• Telugu News
  • health

Healthy Food : ఈ ఆహారపదార్థాలతో విటమిన్ బి 12 లోపం ఉండదిక..

Healthy Food : మనిషిని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించేది రక్తం. కాగా, చాలా మంది రక్తకణాల సమస్యలతో బాధపడుతుండటం మనం చూడొచ్చు. ఇందుకు రకరకాల కారణాలున్నాయి. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు కంప్లీట్‌గా మారిపోవడం వలన రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చిన్న వయసులోనే చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ముఖ్యంగా హ్యూమన్ బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ క్రియేట్ కావడంలో విటమిన్ బి 12 పాత్ర కీలకం. కాగా, ఆ […].

By: jyothi

Updated On - Thu - 18 November 21

Healthy Food : ఈ ఆహారపదార్థాలతో విటమిన్ బి 12 లోపం ఉండదిక..

Healthy Food : మనిషిని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించేది రక్తం. కాగా, చాలా మంది రక్తకణాల సమస్యలతో బాధపడుతుండటం మనం చూడొచ్చు. ఇందుకు రకరకాల కారణాలున్నాయి. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు కంప్లీట్‌గా మారిపోవడం వలన రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చిన్న వయసులోనే చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు.


ముఖ్యంగా హ్యూమన్ బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ క్రియేట్ కావడంలో విటమిన్ బి 12 పాత్ర కీలకం. కాగా, ఆ విటమిన్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ విటమిన్ పెంచుకునేందుకుగాను ఎటువంటి ఆహార పదార్థాలను తమ ఆహారంలో భాగం చేసుకోవాలనే విషయాలను గురించి తెలుసుకుందాం.


హ్యూమన్ బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ ఏర్పడటంలో విటమిన్ బి 12 కీ రోల్ ప్లే చేస్తోంది. విటమిన్ బి 12 లోపం వలన మెంటల్ ఇష్యూస్‌తో పాటు కీళ్ల నొప్పులు, బోన్స్ ఇష్యూస్ వస్తుంటారు. ఈ క్రమంలోనే రక్తహీనత ఏర్పడుతుంటుంది. కాగా, మనిషి లోపల ఈ విటమిన్ పెంచేందుకుగాను ఈ ఆహారపదార్థాలను కంపల్సరీగా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఆ ఆహార పదార్థాలు ఏమిటేమిటంటే..

chicken

chicken

ఎగ్స్.. ప్రతీ రోజు ఎగ్స్ తీసుకోవడం వలన విటమిన్ బి 12 లోపం సరిచేయబడుతుంది. ఎగ్స్ వలన చాలా ప్రయోజనాలున్నాయి. విటమిన్స్ భాండాగారమైన గుడ్డును ప్రతీ రోజు ఒకటి తీసుకుంటుండాలి. ప్రతీ రోజు ఒక బాయిల్డ్ ఎగ్‌తో పాటు భోజనం తీసుకోవాలి.

eggs boiled

eggs boiled

అలా తీసుకోవడం వలన శరీరంలో పోషకాలు పెరగడంతో పాటు కావాల్సిన విటమిన్ బి 12 కూడా లభిస్తుంది. ఇకపోతే శాకాహారులు అత్యంత ఇష్టంగా తినేటువంటి పన్నీర్‌లోనూ విటమిన్ బి 12 పుష్కలంగా ఉంటుంది. ఏదేని ఆహార పదార్థంలో పన్నీరు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అయితే, పన్నీరును తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు తెలిసిన వారయితే తప్పకుండా దానని తమ ఆహారంలో భాగం చేసుకుంటారు. మజ్జిగ, చేప, చికెన్ లోనూ విటమిన్ బి 12 సమృద్ధిగా ఉంటుంది.

Fish healthy food

Fish healthy food

డైజేషన్ సిస్టమ్‌ను స్ట్రాంగ్ చేసేటువంటి మజ్జిగను ప్రతీ ఒక్కరు తమ ఆహారంలో భాగం చేసుకోవాలని పెద్దలు చెప్తుంటారు కూడా. ఇకపోతే చేపలు తీసుకోవడం వలన కంటికి లాభం జరుగుతుందని చాలా మందికి తెలుసు. ఈ క్రమంలోనే చేపల్లో విటమిన్ బి 12 కూడా ఉంటుంది. చికెన్‌లో ఉండేటువంటి లీన్ ప్రోటీన్స్ వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. విటమిన్ బి 12 కూడా కావాల్సినంత లభిస్తుంది.

Tags

Latest News

Related News