Platelets : ప్రెసెంట్ మారుతున్న జీవనశైలి కారణంగా అందరు ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్లేట్ లెట్స్ పడిపోవడం కూడా ఉంది. చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్లేట్ లెట్స్ పడిపోతే చాలా ప్రమాదం. డెంగీ జ్వరం వచ్చిన వారికీ భారీగా ప్లేట్ లెట్స్ పడిపోవడం జరుగుతుంది. ఈ జ్వరం వస్తే చాలు.. ముందుగా వచ్చే సమస్య ప్లేట్ లెట్స్ పడిపోవడమే.. ఇక ఇలా ప్లేట్ లెట్స్ పడిపోతే ప్రాణాలకు కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది.
అయితే శరీరంలో పడిపోయిన ప్లేట్ లెట్స్ ను ఎలా పెంచుకోవాలో తెలుసుకోవాలంటే క్రింద ఉన్న విధంగా ఫాలో అయిపోవాల్సిందే. వైద్యులు ఇచ్చే మందులతో పాటు ఈ చిట్కాలను కూడా అవలంబిస్తే తొందరగా ప్లేట్ లెట్స్ ను తిరిగి పెంచుకోవచ్చు.
platelets
ఇక ప్లేట్ లెట్స్ తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల శరీరంలో ప్లేట్ లెట్స్ తగ్గిపోతాయి. వీటి వల్లనే కాదు పుట్టుకతో వచ్చే జన్యులోపాల కారణంగా, లేదంటే గుండె సంబంధించిన వ్యాధులు ఉన్న వారికీ కూడా ప్లేట్ లెట్స్ తగ్గే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. తెల్ల రక్తకణాలు వ్యాధి నిరోధకులుగా పనిచేస్తూ రోగాల బారిన పడకుండా కాపాడుతుంటాయి.
platelets
సాధారణంగా ఒక వ్యక్తిలో 1.5 లక్షల నుండి 4.5 లక్షల ప్లేట్ లెట్స్ ఉంటాయి. రక్తాన్ని గడ్డ కట్టించి ప్రాణానికి రక్షణ కలిగించే కీలకమైన కణాలు ప్లేట్ లెట్స్. ఇక ఈ ప్లేట్ లెట్స్ పడిపోకుండా ఉండాలన్న.. కొత్త ప్లేట్ లెట్స్ తయారు కావాలన్నా కొన్ని ఆహార పదార్దాలను తినడం వల్ల సాధ్యపడుతుంది. ఎండుఖర్జురామ్, కిస్ మిస్ యిండ్లను తింటే ప్లేట్ లెట్స్ ను పెంచుకోవచ్చు.
platelets
ఆప్రికాట్ పండ్లు తింటే రక్తం వృద్ధి చెంది ప్లేట్ లెట్స్ పెరిగేలా చేస్తాయి. ఇక బొప్పాయి అయితే ప్లేట్ లెట్స్ ను తొందరగా పెరిగేలా చేస్తుంది. డెంగీ జ్వరం వచ్చిన సమయంలో బొప్పాయి ని తింటే మంచి ఔషధంగా పని చేయడమే కాకుండా తొందరగా కోలుకునేలా చేస్తుంది. అలాగే ఆకుకూరలు, కూరగాయలను ఎక్కువుగా తీసుకుంటే వీటిలోని విటమిన్ కే ప్లేట్ లెట్స్ సంఖ్యను పెంచుతాయి. ఇంకా దానిమ్మ గింజలు, బీట్ రూట్, వెల్లుల్లి రెబ్బలు తింటే ప్లేట్ లెట్స్ సంఖ్య పెరిగి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.