Apple-Lemon ప్రతి రోజు యాపిల్ తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అయ్యి డాక్టర్ కు దూరంగా ఉండవచ్చు అంటారు. యాపిల్ తింటే డాక్టర్ కు దూరంగా ఉండవచ్చు అనేది ఎంత నిజమో లెమన్ జ్యూస్ వల్ల కూడా అంతకు మించిన ప్రయోజనాలు ఉన్నాయి అనడంలో అంతే నిజం. శరీరం అనారోగ్యం బారిన పడకుండా యాపిల్ ఉపయోగపడితే.. లెమన్ జ్యూస్ మాత్రం శరీరంలో చేరిన వ్యర్థాలను తొలగించేందుకు ఉపయోగపడతాయి. శరీరంలో ఉండే వ్యర్థాల వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. తద్వారా చాలా మంది చాలా రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యండా మెటబాలిజం దెబ్బ తిన్న వారు ప్రతి రోజు ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకుని కాస్త తేనె లేదా ఉప్పును వేసుకుని గంట వ్యవధిలో లీటరు నుండి రెండు లీటర్ల వరకు తాగితే మెటబాలిజం బాగా పని చేస్తుంది.
ఈమద్య కాలంలో చాలా మంది సరైన తిండి సమయానికి తినక పోవడం వల్ల గ్యాస్ సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. గ్యాస్ సమస్యలు కాస్త ఎక్కువ అయితే తీవ్రమైన సమస్యలుగా మారే అవకాశం ఉంది. అందుకే ముందుగానే గ్యాస్ సమస్యకు చెక్ పెట్టే విధంగా ప్రతి ఒక్కరు కూడా సాధ్యం అయినంత వరకు ప్రతి రోజు ఒక్కసారి అయినా నిమ్మ జ్యూస్ తాగాలని నిపుణులు చెబుతున్నారు. మలబద్దకం మరియు అజీర్తి వంటి సమస్యలు ఎదురయినప్పుడు లెమన్ జ్యూస్ బాగా పని చేస్తుంది. నిమ్మకాయ అనేది జీర్ణ వ్యవస్థ బాగా పని చేసేందుకు ఉపయోగపడుతుందని నిరూపితం అయ్యింది. గ్యాస్ అసిడిటీ మరియు కడుపులో మంటతో పాటు ఇతర సమస్యలకు చెక్ పెట్టినట్లు అవుతుంది. సమ్మర్ లో బాడీ డీ హైడ్రేషన్ అవ్వకుండా కాపాడటంలో నిమ్మకాయ ముందు ఉంటుంది.
నిమ్మకాయలో ఉండే విటమిన్ సి వల్ల పలు ప్రయోజనాలు ఉంటాయి. నిమ్మకాయ జ్యూస్ ను తాగడం వల్ల పళ్లలో ఉండే క్రిములు తొలగి పోవడంతో పాటు నోటి యొక్క చెడు వాసన కూడా పోతుంది. పళ్ల నుండి పడుపు వరకు అన్ని శుభ్రం చేయడం లో నిమ్మకాయ ఎంతగా పని చేస్తుందో ఇప్పటి వరకు చర్చించుకున్నాం కదా.. ఇప్పుడు నిమ్మ కాయను ఏ విధంగా తీసుకోవడం వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. నిమ్మకాయ అంటే వెంటనే ప్రతి ఒక్కరు కూడా లెమన్ జ్యూస్ గుర్తుకు వస్తుంది. కొందరు దీనిని షర్బత్ అని కూడా అంటారు. వేడి చేసినప్పుడు చేసుకునే షర్బత్ లో చక్కర మరియు ఉప్పు కలిపి వేయాలి. అందులో తేనె అవసరం లేదు. కాని పరిగడుపున నిమ్మ జ్యూస్ తాగాలనుకున్న వారు గోరు వెచ్చటి నీటిని తీసుకుని టీ స్ఫూన్ నిమ్మ రసంను పిండి ఆ తర్వాత కాస్త తేనె చుక్కలు వేయాలి. ఆ నీటిని తాగడం వల్ల మలబద్దకంతో పాటు పలు అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.
ఇక నిమ్మకాయ ను బాగా ఎండబెట్టి పొడిలా తయారు చేసి దాన్ని గోరు వెచ్చని నీటిలో కలిపి క్రీమ్ లా తయారు చేసుకుని జుట్టుకు పెట్టి కనీసం రెండు నుండి మూడు గంటలు ఉంచి ఆ తర్వాత చల్లటి నీటితో కడగడం తో జుట్టుకు నిగారింపు వస్తుంది. అలాగే చుండ్రు కూడా పోయి జుట్టు బలంగా కూడా తయారు అవుతుంది. అందుకే నిమ్మకాయ ను అనేక రకాలుగా ఉపయోగించుకుని అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు.. అలాగే అనారోగ్యం పాలు అవ్వకుండా కూడా ఉండవచ్చు.