Healthy Juice : కంటిచూపును మెరుగు ప‌రిచే పాలకూర జ్యూస్.. ఇంకా ఎన్ని లాభాలు ఉన్నాయంటే..

Healthy Juice : ఆకుకూరలు అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది పాలకూర. ఇందులో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే ఆకుకూరల్లో ఇది ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. అయితే చాలా మంది పాలకూరను వండుకుని చేసుకుని తింటుంటారు. కానీ దీనిని జ్యూస్ చేసుకుని తాగడం వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. ఇందులో విటమిన్స్ ఎ, ఇ, సి, బి కాంప్లెక్స్, కెరోటిన్, పొటాషియం.. మెగ్నీషియం.. వంటివి ఎక్కువగా ఉంటాయి. ఈ జ్యూస్ […].

By: jyothi

Published Date - Mon - 6 December 21

Healthy Juice : కంటిచూపును మెరుగు ప‌రిచే పాలకూర జ్యూస్.. ఇంకా ఎన్ని లాభాలు ఉన్నాయంటే..

Healthy Juice : ఆకుకూరలు అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది పాలకూర. ఇందులో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే ఆకుకూరల్లో ఇది ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. అయితే చాలా మంది పాలకూరను వండుకుని చేసుకుని తింటుంటారు. కానీ దీనిని జ్యూస్ చేసుకుని తాగడం వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. ఇందులో విటమిన్స్ ఎ, ఇ, సి, బి కాంప్లెక్స్, కెరోటిన్, పొటాషియం.. మెగ్నీషియం.. వంటివి ఎక్కువగా ఉంటాయి. ఈ జ్యూస్ టెస్ట్ సైతం చాలా బాగుంటుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. మరి ఈ జ్యూస్ ను ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.


palak juice

palak juice



 

ఈ జ్యూస్‌ను ఎలా తయారు చేయాలంటే.. ముందుగా రెండు కప్పులు పాలకూరను శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక యాపిల్ ను తీసుకుని పెద్ద పీసులుగా కట్ చేయాలి. మిక్సీలో ముందుగానే కొన్ని నీళ్లు పోసి, ఈ యాపిల్, పాలకూర ముక్కలను అందులో వేయాలి. వాటిని బాగా మిక్సీ పట్టాక దానికి నిమ్మరసం కలపాలి. ముక్కలు పూర్తిగా గ్రైండ్ అయ్యేలా చూసుకోవాలి. అనంతరం ఆ జ్యూస్‌ను వడకట్టి గ్లాసులో పోసుకోవాలి. అంతే పాలకూర జ్యూస్ రెడీ..


palak juice

palak juice



ఇక దీనితో కలిగే లాభాల్లో లెక్కలేనివి. పాలకూరలో విటమిన్ కే ఉండటం వల్ల ఎముకల్లో కాల్షియాన్ని పెంచేందుకు తోడ్పడుతుంది. పాలకూరలో క్లోరోఫిల్, బీటా కెరోటిన్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే మాక్యులా.. రెటీనాకు సంబంధించిన ఒక పార్ట్. ఇది నేచురల్ సన్‌బ్లాక్, హానికలిగించే కాంతి నుంచి కంటికి రక్షణ ఇస్తుంది. గుండె ఆరోగ్యం సైతం మరింత మెరుగువుతుంది.


benefits of spinach

benefits of spinach



పాలకూరలోని విటమిన్-సి ముడతలు ఏర్పడకుండా చూస్తుంది. కంటి చూపునకు ఇదొక దివ్య ఔషదంగా చెప్పుకోవచ్చు. అందుకే కంటి సమస్యలు ఉన్న వారు పాలకూరను ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. మరింకెందుకు ఆలస్యం మీరు సైతం ఈ జ్యూస్ ను ట్రై చేయండి. ఇందులో ఉండే పోషకాలతో మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి. ఇది కేవలం అవగాహన కోసం చెప్పిన టిప్ మాత్రమే. ఇలాంటివి ఫాలో అయ్యే ముందు ఓ సారి డాక్టర్ ను సంప్రదించి వారి సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం

Tags

Latest News

Related News