Health Tips : నెలసరి టైంలో నొప్పులా…? అయితే వీటితో చెక్ పెట్టండి..

Health Tips : పిరియడ్ టైంలో లేడీస్ పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇందులో నొప్పులు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. దీని వల్ల వారు మానసికంగా, శారీరకంగా ఎంతో ఇబ్బంది ఎదుర్కొంటారు. పొత్తి కడుపులో తిమ్మిర్లు, వికారం, నొప్పి వంటివి రావడం వీటితో తోడు నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. వీటి నుంచి రిలీఫ్ పొందేందుకు చాలా రకాల మెడిసన్స్ ట్రై చేస్తుంటారు. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే చాన్స్ ఉంది. […].

By: jyothi

Published Date - Wed - 1 December 21

Health Tips : నెలసరి టైంలో నొప్పులా…? అయితే వీటితో చెక్ పెట్టండి..

Health Tips : పిరియడ్ టైంలో లేడీస్ పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇందులో నొప్పులు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. దీని వల్ల వారు మానసికంగా, శారీరకంగా ఎంతో ఇబ్బంది ఎదుర్కొంటారు. పొత్తి కడుపులో తిమ్మిర్లు, వికారం, నొప్పి వంటివి రావడం వీటితో తోడు నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. వీటి నుంచి రిలీఫ్ పొందేందుకు చాలా రకాల మెడిసన్స్ ట్రై చేస్తుంటారు. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే చాన్స్ ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఇంటి చిట్కాలను మాత్రమే ఎక్కువగా పాటించాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


health tips

health tips



నెలసరి టైంలో గోరు వెచ్చని హెర్బల్‌ టీలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దీని వల్ల తిమ్మిర్లు, నొప్పుల నుంచి రిలీఫ్ లభిస్తుంది. అల్లం, నల్లమిరియాల టీ, గ్రీన్‌ టీ, లెమన్ టీ వంటివి తాగితే బాగుంటుంది. గోరు వెచ్చని నీటితో నింపిన బాటిల్ లేదా హాట్ జెల్‌బ్యాగ్ ను ఉపయోగించి నొప్పులను తగ్గించుకోవచ్చు. చాలా మంది లేడీస్ ఈ పద్దతినే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే ఎక్కువమంది మహిళలు ఈ పద్ధతినే ఉపయోగిస్తారు. ఎండలో కూర్చున్నప్పుడు విటమిన్ డి లభిస్తుంది. పిరియడ్ టైంలో వచ్చే నొప్పులు, తిమ్మిర్లకు కారణమయ్యే.. ప్రొస్టాగ్లాండిన్ ఉత్పత్తిని ఇది తగ్గించడంలో ఉపయోగపడుతుంది. కావున.. పిరియడ్ టైంలో మార్నింగ్ 15 నిమిషాల పాటు ఎండలో ఉండటం మంచింది.


health tips

health tips



ఎక్కువ నీరు తాగడం వల్ల కడుపు ఉబ్బరం, వికారం వంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఎక్సర్‌సైజులు, యోగా వల్ల శరీరంలో ఎండార్ఫిన్ల స్థాయి పెరుగుతుంది. ప్రోస్టాగ్లాండిన్‌ ఉత్పత్తిని తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. శవాసనలాగా ఈజీగా ఉండే ఆసనాలను వేయడం వల్ల నొప్పులు దూరమవడంతో పాటు బాడీకి రిలాక్స్ లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు సైతం కొంత దూరమవుతాయి. అప్పుడప్పుడు లెమన్ టీ, అల్లం టీ వంటివి తాగడం వల్ల నొప్పులకు తగ్గించడంతో పాటు శరీరానికి కావల్సిన ఎనర్జీ లభిస్తుంది. కానీ చాలా మంది వికారంగా అనిపించినప్పుడు ఇలాంటివి తాగడానికి ఇష్టపడరు. పైన చెప్పిన చిట్కాలను ఓ సారి పాటించి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది. దీనికి తోడు ఎక్సర్ సైజులు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. యోగా చేసేటప్పుడు సైతం కేవలం తేలికైన ఆసనాలు మాత్రమే వేయాలి లేదంటే ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇలాంటి టైంలో మీకు ఇబ్బంది ఎక్కువగా అనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించడం ఉత్తమం.

Tags

Latest News

Related News