Hot Water: వేడి నీటి స్నానంతో గుండె పోటుకు, పక్షవాతంకు దూరం

Hot Water ఎక్కువ శాతం మంది చలి కాలం కూడా చన్నీటి స్నానాలు చేస్తూ ఉంటారు. చలి కాలం చన్నీటి స్నానం అస్సలు మంచిది కాదంటూ నిపుణులు చెబుతున్నారు. మినిమంగా వేడి ఉన్న నీటితోనే స్నానం చేయాలంటూ చర్మ సంబంధిత వైధ్యులు కూడా అంటూ ఉన్నారు. చన్నీటి స్నానం చేయడం వల్ల చర్మ సమస్యల నుండి మొదలుకుని గుండెకు సంబంధించిన సమస్యల వరకు తలెత్తే అవకాశం ఉందని వైధ్యులు అంటున్నారు. తాజాగా ప్రముఖ జపాన్‌ యూనివర్శిటీ వారు […].

By: jyothi

Published Date - Mon - 2 August 21

Hot Water: వేడి నీటి స్నానంతో గుండె పోటుకు, పక్షవాతంకు దూరం

Hot Water ఎక్కువ శాతం మంది చలి కాలం కూడా చన్నీటి స్నానాలు చేస్తూ ఉంటారు. చలి కాలం చన్నీటి స్నానం అస్సలు మంచిది కాదంటూ నిపుణులు చెబుతున్నారు. మినిమంగా వేడి ఉన్న నీటితోనే స్నానం చేయాలంటూ చర్మ సంబంధిత వైధ్యులు కూడా అంటూ ఉన్నారు. చన్నీటి స్నానం చేయడం వల్ల చర్మ సమస్యల నుండి మొదలుకుని గుండెకు సంబంధించిన సమస్యల వరకు తలెత్తే అవకాశం ఉందని వైధ్యులు అంటున్నారు. తాజాగా ప్రముఖ జపాన్‌ యూనివర్శిటీ వారు చేసిన ఒక అధ్యాయనంలో ఆసక్తికర విషయాలు వెళ్లడి అయ్యాయి. వేడి నీటితో స్నానం చేస్తున్న వారి ఆరోగ్యంను పరిశీలించగా వారికి గుండె పోటు రావడానికి ఛాన్స్ లు చాలా తక్కువగా ఉన్నాయట. రెగ్యులర్ గా వేడి నీటి స్నానం చేస్తున్నట్లుగా చెప్పిన వారిలో ఎక్కువ శాతం మంది తమకు గుండెకు సంబంధించిన ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. దాంతో వారు వేడి నీటి స్నానం వల్ల గుండె పోటు నుండి దాదాపుగా 30 శాతం వరకు తప్పించుకోవచ్చు అంటూ గుర్తించారు.

గుండెకు సంబంధించిన పరిశోదనలో కూడా ఈ విషయాన్ని నిర్థారించారు. వేడి నీటితో స్నానం అనేది ఆరోగ్యానికి అన్ని విధాలుగా మంచిదంటూ ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతున్నారు. గుండె పోటు నుండి మాత్రమే కాకుండా పక్ష వాతం కూడా రాకుండా వేడి నీటి స్నానం ఉపయోగదాయకం అంటూ నిపుణులు చెబుతున్నారు. ఏళ్ల తరబడి వేడి నీటితో స్నానం చేసిన వారిలో ఎక్కువ శాతం పక్షవాతం వచ్చే అవకాశాలు లేవని వారు చెబుతున్నారు. సుదీర్ఘ కాలంగా వేడి నీటితో స్నానం చేస్తున్న కొన్ని వందల మందిని ప్రశ్నించిన సమయంలో వారికి పక్షవాతం గురించిన సమస్యలు తలెత్తలేదని పేర్కొన్నారు.

ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటీ అంటే పక్ష వాతం వచ్చిన వారిలో కొద్ది మందిని ప్రశ్నించగా వారు వేడి నీటి స్నానం అలవాటు లేదని చెప్పుకొచ్చారట. అంటే వేడి నీటిని స్నానం చేయక పోవడం వల్ల వారికి పక్షవాతం వచ్చింది అనడంలో 60 శాతం ఛాన్స్ ఉందని వారు అధ్యనంలో వెళ్లడించారు. ఇక గుండె పోటు వచ్చిన వారి స్నానం అలవాటును గురించి కూడా వారు అడిగి తెలుసుకుని షాక్‌ అయ్యారు. గుండె పోటు ను ఎదుర్కొన్న వారిలో చాలా మంది కి వేడి నీటి స్నానం అలవాటు లేదట. అందుకే వేడి నీటితో స్నానం చేయడం వల్ల గుండెకు మంచిదని వారు నిర్థారణకు వచ్చారు. గుండె పోటు నుండి అనేక అనారోగ్య సమస్యలకు వేడి నీటి స్నానం ఆమోద యోగ్యం అంటున్నారు.

వేడి నీటి స్నానం మాత్రమే కాకుండా గోరు వెచ్చని వేడి నీటితో నింపిన టబ్ లో రెగ్యులర్ గా అయిదు నుండి పది నిమిషాలు జలకాలు ఆడటం వల్ల గుండె సమస్యలు దరి చేరవు అంటూ వారు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. మరెందుకు ఆలస్యం అదేదో ప్రయత్నించండి. మీరు ఇప్పటికి చన్నీటి స్నానం చేస్తాము.. మాకు ఏం భయం లేదు అంటే మాత్రం మీ ఇష్టం.

Latest News

Related News