Health : గసగసాల ఘాటు.. సరసాలకు చేటు..

Health : ఏదైనా ఒక లిమిట్ వరకే. అది దాటితే వెగటే. చేటే. గసగసాలు దీనికొక ఉదాహణ. వంటింట్లో గసగసాల ఘాటు ఎక్కువైతే అది పడకింట్లో ప్రభావం చూపుతుంది. ఆలూమగల మధ్య సరసాల పైన వేటు వేస్తుంది. గసగసాల వల్ల కూరలకు రుచి, కమ్మదనం వస్తాయి. అలాగే ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలున్నాయి. అలా అని చెప్పి పరిమితికి మించి వాడితే పురుషుల లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. తద్వారా తీరని నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. గతంలో మందుగా.. గసగసాలను […].

By: jyothi

Updated On - Mon - 19 April 21

Health : గసగసాల ఘాటు.. సరసాలకు చేటు..

Health : ఏదైనా ఒక లిమిట్ వరకే. అది దాటితే వెగటే. చేటే. గసగసాలు దీనికొక ఉదాహణ. వంటింట్లో గసగసాల ఘాటు ఎక్కువైతే అది పడకింట్లో ప్రభావం చూపుతుంది. ఆలూమగల మధ్య సరసాల పైన వేటు వేస్తుంది. గసగసాల వల్ల కూరలకు రుచి, కమ్మదనం వస్తాయి. అలాగే ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలున్నాయి. అలా అని చెప్పి పరిమితికి మించి వాడితే పురుషుల లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. తద్వారా తీరని నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది.

గతంలో మందుగా..

గసగసాలను గతంలో ఆయుర్వేద మందుగా వాడేవారు. ఇతర సుగంధ ద్రవ్యాల మాదిరిగానే ఇవి కూడా మనిషి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా అడ్డుకోగలవు. గసగసాల్లో ఉండే ఆక్సలేట్లు మనం తినే ఆహార పదార్థాల్లోని కాల్షియాన్ని గ్రహించి కిడ్నీల్లో రాళ్లు రాకుండా చేస్తాయి. గసగసాల్లో పీచు పదార్థం పరిమాణం ఎక్కువ. కాబట్టి తిన్నది త్వరగా జీర్ణమవుతుంది. పేగులు తేలిగ్గా కదలటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫలితంగా వ్యర్థాల విసర్జనలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా అయ్యేలా చూస్తుంది.

Health : plus and minus points of Poppy Seeds

Health : plus and minus points of Poppy Seeds

మంచి నిద్ర: Health

వివిధ కారణాల వల్ల మనకు అప్పుడప్పుడూ సరిగా నిద్రపట్టదు. అలాంటి సందర్భాల్లో పడుకునే ముందు గసగసాల పేస్ట్ ని వేడి పాలల్లో కలుపుకొని తాగితే సమస్య పరిష్కారమవుతుంది. కంటి నిండా నిద్రపోవచ్చు. అలాగే శ్వాస ఇబ్బందులకు కూడా గసగసాలతో చెక్ పెట్టొచ్చు. దగ్గు, ఆస్తమా తలెత్తవు. గుండె సంబంధ అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు రోజుకి రెండు పూటలు (ఉదయం, సాయంత్రం) అర చెంచా గసగసాలను వాడాలి. గసగసాలు తింటే ఒంటికి చలవ. కడుపులో మంట, గ్యాస్ ప్రాబ్లంతో బాధపడేవాళ్లు వీటిని వాడితే ఉపశమనం కలుగుతుంది.

కంట్రోల్.. కంట్రోల్..

గసగసాలు పేగుల్లోని అల్సర్లను, పుండ్లను సైతం తగ్గిస్తాయి. ఇలా చెప్పుకుంటూపోతే వీటి వల్ల లేని లాభం అంటూ లేదు. అయితే.. గసగసాలు ప్రయోజనకరం కదా అని మోతాదుకి మించి వాడితే సీన్ రివర్స్ అవుతుంది. మగాళ్లలో పురుష బీజ కణాల సంఖ్య తగ్గిపోతుంది. లైంగిక సామర్థ్యం దెబ్బతింటుంది. కాబట్టి గసగసాల వినియోగాన్ని కంట్రోల్ చేసుకోవటం కూడా ముఖ్యమే. ఏదైనా అతి పనికిరాదు కదా.

Latest News

Related News