Heart Disease : ప్రస్తుత కాలంలో, బిజీ లైఫ్ లో మనిషి పరుగులు పెడుతున్నాడు. ఒత్తిడిని ఎదుర్కోవడం, టైంకు భోజనం చేయకపోవడం, సమయానికి నిద్రపోక పోవడం వంటివి రెగ్యులర్ గా ఎదురవుతూనే ఉన్నాయి. కొం మంది నైట్ డ్యూటీలో చేసే టైంలో నిద్రపోవడం అస్సలు వీలు పడదు. ఉదయం టైంలో పడుకుందామంటే నిద్రపట్టదు. ఇందుకు అనేక కారణాలుంటాయి. ఇంట్లో పిల్లలు ఉండటం వల్ల వారితో టైం స్పెండ్ చేయడం లేదంటే డిస్టబెన్స్ వల్ల డే టైంలో పడుకోవడం వీలుపడదు. ఇలా టైంకు నిద్రపోకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. వీటిలో ముఖ్యంగా గుండెకు సంబంధించిన వాధ్యులు తలెత్తే ప్రమాదముంది.
heart disease
ప్రస్తుత లైఫ్ స్టైల్ వల్ల జీవితంలో అనేక మార్పులు తలెత్తుతున్నాయి. వాటికి అనుగుణంగా మన అవసరాల కోసం, బాడీ రెస్ట్ కోసం సరిపడ టైం కేటాయించడం తప్పనిసరి లేదంటూ ఇబ్బందులే. ప్రస్తుతం కాలంలో చాలా మంది హార్ట్ కు సంబంధించిన డిసీజ్‌ల బారిన పడుతున్నారు. ఒకప్పుడు హార్ట్ స్ట్రోక్ చాలా తక్కువ మందికి వచ్చేది. అది కూడా వయస్సు పై బడిని వారిలో మాత్రమే ఇది కనిపించేది. కానీ ప్రస్తుతం వయస్సుతో నిమిత్తం లేకుండా చాలా మంది దీని బారిన పడుతున్నారు. ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు సైతం అనేకమే.
late sleep
హర్ట్‌కు సంబంధించిన డిసీజ్‌లను, స్ట్రోక్ వంటి ప్రమాదాలను నివారించేందుకు నిద్రతోనే చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లోనూ ఇవే విషయాలు బహిర్గతమయ్యాయి. మన నిద్రే మన గుండెపై ఎఫెక్ట్ చూపుతుంది. రాత్రి సమయంలో లేట్ గా నిద్రపోయే గుండే హెల్త్ దెబ్బతింటున్నదని చెబుతున్నారు వైద్యులు. టైంకు నిద్రపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవంటున్నారు. బాడీకి తగినంత నిద్ర ఉండటపోతే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండలేము. రోజు ఆలస్యంగా నిద్రపోయేవారిలో సిర్కాడియన్ రిథమ్ తగ్గుతుంది దీన్ని నివారించాలంటే. నైట్ 10 నుంచి 11 గంటల మధ్య నిద్రపోవాలని చెబుతున్నారు పరిశోధకులు. ముఖ్యంగా లేట్‌గా నిద్రపోయే మహిళలు ఈ టైంను తప్పనిసరిగా పాటించాలి. ఆలస్యంగా పడుకునే వారు మార్నింగ్ ఆలస్యంగా నిద్ర లేస్తారు. ఇది వారి గుండెపై ప్రభావం చూపుతుంది. రాత్రి పూట త్వరగా నిద్రపోవడం వల్ల గుండె జబ్బులు తలెత్తకుండా చూసుకోవచ్చు.
heart disease
తాజాగా చేసిన పరిశోధనల్లో.. నైట్ లేట్ గా నిద్రపోయే వారిలో హార్ట్ డిసీజ్ లు, గుండె పోటు, గుండె ఫెయిలవడం వంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని గుర్తించారు. లేట్ గా పడుకునే వారిలో 25 శాతం ఎక్కువగా హార్ట్ కు సంబంధించిన డిసీజ్ లు వచ్చే చాన్స్ ఉందని పరిశోధకులు వెల్లడించారు.