వల్ల పోషకాలు పెరుగుతాయి. కేవలం బాదాం అనే కాకుండా ఏ విత్తనం అయినా కూడా నానబెట్టి మెలకలతో నింటే పోషకాలు మరియు విటమిన్‌ లు అధికంగా వస్తాయి. మొలకలు ఆరోగ్యానికి ఎంతగా ఉపయోగదాయకమో అందరికి తెల్సిందే. అలాగే బాదాంను కనీసం 12 నుండి 15 గంటల పాటు నాన్చబెట్టి ఆ తర్వాత తింటూ ఉంటే రుచితో పాటు లెక్కకు మించి పోషకాలను పొందవచ్చు. ప్రతి రోజు పిల్లలు మరియు పెద్దలు బాదాం తింటే చాలా మంచింది. మొదట పిల్లలో కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు చూద్దాం. ప్రతి రోజు పిల్లలు మూడు నుండి అయిదు బాదాం లు తినడం వల్ల మెమోరీ పవర్‌ ఎక్కువ అవుతుంది.

మెదడుపై బాదాంలు పని చేస్తాయని నిపూపితం అయ్యింది. బ్రెయిన్‌ ను యాక్టివ్‌ గా ఉంచేందుకు బాదాంను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా బాదాం తినడం వల్ల ఇమ్యూనిటీని గెయిన్‌ చేసుకోవచ్చు. చిన్న పిల్లలకు బాదాం పొడిని చెక్కెరతో కలిపి ఇవ్వడం వల్ల గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో పెరుగుదల నుండి మొదలుకుని బ్రెయిన్‌ చురుకుగా పని చేసే వరకు అనేక రకాల ప్రయోజనాలను బాదాం ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు రెగ్యులర్‌గా బాదాం తింటే కలిగే ప్రయోజనాలు అంతర్జాతీయ స్థాయి నిపుణులు సైతం గుర్తించారు. బాదాంను రెగ్యులర్‌ గా తినే పిల్లలు మరియు బాదాం అలవాటు లేని పిల్లలను పోల్చితే మార్పు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక పెద్దలు కూడా రెగ్యులర్‌ గా బాదాంను తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్‌ పెరుగుతుంది.

మగవారిలో శృంగార సామర్థ్యం పెరుగుదలతో పాటు ఆడవారిలో సంతానంకు సంబంధించిన ప్రయోజనాలు దక్కుతాయి. బాదాంను తినడం వల్ల ఇమ్యూనిటీ పెద్ద వారిలో కూడా పెరుగుతుంది. ప్రతి ఒక్కరు బాదాం తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి. బాదాం వల్ల కలిగే ప్రయోజనాలు మరోది కూడ ఇవ్వలేదు. రక్త సంబంధిత సమస్యల నుండి మొదలుకుని గుండె నొప్పి వచ్చి చావు అంచుల వరకు వెళ్లే వారి వరకు కూడా బాదాం వల్ల ప్రయోజనాలే దక్కుతాయి అంటూ నిపుణులు చెబుతున్నారు. పిల్లలు మరియు పెద్దలు ప్రతి రోజు బాదాంను తినడం వల్ల మానసిక సమస్యలు తొలగి పోవడమే కాకుండా ఆరోగ్యం కూడా దక్కుతుందని నిపుణులు చెబుతున్నారు. కరోనా వంటి వైరస్‌ లను ఎదుర్కోవాలంటే ప్రతి రోజు బాదాంలను తీసుకుని ఇమ్యూనిటీ పెంచుకోవాలంటూ సూచిస్తున్నారు. ప్రభుత్వాలు ఇస్తున్న ప్రత్యేకమైన కిట్స్ లో ఈ బాదాంలు ఉంటున్నాయి అంటే బాదాం యొక్క ప్రాముఖ్యత ను అర్థం చేసుకోవచ్చు.

Related News