Dandruff:ప్రస్తుత బిజీ జీవితంలో ప్రతి ఒక్కరూ చండ్రు సమస్యతో సతమతమవుతున్నారు. మార్కెట్లో లభించే ఎన్నో రకాల షాంపూలను ట్రై చేసినా కానీ కొంత మందికి మాత్రం ఈ సమస్య తగ్గదు. వారు చాలా నిరాశకు లోనవుతుంటారు. ఇలా చుండ్రు సమస్యతో సతమతమయ్యే వారి కోసం ఎటువంటి చిట్కాలను వాడాలని చాలా మంది నిపుణులను సంప్రదిస్తున్నారు. నిపుణులు కూడా ఏదో ఒకటి వారికి సజెస్ట్ చేస్తున్నారు. కొంత మంది ఎన్నో రకాల షాంపూలను ట్రై చేసినా కానీ చుండ్రు సమస్య దూరం కావడం లేదని చెబుతారు. కానీ చుండ్రు సమస్యకు చాలా సింపుల్ చిట్కాను వాడి ఆ సమస్య నుంచి మనం విముక్తులం కావచ్చునని చాలా మంది చెబుతున్నారు. అసలు ఆ చిట్కా ఏంటి ఎలా వర్క్ చేస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Garlic For Dandruff Benefit
చుండ్రు సమస్యతో బాధపడే వారు ఇంట్లోనే తయారు చేసుకునే ఓ మిశ్రమాన్ని వాడి ఆ సమస్య నుంచి గట్టెక్కొచ్చు. ఇలా చేయడం చాలా ఈజీ. ఏం చేయాలంటే.. మనకు ఇంట్లో లభించే కొన్ని ఉల్లిపాయలను తీసుకుని వాటిని చిన్నముక్కలుగా చేసుకోవాలి. అలా వాటిని చిన్నగా తరుముకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ మీద ఉంచాలి. ఆ ప్యాన్ మీద కొబ్బరి నూనెను పోసి కొద్ది సేపు వేడి చేయాలి. అనంతరం మనం ముందుగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలను ఆ నూనెలో వేసి బాగా మరిగించాలి. ఇలా కొద్ది సేపు ఉంచిన తర్వాత వెల్లుల్లి ముక్కలు నలుపు రంగులోకి మారడం మనం గమనించవచ్చు. ఇలా నలుపు రంగులోకి వెల్లుల్లి ముక్కలు మారుతున్న సమయంలో స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత వేడి చేసిన నూనెలోంచి వెల్లుల్లి ముక్కలను వడబోసుకుని నూనెను నిల్వ చేసుకోవాలి.
garlic for dandruff
ఇలా తయారు చేసుకున్న నూనెను ప్రతి రోజు మన జుట్టుకు మర్ధనా చేసుకుంటే గనుక వెంటనే చుండ్రు సమస్య తగ్గిపోతుంది. అంతే కాకుండా మన జుట్టు కూడా ఒత్తుగా తయారవుతుంది. మనకు వెంట్రుకలు రాలిపోయే సమస్య కూడా దూరమవుతుంది. ఇలా ఆ నూనెను మన జట్టుకు మర్ధనా చేసిన తర్వాత ఒక గంట సేపు అలాగే ఉంచుకోవాలి. అనంతరం తల స్నానం చేయాలి. ఇలా చేయడం వలన మనకు వచ్చే అనేక రకాల జట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధానం ట్రై చేసి చూడండి.
dandruff